“అసమర్ధజాతికి ఆత్మగౌరవ అర్హత ఉండదు"

24, ఆగస్టు 2023, గురువారం

WELL DONE ISRO

23 ఆగస్టు 2023

ఇండియా చరిత్రలో మరపురాని రోజు.

చంద్రుని దక్షిణధృవం పైన ఇండియా పంపిన లాండర్ దిగింది.

ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం మన దేశమే అయింది.

కేవలం 615 కోట్ల ఖర్చుతో ఈ పనిని ISRO సాధించింది. ఇది ఒక మల్టీ స్టారర్ బాలీవుడ్ సినిమా తియ్యడానికి అయ్యే ఖర్చుకంటే తక్కువే. ఇండియన్ రాకెట్ల కున్న శక్తి కూడా తక్కువే. కానీ భూమి, చంద్రుల గ్రావిటీని తెలివిగా వాడుకుని ISRO ఈ విజయాన్ని సాధించింది. అంటే, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పనిని చెయ్యగలిగింది. ఇదే అసలైన తెలివికి నిదర్శనం.

ఇది ప్రతి భారతీయుడు గర్వపడవలసిన క్షణం. పండుగ చేసుకోవలసిన క్షణం.

ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అపజయాలకు భయపడకుండా, ముందటి తప్పులను దిద్దుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసిన పట్టుదలలు ఉన్నాయి. ఏ విజయానికైనా ఇవే దారులు.

నిద్రాహారాలు మానుకుని ఏళ్లకేళ్లు పనిచేసి ఈ కలను  నిజం చేసిన ISRO శాస్త్రవేత్తలను, వారి వెన్ను తట్టి ప్రోత్సహించిన మోడీగారిని ఎంత అభినందించినా తక్కువే అవుతుంది. చంద్రయాన్ -2 విఫలమైనప్పుడు, అప్పటి ISRO చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.  మోదీజీ ఆయన వెన్నుతట్టి ఓదార్చి 'పరవాలేదు మళ్ళీ చేద్దాం' అన్నారు. మోదీగారికి మనం ప్రణామాలు అర్పించాలి.

అయితే, యధావిధిగా అనేక దేశాల, మనుషుల స్పందన చాలా నీచంగా ఉంది.

ఇండియాలో అయితే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, హేతువాద, నాస్తిక, క్రైస్తవ సంఘాలు, ముస్లిములలో ఎక్కువమంది నెగటివ్ కామెంట్స్ ఇచ్చారు. లేదా మౌనంగా ఉండిపోయారు. ఇది వాళ్ళ దేశభక్తి లేమికి పక్కా నిదర్శనం.

కొందరేమో ఈ విజయాన్ని నెహ్రూ కు అంటగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు గాంధీ, నెహ్రూ అనే ఇద్దరు వ్యక్తులు లేకపోయి ఉన్నట్లయితే, మనకు స్వాతంత్రం ఇంకా ముందే వచ్చి ఉండేది. దేశం ఇంకా త్వరగా ఎదిగి ఉండేదని, నేడు ఉన్నన్ని సమస్యలు ఉండేవి కావని నా నమ్మకం. దీనికి చారిత్రిక ఆధారాలున్నాయి. గాంధీ నెహ్రూలను భారతీయులు ఎంత త్వరగా పక్కన పెడితే దేశానికి అంత మంచిది.

ఇకపోతే, అగ్రరాజ్యాలు అసూయతో రకరకాల కామెంట్స్ చేశాయి. బ్రిటన్ పౌరులు అయితే, 'చంద్రునిపైకి రాకెట్ పంపగలిగిన దేశానికి మనం ధనసాయం చెయ్యడం ఏంటి? ఇప్పటిదాకా ఇచ్చిన సాయాన్ని వెనక్కు కట్టమని ఒత్తిడి చెయ్యాలి' అని నీచంగా కామెంట్ చేశారు. గతంలో ఒకసారి, 'బ్రిటన్ మనకు చేసే ధనసాయం పీనట్స్ లాంటిది' అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పైగా, ఆ డబ్బులో ఎక్కువశాతం NGOs కు పోతుంది. అవేమో, మతమార్పిళ్లకు ఆ డబ్బును వాడుతున్నాయి. ఏదో పెద్ద ఇండియాను ఉద్ధరిస్తున్నట్టు పోజొకటి.

