నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, ఫిబ్రవరి 2023, గురువారం

తుర్కియే, సిరియా భూకంపాలకు గాబ్రియేల్, అంబేడ్కర్లే కారణం

ఈ లోకంలో ఏదీకూడా కారణం లేకుండా జరగదు. మనుషుల జీవితాలైనా అంతే, దేశాలపరంగా చూచినపుడు కూడా అంతే. ఒకప్పుడు చేసినదానికి ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది. కాకపోతే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. వీటికి మనుషులూ అతీతులు కారు. దేవదూతలూ అతీతులు కారు.

జీవితంలో జరిగే సంఘటనలకైనా, దేశాలలో జరిగే సంఘటనలకైనా, ప్రతిదానికీ కర్మకారణాలుంటాయి. వెనక్కు తిరిగి చూచుకుంటే అర్ధమౌతాయి. అయితే, వాటిని లింక్ చేసుకునే దృష్టి చాలామందిలో ఉండదు. అంతే.  

జ్యోతిష్యపరంగా చూస్తే, మొన్న 5 వ తేదీ పౌర్ణమి అయింది. 6 వ తేదీ ఈ భూకంపాలు జరిగాయి. భూకంపాలన్నీ అమావాస్య, పౌర్ణమి ఛాయలలోనే ఎక్కువగా జరుగుతాయని గర్గమహర్షి తన జ్యోతిష్యశాస్త్రంలో ఎప్పుడో చెప్పాడు. 'ఛత్. వాటికీ భూకంపాలకు సంబంధం ఏంటి? నాన్సెన్స్' అని మనమంటాం. అది వాళ్ళ తెలివి, ఇది మన తెలివి.

ఈయన ఎప్పటివాడో ఎవరికీ తెలియదు. నేటికి కనీసం 6000 సంవత్సరాల క్రిందటివాడని ఒక ఊహ. మహర్షులు ఎప్పుడో చెప్పినవి ఇప్పటికీ నిజాలౌతూ ఉండటం మన కళ్ళెదురుగా కన్పిస్తున్న నిజం. కాకపోతే మన మహర్షులు మనకు గుర్తుండరు కదా! వాళ్ళనెప్పుడో మనం మరచిపోయాం. ప్రస్తుతం మనకు కనిపించేది బ్రహ్మకుమారీలూ, సాయిబాబాలే కదా ! సర్లే, ఈ గోల ఎపుడూ ఉండేదే. 

మన టాపిక్కు లో కొద్దాం.

ఇకపోతే, కొంతమంది  రీడర్స్ నన్నడుగుతున్నారు, 'ఇది చాలా భయంకరమైన భూకంపం కదా. ఎందుకు జరిగిందో జ్యోతిష్యపరంగా మీరు వ్రాయలేదేమిటి?' అని.

నిజమే. ఇది భయంకరమైన భూకంపమే. రెండుదేశాలలో కలిపి 33,000 మంది పైనే దీనివల్ల చనిపోయారు. ఎందుకు ఇది జరిగిందో కూడా వ్రాద్దామని అనుకున్నాను. కానీ జ్యోతిష్యం కంటే ఇంకా లోతైన కారణాలు దీనివెనుక ఉన్నాయి అందుకని వ్రాయలేదు. అవేంటో ఇప్పుడు వ్రాస్తాను.

చదూకోండి. తరించండి.

స్వీడన్ లో ఖురాన్ ను తగలబెట్టారు. ఒకసారి కాదు. చాలాసార్లు పబ్లిగ్గా తగలబెట్టారు. అదికూడా తుర్కీయే ఎంబసీ ముందు తగలబెట్టారు. ఎందుకంటే, స్వీడన్ లో ముస్లిములు అణచివేతకు గురౌతున్నారని, వారికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని, ఎంతమందిని పడితే అంతమందిని కనలేకపోతున్నారని, జనాభాను  విపరీతంగా పెంచేసి స్వీడన్ను ఆక్రమించలేకపోతున్నారని, అలా చెయ్యకుండా స్వీడన్ చట్టాలు వారిని అడ్డుకుంటున్నాయని, ఇది వివక్ష అని, తుర్కీయే ప్రెసిండెంట్ ఎర్డోగాన్ ఎంతో బాధపడ్డాడు.

