30, డిసెంబర్ 2024, సోమవారం
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ - 2024 ముగిసింది - పాఠకులకు సూచన
19, డిసెంబర్ 2024, గురువారం
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్
18, డిసెంబర్ 2024, బుధవారం
మా 68 వ పుస్తకం 'మహనీయుల జాతకాలు - జీవితవిశేషాలు' విడుదల
దీనిలో అతి ప్రాచీనకాలం నాటి అవతారపురుషుడైన శ్రీకృష్ణభగవానుని నుండి మొదలుపెట్టి, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభువు, శ్రీరామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానందస్వామి, రమణమహర్షి, మెహర్ బాబా, పరమహంస యోగానంద, అరవిందయోగి, కంచి పరమాచార్య, ఆనందమయి మా, నీంకరోలి బాబా, జిల్లెళ్ళమూడి అమ్మగారు మొదలైన 18 మంది నిజమైన మహనీయుల జాతకాలు మరియు వారివారి జీవితవిశేషాలు సమగ్రంగా వివరించబడ్డాయి.
జాతకవిశ్లేషణలో నేను ఉపయోగించే అనేక జ్యోతిషరహస్యాలు, సూత్రాలను ఈ గ్రంధంలో ఆయాచోట్ల విపులంగా వివరించడం జరిగింది.
వెరసి, ఈ గ్రంధం జ్యోతిషవిద్యార్ధులకు, జ్యోతిషాభిమానులకు, జ్యోతిషాన్ని నేర్చుకునేవారికి, మన దేశపు అసలైన చరిత్రను, నా పుస్తకాలను మరియు భావజాలాన్ని ఇష్టపడేవారికి ఒక విందుభోజనం వంటిది అవుతుందని నమ్ముతున్నాను.
ప్రపంచ జ్యోతిషచరిత్రలో ఇటువంటి పరిశోధనాగ్రంధం ఇప్పటివరకూ లేదని, ఇకముందు రావడం కూడా కష్టమని సగర్వంగా చెబుతున్నాను. ఈ గ్రంధాన్ని చదవాలంటే మీకు అదృష్టం ఉండాలని చెప్పడం సాహసం కాదు, సమంజసమే.
ఇది అనేక ఏళ్ల పరిశోధనా ఫలితం. ఇది నాకొక Lifetime Achievement వంటిది. ఎన్నో వందల గంటలు కష్టపడి, ఎంతో ప్రాచీన చరిత్రను పరిశోధన చేసి ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది.
దీని చిత్తుప్రతిని ఎన్నోసార్లు తిరగామరగా క్షుణ్ణంగా చదివి అనేకచోట్ల అవసరమైన సవరణలు సూచించడమే గాక, ప్రూఫ్ రీడింగ్ మరియు టైప్ సెట్టింగ్ చేసి దీనికొక రూపాన్నివ్వడానికి ఎంతో శ్రమించిన నా శిష్యురాలు అఖిల జంపాలకు నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తున్నాను.
జ్యోతిషశాస్త్రంలో నాదైన విశ్లేషణా విధానాన్ని అతి చిన్నవయసులోనే ఎంతో పట్టుదలతో శ్రద్ధతో నేర్చుకుని, దానిలో మంచి ప్రజ్ఞను సాధించిన అతి కొద్దిమందిలో ఈమె ఒకరు. ఈ పుస్తకరచనలో నాతో కలసి పనిచేసే అదృష్టం ఈమెకు దక్కింది.
పుస్తకరచనలో నిరంతరం నాకు తోడునీడగా ఉన్న నా సహధర్మచారిణి సరళాదేవికి, ఫౌండేషన్ పనుల్లోనూ, ఆశ్రమ నిర్వహణకు చెందిన అన్ని విషయాలలోనూ ఆసరాగా నిలబడుతున్న మూర్తి మరియు సంధ్యలకు, కవర్ పేజీలను ఎంతో అందంగా డిజైన్ చేసి ఇచ్చిన ప్రవీణ్ కు, పబ్లిషింగ్ పనులలో సహాయపడిన శ్రీనివాస్ చావలి, గణేష్ మరియు శ్రీలలిత మొదలైన నా ఇతర శిష్యులందరికీ ఆశీస్సులు.