నెటిజన్స్ చాలా బాగా ఈ ఏడుపును తిప్పి కొట్టారు.

'రెండు వందల ఏళ్లు మా దేశాన్ని దోచుకుని 45 ట్రిలియన్ డాలర్లు బ్రిటన్ ఎత్తుకు పోయింది. అందులో మీ ఎయిడ్ 35 బిలియన్లు తగ్గించి మిగతా డబ్బు వెంటనే ఇండియాకు చెల్లించాలి. అంతకంటే ముందు మా కోహినూర్ వజ్రం మాకివ్వండి' అంటూ వాళ్ళు దీటుగా స్పందించారు 

'నీవలె నీ పొరుగువాడిని ప్రేమించు' అని జీసస్ చెప్పాడని మిషనరీలు ఊదరగొడతారు. మరి పొరుగుదేశం సాధించిన ఒక ఘనవిజయాన్ని మనస్ఫూర్తిగా ఎందుకు అభించనందించలేకపోతున్నాయి క్రైస్తవ దేశాలు? ఏమిటీ హిపోక్రసీ? 

భూమి బల్లపరుపుగా ఉందన్న బైబిల్ వాక్యాలను ఇప్పటికీ నమ్మే క్రైస్తవ దేశాలనుంచి ఒక మంచిమాటను ఆశించడం తప్పే కదూ?

చంద్రుడు రెండు ముక్కలు అయ్యాడని ముస్లిములు ఇప్పటికీ భావిస్తారు. ఖురాన్ లో ఇది సూరా 54. 1-2 లలో వ్రాయబడి ఉంది. అది నిజం కాదని, పక్కా అబద్దమని  ఇలా ఎప్పుడూ జరగలేదని సైన్స్ రుజువుచేసినా కూడా, వాళ్లదే మాటకు కట్టుబడి ఉన్నారు. అలాంటి మతాలను అనుసరించే దేశాలనుంచి ఒక మంచిమాటను ఎలా ఆశించగలం?

పాకిస్తాన్ అయితే కుళ్ళుతో చచ్చిపోయేలాగా ఉంది. అలాంటి బెగ్గర్ కంట్రీ అభిప్రాయాలను మనం అస్సలు  పట్టించుకోనవసరం లేదు.

అయితే కొంతమంది పాకిస్తానీలు మంచి జోకులేసారు.

'మేమున్నది చంద్రుడి పైనే. ఇండియా ఉత్త ల్యాండర్ ను మాత్రమే పంపింది. మేము  ఆల్రెడీ అక్కడే ఉన్నాం. చంద్రుడి పైన కరెంట్ ఉండదు. తాగటానికి నీళ్లుండవు. ఏమీ దొరకదు. పాకిస్తాన్లో కూడా అంతే. మేం చంద్రుడి పైన నివశిస్తున్నాం' అని ఒక పాకిస్తానీ ఏడవలేక నవ్వుతూ అన్నాడు.

గత 75 ఏళ్లుగా  ఇండియా ఎదుగుదలను అగ్రరాజ్యాలు అడుగడుగునా అడ్డుకున్నాయి.  ఒకానొక సమయంలో, మనకు క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ ఇవ్వడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోలేదు. ఆ సమయంలో రష్యా ఒక్కటే మనకు సాయం చేసింది. సహజంగా రష్యా నుండి మనకు హృదయపూర్వకమైన అభినందనలు వెల్లువెత్తాయి. వాళ్ళ లూనా-25 కొద్దిరోజుల క్రితమే చంద్రునిపైన కూలిపోయింది. అయినా సరే, మనల్ని వాళ్ళు అభినందించారు. అదీ అసలైన స్పిరిట్ అంటే !

ఇతర దేశాలలో అయితే, మన మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్ లు, ఇంకా ఆస్ట్రేలియా మాత్రమే మనల్ని నిజంగా అభినందించాయి. మిగతా అన్ని దేశాలు ఏడుస్తూనే కంగ్రాట్స్ చెప్పాయి.