'అలా చెయ్యద్దు. ముస్లిముల జనాభాను పెరగనివ్వండి. మీ దేశాన్ని కూడా ఆక్రమించి, అల్లర్లురేపి, అతలాకుతలం చేసి, స్వీడన్ కు కూడా పాకిస్తాన్ గతి పట్టేలా వారిని చెయ్యనివ్వండి. అలా చేయనివ్వకుండా ముస్లిములను కట్టడి చెయ్యడం అన్యాయం. ఇది అణచివేత మాత్రమే కాదు, ఇస్లాంకు, ఖురాన్ కు విరుద్ధం కూడా ' అంటూ, స్వీడన్ ను గట్టిగా హెచ్చరించాడు కూడా. అందుకని,  దీనికి నిరసనగా స్టాక్ హోమ్ లోని తుర్కీయే ఎంబసీ ముందు  రాస్మస్ పలుదన్ అనే డేనిష్ నాయకుడు ఖురాన్ ను తగలబెట్టాడు.

ఈ రాస్మస్ పలుదన్ అనేవాడు, గతజన్మలో అంబేద్కర్ అని నా గట్టి నమ్మకం. ఎందుకంటే, పుస్తకాలను పూర్తిగా చదవకుండా తగలబెట్టడం అనే మంచి సాంప్రదాయాన్ని మొట్టమొదటగా మొదలుపెట్టింది అంబేద్కరే గనుక. మనుస్మృతిలో రెండు మూడు శ్లోకాలు తనకు నచ్చలేదని, ఆ పుస్తకాన్ని మొత్తం చదవకుండానే దాన్ని రోడ్డుమీద తగులబెట్టాడు అంబెడ్కర్. కానీ, స్త్రీలను అమితంగా గౌరవిస్తూ, వారిని దేవతలుగా భావిస్తూ చెప్పబడిన శ్లోకాలు కూడా మనుస్మృతిలో ఎన్నో ఉన్నాయి.  నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడే ఎన్నో శ్లోకాలను మనువు చెప్పినట్లు అందులో  మనం చూడవచ్చు. అంబెడ్కర్ వాటిని చదవలేదు. చదవలేదని తానే ఒక స్పీచిలో ఒప్పుకున్నాడు. ఎందుకంటే, ఆయన ఎన్నో యూరోపియన్ భాషలను నేర్చుకున్నాడు గాని, పాపం తనదేశపు మాతృభాష అయిన సంస్కృతాన్ని మాత్రం నేర్చుకోలేదు. అది ఆయనకు రాదు. అందుకని మనుస్మృతి మూలగ్రంధాన్ని ఆయన చదవలేదు. ఎవరో చేసిన అనువాదాన్ని చదివాడు. అలాంటి అభిప్రాయానికి వచ్చాడు.

సరే అదంతా గతం. ప్రస్తుతంలోకి వద్దాం.

ఆ అంబేద్కరే ఇప్పుడు స్వీడన్ లో రాస్మస్ పలుదన్ అనే లీడర్ గా పుట్టాడు. గతజన్మ అలవాట్లను మర్చిపోలేక, ఈ జన్మలో కూడా ఏదో ఒక పుస్తకాన్ని అర్జెంటుగా తగలబెడదామని గట్టిగా నిశ్చయించేసుకున్నాడు.  స్వీడన్ లో మనుస్మృతి దొరకదు కదా? కనీసం రామచరిత మానస్ కూడా దొరకదు. మరేం చెయ్యాలి? ఖురాన్ దొరికింది. సర్లే ఏదో ఒకటిలే అని, దాన్ని తగలబెట్టేశాడు. గతజన్మ అలవాట్లు అంత తేలికగా పోవుకాదా మరి !

తుర్కీయే గొల్లుమంది. మిడిల్ ఈస్ట్ భగ్గుమంది. నిరసనలు, ధర్నాలు, ఊరేగింపులు మొదలయ్యాయి.  ఈ గొడవంతా స్వర్గంలోని అల్లాకు వినిపించింది. పరమచిరాకును తెప్పించింది. వెంటనే గాబ్రియేల్ ను పిలిపించాడు.