ఈ పుస్తకం దాదాపు 800 పేజీలుగా వచ్చింది కనుక రెండు భాగాలుగా దీనిని ముద్రించడం జరిగింది. దీని 'ఈ బుక్' వెంటనే అందుబాటులో వస్తుంది. ప్రింట్ పుస్తకం మాత్రం ఈనెల 19 నుండి మొదలౌతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలోను, జనవరి 2 నుండి జరిగే విజయవాడ పుస్తక మహోత్సవంలోనూ, మా 'పంచవటి స్టాల్' లో మాత్రమే లభిస్తుంది. బుక్ ఫెయిర్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ద్వారా యధావిధిగా ఇక్కడ లభిస్తుంది.
అంతర్జాతీయ పాఠకుల కోసం త్వరలో దీని ఇంగ్లీష్ అనువాదం కూడా విడుదల అవుతుంది.
ఔత్సాహికులైన పాఠకులు, జ్యోతిషశాస్త్ర విద్యార్థులు, చరిత్ర అభిమానులు, నా రచనల అభిమానులు, సనాతన ధర్మానుయాయులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
16, డిసెంబర్ 2024, సోమవారం
హైద్రాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) - 2024 లో పంచవటి స్టాల్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2024 వచ్చేసింది.
డిసెంబర్ 19 నుండి 29 వరకూ 11 రోజులపాటు జరుగబోతున్న ఈ పుస్తక ప్రదర్శన, హైద్రాబాద్ లోని NTR స్టేడియంలో జరుగుతుంది. దీనిలో పంచవటి బుక్ స్టాల్ కు స్టాల్ నంబర్ - 145 కేటాయించబడింది. అక్కడ పంచవటి ప్రచురణల పుస్తకాలన్నీ మీకు లభిస్తాయి.
మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకూ పుస్తకప్రదర్శన ఉంటుంది.
నా రచనలను అభిమానించేవారు మీకు కావలసిన పుస్తకాలను మా స్టాల్ నుండి కొనుగోలు చేయవచ్చు. అంతేగాక, పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్ గురించి, మా యోగాశ్రమం గురించి, మా సాధనామార్గం గురించి మీకున్న సందేహాలను మా సభ్యులతో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.
గతంలో ఉన్న ప్రింట్ పుస్తకాలకు తోడుగా, ఎంతోమంది అడుగుతున్న ఈ క్రొత్త పుస్తకాలు ఇప్పుడు ప్రింట్ చేయబడ్డాయి. స్టాల్ లో మీకు లభిస్తాయి.
1. ఆరు యోగోపనిషత్తులు
2. వెలుగు దారులు (మూడు భాగాలు)
3. మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు (రెండు భాగాలు)
4. గోరక్ష సంహిత
5. శ్రీరామ గీత
6. ముక్తికోపనిషత్తు
7. గాయత్రీ రహస్యోపనిషత్తు
8. పతంజలి యోగసూత్రములు
9. మధుశాల
10. భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము
పుస్తకాభిమానులు, నా రచనల అభిమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.
26, నవంబర్ 2024, మంగళవారం
ఆశ్రమం మొదటి వార్షికోత్సవం - 5 వ సాధనా సమ్మేళనం
2, అక్టోబర్ 2024, బుధవారం
దేవాలయాలనుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు మంచి పరిణామం !
సనాతన హిందూధర్మానికి మరో విజయం !
వారణాశిలోని దాదాపు పది ఆలయాలనుంచి షిరిడీసాయిబాబా విగ్రహాలను నిన్న తొలగించారు. ఇది చాలా మంచి న్యూస్ !