1970 లలో లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజన్ కు, క్రయోజెనిక్ టెక్నాలజీకి ఇండియాలో ఆద్యుడైన ISRO సైంటిస్ట్ నంబి నారాయణన్ ను, అతని సహచరులైన, శశి కుమారన్, చంద్రశేఖరన్, SK శర్మలను దొంగకేసులో ఇరికించి, వారి జీవితాలను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళను జైల్లో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ కుట్ర వెనుక CIA హస్తం ఉంది. ఏమంటే, ఇండియా ఎదగడం అమెరికాకు ఇష్టం లేదు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడింది. సుదీర్ఘంగా సాగిన ఈకేసు చివరకు కొట్టివేయబడింది.  వీళ్ళు నిర్దోషులు అని రుజువైంది. కానీ వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. ఈలోపల మన స్పేస్ ప్రోగ్రాం 30 ఏళ్లు వెనుకబడి పోయింది. కాంగ్రెస్ సాయంతో అమెరికా ఇంత కుట్రను తెరవెనుక ఉండి నడిపించింది.

మోడీ గారి ప్రభుత్వం వచ్చాక మాత్రమే, 2019 లో, నంబి నారాయణన్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వబడింది. ఈయన వ్రాసిన పుస్తకం, 'Ready to fire: How India and I survived the ISRO spy case' అనే పుస్తకాన్ని చదవండి. నిజాలు తెలుస్తాయి.

ఎవరెలా ఏడ్చినా, ఇండియా ఎదుగుదలను ఏ శక్తీ ఆపలేదు. ఈ శతాబ్దం ఇండియాదే. ఇండియన్స్ లీడర్స్ గా లేకుండా ఏ రంగమూ నేడు ప్రపంచంలో లేదు.

సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడుతూ మన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు, 'ఈ విఙయం ఒక్క ఇండియాదే కాదు. యావత్తు మానవాళిది' అనే అద్భుతమైన మాటన్నారు. అదీ అసలైన మానవత్వంతో కూడిన విశాల మనస్తత్వం అంటే ! ఒక్క హిందువు నోటివెంట మాత్రమే అలాంటి విశ్వజనీనమైన మాట వస్తుంది.

సోమనాధ్ ఆలయం పతనంతో ఇండియా పతనం మొదలైంది. కాశీ విశ్వేశ్వరాలయ ధ్వంసంతో ఇండియా నాశనం కావడం మొదలైంది. అయోధ్యలో రామాలయం విధ్వంసంతో ఇండియా కూడా నాశనం కావడం మొదలైంది.

ఈ మూడూ తిరిగి నిర్మించబడుతున్నాయి. మోదీగారి నాయకత్వంలో ఇండియా మళ్ళీ సూపర్ పవర్ కాబోతోంది.

ISRO  చైర్మన్ పేరుకూడా సోమనాథ్ కావడం కాకతాళీయమా? నేనైతే కాదనే అంటాను.

బయటనుండి వచ్చిన జాతులు, మతాలు  వందలాది ఏళ్లుగా మన దేశాన్ని  అనేక విధాలుగా ఛిన్నాభిన్నం చేశాయి. వాటి కుట్రలు బయటపడి, దేశంలో హిందూమత పునరుజ్జీవనం అయితేనే దేశం మళ్ళీ సూపర్ పవర్ అవుతుంది. ఎవరెన్ని చెప్పినా ఇది సత్యం.

ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను.

ఇంకో నూరేళ్ళపాటు మోడీగారే మన ప్రధానమంత్రిగా ఉండాలి. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఇంకా ఇదే టీమ్ ఆయనతో పనిచేయాలి. దేశద్రోహుల ఆటలు అంతం చెయ్యాలి. ఇదే వేగంతో ఇండియా ఎదగాలి. సూపర్ పవర్ కావాలి. వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్, అరవిందో మొదలైన ఎందరో మహనీయులు కన్న కలలు నిజం కావాలి.

ఇది కోట్లాదిమంది దేశభక్తుల స్వప్నం.

ఇది నిజం కావాలని మన దేశపు దేవతలైన శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని, ఈశ్వరుడిని, అమ్మవారిని  ఇతర దేవతలను, మహర్షులను, గురువులను, మహనీయులను ప్రార్ధిద్దాం.

జై హిందూస్థాన్ ! జై మోదీజీ !

జై భరతమాత !