'ఏరా గాబ్రియేల్ ! స్వీడన్ లో ఖురాన్ ను తగలబడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? నీకసలు బుద్దుందా? వెంటనే భూలోకానికి వెళ్లి, స్వీడన్ లో భూకంపం సృష్టించి, దాన్ని సర్వనాశనం చేసేయ్' అని కోపంగా ఆజ్ఞాపించాడు.

సాక్షాత్తు అల్లాయే ఆ విధంగా ఆజ్ఞాపించాక పూర్ గాబ్రియేల్ ఏం చెయ్యగలడు? వెంటనే భూలోకానికి బయల్దేరాడు. చైనా మీదుగా యూరప్ లో దిగాడు. అదే అతను చేసిన ఘోరమైన తప్పు. అక్కడే అసలు సమస్య ఎదురైంది.

గాబ్రియేల్ ఇప్పటివాడు కాదు. దాదాపు 5000 ఏళ్ళనాటివాడు. ఓల్డ్ టెస్టమెంట్ లోనే అతని ప్రస్తావన ఉంటుంది. కాబట్టి చాలా వయసు పైబడిన వాడే. అందుకని మతిమరుపు వచ్చేసింది. అతడు చేసిన పొరపాటేంటంటే చైనా మీదుగా యూరప్ లో దిగడం.  చైనాను క్రాస్ చేస్తున్నప్పుడే, అతన్ని కరోనా వైరస్ ఎటాక్ చేసింది. దాంతో యూరప్లో దిగేసరికి పూర్తిగా కరోనా లక్షణాలతో దిగాడు. మైండ్ బ్లాంక్ అయింది. అల్లా తనకు ఏమని ఆజ్ఞాపించాడో మరచిపోయాడు.

ఎంతో ప్రాచీనకాలం నుంచీ గాబ్రియేల్ అనే దూత, సిరియా, తుర్కీయే ప్రాంతాలలోనే ఎక్కువగా తిరిగేవాడు. ప్రతివారికీ కన్పిస్తూ సలహాలిస్తూ ఉండేవాడు.  అతనికి బాగా తెలిసిన ప్రాంతాలు అవే. గూగుల్ మ్యాప్ సహాయం లేకుండా ప్రపంచంలో అతడు ఈజీగా తిరగ్గలిగే ప్రాంతాలు ఈ రెండే. అందుకని, 'ఏ దేశంలో భూకంపాన్ని సృష్టించమని అల్లా ఆజ్ఞాపించాడబ్బా?' అని ఎంత చించుకున్నా, స్వీడన్ పేరు అతనికి గుర్తురాలేదు.  ఎంతసేపూ తనకు అలవాటైన సిరియా, తుర్కీయే ఈ రెండే గుర్తొస్తున్నాయి. అది కరోనా ప్రభావం ! దానివల్ల అతని బ్రెయిన్ డామేజి అయింది. పూర్ ఓల్డ్ గాబ్రియేల్ ! ఏం చెయ్యగలడు పాపం.

సరే, ఏమీ చెయ్యకుండా వెనక్కు వెళితే అల్లా ఖచ్చితంగా తన తాట తీస్తాడు. నరకాగ్నిలో పడేసి వితౌట్ ఆయిల్ వేపుతాడు. కాబట్టి ఏదో ఒకటి చేసే పోవాలి.  అందుకని తన చేతులో ఉన్న మంత్రదండంతో సిరియా, తుర్కీయేలను ఒక చాపు  చరిచాడు. అంతే ! ఆ రెండు దేశాలలోని వేలాది భవనాలు పేకమేడల్లాగా కూలిపోయాయి. ఇప్పటికి దాదాపు  33,000 మంది చచ్చారని వార్తలు చెబుతున్నాయి.  ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఏడాది నుంచీ జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోయి ఉండరు. గాబ్రియేల్ దెబ్బంటే అలా ఉంటుంది మరి ! ఏమనుకుంటున్నారు!