గత పదేళ్లనుంచి అనేకమంది అసలైన హిందువులు చేస్తున్న పోరాటం కొద్దిగా ఫలితాన్ని చూపించడం మొదలైంది. నిద్రపోతున్న అమాయక హిందువులను మేలుకొలుపుతోంది. సత్యాన్ని వారికి అర్ధమయ్యేలా చేస్తోంది. కనీసం కొంతమంది హిందువులు ఇప్పటికైనా మేల్కొంటున్నారు. నార్త్ లో చైతన్యం వస్తోంది. సౌత్ లో మాత్రం ఇంకా రావడంలేదు. మన సౌత్ అంతా దండకారణ్యం కదా. ఇది రావణుని రాజ్యం. అడవిమనుషులకు జ్ఞానోదయం కలగడానికి టైం పడుతుంది మరి !
మెజారిటీ హిందువులు చాలా అమాయకులు. ఎవరేది చెబితే అది నమ్మేస్తారు. అందులోనూ, 'అనుకున్న పనులన్నీ జరుగుతాయి' అన్న ఆశను చూపిస్తే చాలు, ఎవరినైనా నమ్మేస్తారు. మతాలు మారిపోతారు. చివరకు కన్నతల్లిని కూడా మర్చిపోతారు. వేరే ఎవరినో తన తల్లి అనడం మొదలుపెడతారు. అంత అమాయకులు ! అమాయకత్వం అన్నమాట సరికాదేమో, స్వార్థపరత్వం అంటే సరిపోతుంది.
పచ్చి స్వార్ధపరులు మాత్రమే మాతృభూమికి, మాతృధర్మానికి ద్రోహం చేస్తారు.
సాయిబాబాను దేవునిగా మార్చి, హిందువులను తమ మతానికి దూరంచేసి, హిందూసమాజాన్ని చీల్చే కుట్ర గత నలభైఏళ్లుగా చాలా తెలివిగా అమలు చేయబడుతోంది. దీనిని చేసినది మళ్ళీ కొందరు సోకాల్డ్ సాంప్రదాయ హిందువులే. దేవుడు కాని సాయిబాబాను దేవునిగా చిత్రిస్తూ ప్రచారాలు చేసినది, గుళ్ళు కట్టించినదీ హిందువులే. వీరిలో మహారాష్ట్ర మరియు తెలుగు బ్రాహ్మణులే ఎక్కువమంది ఉన్నారు. తమ స్వార్థంకోసం, గురువులుగా సమాజంలో చెలామణీ కావడం కోసం హిందూమతాన్ని నాశనం చేయడంలో వీళ్ళు తమ పాత్రను పోషించారు.
వేదవేదాంతాలలో ఉన్న సారాన్ని వివరించి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత బ్రాహ్మణులది. వారిది ఆచార్యస్థానం. అలాంటి స్థానాల్లో ఉన్నవారు దారితప్పి, సాయిబాబా వంటి తురకలను సాక్షాత్తు దేవునిగా మార్చి, అమాయకులైన తమ హిందూ అనుచరులను ఏమారుస్తూ వచ్చారు. గురువులది స్వార్ధం. ప్రజలది అమాయకత్వం. అందుకే వీరిద్దరిని చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది. కొండొకచో అసహ్యం కూడా వేస్తుంది.
నిజమైన హిందూమతం, సనాతనధర్మం వేదాలలో ఉపనిషత్తులలో ఉన్నది. వాటి సారం భగవద్గీత. వీటిని చదివి అర్ధం చేసుకున్నవారు, సాయిబాబా లాంటి ముస్లిం పకీర్లను ఎన్నటికీ పూజించరు.
మరొక్క వింత విషయం చెప్పనా ?
అసలైన ముస్లిములు కూడా ఫకీర్లను, దర్గాలను పూజించరు, అది ఘోరమైన పాపమని ఖురాన్ అంటుంది. ఏ ముస్లిమూ సాయిబాబాను పూజించడు. ఆయన ఒక ఫకీర్ మాత్రమే అని వారు నమ్ముతారు. అది నిజం కూడా. అంటే, ముస్లిములు కూడా చెయ్యని పాపాన్ని హిందువులు నిస్సిగ్గుగా చేస్తున్నారన్నమాట ! వినడానికి భలే ఉంది కదూ ! ఇదీ మెజారిటీ హిందువుల అమాయకత్వం !
ఎన్నో హిందూసంఘాలు ఏళ్ల తరబడిగా చేస్తున్న పోరాటం ఇప్పటికైనా కొంత ఫలితాలు చూపిస్తున్నది. హిందువులలో కనీసం ఇప్పటికైనా కొంత చైతన్యం వస్తోంది. సంతోషం !
హిందువులారా ! కళ్ళు తెరవండి ! చీకట్లో నడవకండి ! వెలుగులోకి రండి ! మీ మతమేంటో, మీ గ్రంధాలేమి చెబుతున్నాయో, మీరేం చెయ్యాలో తెలుసుకోండి ! ఎవరేది చెబితే అదే నిజమని భ్రమించకండి ! మతాలు మారకండి ! ఎవరిని పడితే వారిని గుడ్డిగా పూజించకండి. మీ దేవతలను వదలకండి ! మీ ఆచారాలకు తిలోదకాలను ఇవ్వకండి. శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు, ఈశ్వరుడు, అమ్మవారు, ఆంజనేయస్వామి మొదలైన దేవతలు చాలరా? ఒక ముస్లిం ఫకీర్ ను దేవునిగా చేసి కూచోబెట్టి పూజించవలసిన ఖర్మ మీకేంటి?
వారణాశి హిందూసోదరులు తమలో కొంతైనా ఆత్మాభిమానం మిగిలి ఉందని నిరూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని దేవాలయాలలోనూ ఇదే పని జరగాల్సిన అవసరం గట్టిగా ఉంది !
మన తెలుగురాష్ట్రాల బండనిద్ర ఎప్పటికి వదులుతుందో మరి ?
24, ఆగస్టు 2024, శనివారం
మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల
వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.
అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.
లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్' కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.
నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.
ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.
ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.
చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.
18, ఆగస్టు 2024, ఆదివారం
ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది?
10, ఆగస్టు 2024, శనివారం
బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్
28, జులై 2024, ఆదివారం
4 వ సాధనా సమ్మేళనం విజయవంతం
ఆషాఢపూర్ణిమ గురుపూర్ణిమ. ఆనాడు సనాతన భారత సాంప్రదాయానికి పరమగురువైన వ్యాసభగవానుని స్మరించి మనమందరం ఆరాధిస్తాం. కనుక అది వ్యాసపూర్ణిమ అయింది. అదేసమయంలో, వ్యాసభగవానుని ప్రతిరూపాలుగా భావిస్తూ ఎవరి గురువులను వారు పూజించడం కూడా మన సంప్రదాయం.
వ్యాసపూర్ణిమ తరువాత వచ్చే సప్తమి నేను పుట్టినరోజు గనుక, ఈ నెల 26, 27, 28 తేదీలలో వచ్చిన వీకెండ్ లో మా ఆశ్రమంలో గురుపూర్ణిమ ఉత్సవాలను జరిపాము.
ఈ మూడురోజులపాటు మా ఆశ్రమంలో 4 వ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం జరిగింది. పంచవటి సాధనామార్గానికి చెందిన ఉన్నతదీక్షలను సభ్యులకు ఇవ్వడం, వాటి లోతుపాతులు నేర్పించడం, సాధన చేయించడం, సందేహనివారణ చెయ్యడం, ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చెయ్యడం జరిగింది. జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, యోగసాధన, హోమియోపతి వైద్యాలలో నాదైన విధానాన్ని సభ్యులకు నేర్పించడం జరిగింది.
ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.
14, జులై 2024, ఆదివారం
మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల
ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.
ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.