దీనివెనుక జ్యోతిష్యం లేదు పాడూ లేదు. గాబ్రియేల్ మతిమరుపే దీనికంతా కారణం. అల్లా ఒకటి చెబితే, తాను మరొకటి చేశాడు. అందుకే అల్లా జరిగింది. అందుకే ఈ సంఘటన పైన నేను జ్యోతిష్య విశ్లేషణ చెయ్యలేదు.

దేవరహస్యాలు ఇలా ఉంటే, మనమేమో శని, కుజుడు, రాహువు, కూర్మచక్రం, సర్వతోభద్రచక్రం అంటూ జ్యోతిష్యంలో వెదికితే ఎలా దొరుకుతాయి  కారణాలు? 

గాబ్రియేల్ చైనా మీదుగా వెళ్లకుండా, ఇండియా మీదుగా వెళ్లుంటే అసలీ ప్రాబ్లమ్ వచ్చేదే కాదు. పనిలో పనిగా, ఇండియాలో వాక్సిన్లు వేసుకుని ఆ తరువాత స్వీడన్ లో దిగుంటే ఇలా జరిగేదీ కాదు. అల్లా చెప్పింది చెప్పినట్టు అల్లాగే జరిగి ఉండేది. దీనికంతా కారణం గాబ్రియేల్ ముసలితనం, మతిమరుపు, కరోనా ఎఫెక్టులు మాత్రమే.

కనీసం, రాస్మస్ పలుదన్ గా పుట్టిన అంబేద్కర్, ఖురాన్ను తగలబెట్టకపోయినా, ఈ భూకంపాలు తప్పి ఉండేవి. 'మనకు నచ్చనంత మాత్రాన పుస్తకాలను పూర్తిగా చదవకుండా అలా తగలబెట్టకూడదురా, తప్పురా' అంటే,  అతనూ వినడు. 'నీకు వయసై పోయింది. 5000 ఏళ్ల నుంచీ అలుపు లేకుండా పనిచేస్తూనే ఉన్నావు. ఇంకెంతకాలం ఏడుస్తావు? ఇక రిటైర్ అవ్వు. ఎవడో ఒక కుర్రాడు నీ ఉద్యోగంలో చేరి చక్కగా పనిచేసుకుంటాడు' అని  చెబితే గాబ్రియేలూ వినడు.

మనమాట ఎవడూ వినడు. ఇంకా చెప్పాలంటే, మన శిష్యులే మనమాట పూర్తిగా వినిపించుకోరు ఇక వేరే వాళ్ళు ఎందుకు వింటారు? 

సరే, ఇవన్నీ కలసి ఈ విధంగా స్వీడన్ని రక్షించేశాయి. పాపం, అమాయకులైన సిరియా, తుర్కీయేల కొంపలు ముంచాయి. ఏం చేస్తాం? మనం కేవలం మానవమాత్రులం, ఎక్కువ మాట్లాడకూడదు మరి !

అందుకని, తుర్కియే, సిరియా భూకంపాలకు గాబ్రియేల్, అంబేడ్కర్లే కారణం. ఈ విషయాన్నీ డోబ్రియెల్ అనే ఇంకొక దేవదూత స్వయానా నిన్నరాత్రి నా కలలోకి వచ్చి మరీ చెప్పాడు. ఏమంటే, గాబ్రియేల్ కూ డోబ్రియెల్ కూ అస్సలు పడదట. ప్రొఫెషనల్ రైవల్రీ ఉందట. అందుకని, 'ఎవరికీ చెప్పకు. ఇది దేవరహస్యం' అని గట్టిగా వార్ణింగ్ ఇచ్చి మరీ, ఈ సీక్రెట్ ని నాకు లీక్ చేశాడు, నిన్న రాత్రి కలలో.

జెట్ లాగ్ వల్ల మనకు నిద్రపట్టదు కదా ! అటూ ఇటూ దొర్లుతున్నాం. మొదట్లో ఏదో పీడకలలే అనుకున్నా, కాదని కొద్దిసేపట్లోనే అర్ధమైంది. ఇంకేముంది, దేవరహస్యం అర్ధమైపోయింది. వెంటనే లేచిపోయి ఇదంతా రాసేస్తున్నానన్నమాట !

దేవరహస్యాలను మీకందరికీ లీక్ చెయ్యకపోతే నాకు పొట్టుబ్బరం కదా మరి !