5, జులై 2024, శుక్రవారం
The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల
కేవలం రెండునెలల లోపే 'మధుశాల' ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన నా శిష్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాదు, ఈ పుస్తకం హిందీ అనువాదం కూడా అయిపోయింది. పదిరోజులలో అది కూడా मधुशाला అనే 'ఈ బుక్' గా హిందీరాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
నా పుస్తకాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడుభాషలలోనూ వస్తాయని ఇంతకు ముందు చెప్పాను. అది నేడు The Wine House తో మొదలుపెట్టబడింది.
ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
ఏకాంత ధ్యానసాధనను ఇష్టపడేవారికి ఈ పుస్తకంలోని 140 చిన్నికధలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, నా ఫిలాసఫీ మొత్తం ఈ పుస్తకంలో అతి తేలికమాటలలో చెప్పబడింది. ప్రయత్నించండి.
24, జూన్ 2024, సోమవారం
ప్రపంచ యోగ దినోత్సవం - 2024
19, మే 2024, ఆదివారం
మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది
1, ఏప్రిల్ 2024, సోమవారం
విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం
పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.
క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది. పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.
దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.
జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.
త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.
ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ, అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.
తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.
క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.
1. శ్రీవిద్యా రహస్యం
2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక
3. తారా స్తోత్రం
4. ధర్మపథం
5. వెలుగు దారులు లేదా MUSINGS
7, మార్చి 2024, గురువారం
మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో)
ఎన్ని ప్రవచనాలు వినినా, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూచినా, ఎన్ని కబుర్లు చెప్పినా, అసలైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా నడవనిదే దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు. మిగతావన్నీ టైం వేస్ట్ పనులు మాత్రమే.
ఇది సత్యం.
అందుకే 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఉద్భవించింది. తపన ఉన్న జిజ్ఞాసువులకు, సాధకులకు అసలైన ఆధ్యాత్మికలోకపు దారులు చూపిస్తుంది. నడిపిస్తుంది.
అందుకే ఈ ఆహ్వానం.
ఈ నెల 29, 30, 31 తేదీలలో మా ఆశ్రమంలో మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (పంచవటి సాధనా సమ్మేళనం) జరుగుతుంది.
ఈ మూడు రోజులు, ఉదయం 4 నుండి రాత్రి 7 గంటల వరకు. మధ్యాహ్నం భోజనవిరామం తప్ప, మిగిలిన సమయమంతా వివిధరకాల సాధనలలో మీరు సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ, ఇక్కడకు వచ్చిన తర్వాత చెప్పబడతాయి. నేర్పబడతాయి.
ఎదురుచూస్తున్నవారికి ఇదే ఆహ్వానం.
ఈ రిట్రీట్ లో రెండు విభాగాలు ఉంటాయి.
ఇప్పటివరకూ ఆశ్రమానికి రాని క్రొత్తవారికి, మొదటిరోజున అంటే మార్చి 29 తేదీన, అవగాహనా సమ్మేళనం ఉంటుంది. ఈ ఒక్క రోజు మాత్రమే వారికి ఆశ్రమంలో మాతోబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంచవటి సాధనామార్గం గురించి వారికి వివరించబడుతుంది. మీ మీ సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది.
పాతవారికి మరియు గతంలో అటెండ్ అయినప్పటికీ, దీక్షాస్వీకారం చెయ్యని క్రొత్తవారికి ఈ సారి ఆశ్రమంలో మూడు రోజులు ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. వారు సీనియర్ సభ్యులతో కలసి మూడు రోజులు ఆశ్రమంలో ఉండవచ్చు, కలసి సాధనలు చెయ్యవచ్చు. మా మార్గం యొక్క లోతుపాతులను మీ శక్తిమేరకు గ్రహించవచ్చు.
ఆశ్రమంలో మినిమమ్ సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కంఫర్ట్స్ ఉండవు. వేసవి ఎండలు బాగా ఉంటాయి. వాటికి తట్టుకునే సంసిద్ధత ఉన్నవారు మాత్రమే రాగలరు. ఆశ్రమంలో ఉన్నపుడు ఆశ్రమ నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఏవైనా మందులను వాడుతూ ఉంటే, వాటిని తెచ్చుకోవడం మరచిపోకూడదు.
రాదలచుకున్నవారు 98493 - 89249 అనే నంబర్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని సంప్రదించగలరు.
9, ఫిబ్రవరి 2024, శుక్రవారం
8, ఫిబ్రవరి 2024, గురువారం
హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో పంచవటి స్టాల్ ను సందర్శించండి
29, జనవరి 2024, సోమవారం
రెండవ స్పిరిట్యువల్ రిట్రీట్ విజయవంతం అయింది
ముందుగా ప్లాన్ చేసినట్లు, ఈ నెల 26, 27, 28 తేదీలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మిక సాధనా సమ్మేళనం విజయవంతం అయింది.
పాతవారితో బాటుగా, చాలామంది క్రొత్తవాళ్ళు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. మా సాధనామార్గాన్ని వారికి వివరించడం జరిగింది. మళ్ళీ ఏప్రియల్ లో జరుగబోయే రిట్రీట్ లో వారు డైరెక్ట్ గా పాల్గొనవచ్చు. ఈ లోపల వారు ఈ క్రింది పుస్తకాలు చదివి, అర్ధం చేసుకుని, ఆ తరువాత ఏప్రియల్ రిట్రీట్ కు రావలసి ఉంటుంది.
అదే విధంగా, మమ్మల్ని సంప్రదిస్తున్న క్రొత్తవారందరికీ కూడా ఇదే సూచన చేస్తున్నాము. ఇప్పటివరకూ నేను వ్రాసినవి 63 పుస్తకాలున్నాయి. వాటినుంచి కనీసం ఈ నాలుగు పుస్తకాలను చదవండి. మా మార్గం స్పష్టంగా అర్ధమౌతుంది. ఆ తరువాత మీరు రిట్రీట్స్ కు రావచ్చు. దీక్షాస్వీకారం చెయ్యవచ్చు. మా సాధనామార్గంలో నడవవచ్చు. ధన్యత్వాన్ని మీకు మీరే రుచి చూడవచ్చు.
1. Musings లేదా వెలుగు దారులు
2. శ్రీవిద్యా రహస్యం
3. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక
4. తారాస్తోత్రం
మా జ్యోతిష్యవిధానాన్ని క్రొత్తవారికి పరిచయం చేయడం జరిగింది. కానీ, 'డబ్బు సంపాదనకు దీనిని వాడకూడదు' అని స్పష్టంగా వారికి చెప్పడం కూడా జరిగింది.
గమనించండి.
18, జనవరి 2024, గురువారం
జనవరి 22 న నూతన శకం ప్రారంభం - అందరూ పాలు పంచుకోండి
మానవచరిత్రలో మహత్తరమైన సంఘటనలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతాయి. అటువంటి వాటిలో ఒకటి శ్రీరామజననం. సృష్టి-స్థితి-లయకారకుడు, సాక్షాత్తు పరబ్రహ్మము అయిన మహావిష్ణువే శ్రీరామునిగా జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కోట్లాది హిందువుల నమ్మకం కూడా అదే.
ఆయన రఘువంశంలో దశరధ మహారాజు కుమారునిగా జన్మించడము, తండ్రికిచ్చిన మాటప్రకారం వనవాసం చేయడము, సీతాదేవిని అపహరించిన రావణుని వానరసైన్యం సాయంతో వధించి, తిరిగి అయోధ్యా నగరానికి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై రాజ్యం చేయడము, అవతార పరిసమాప్తి చేసి తిరిగి తన ధామానికి చేరుకోవడము ఇదంతా రామాయణంలో ఉన్నది, మనకందరికీ ఇది తెలుసు.
రామాయణంలో వాల్మీకిమహర్షి వర్ణించిన కొన్ని విషయాలను బట్టి కనీసం లక్ష సంవత్సరాల క్రితం రామాయణం జరిగి ఉండాలి. వాటిలో ఒకటి, రావణుని భవనానికి నాలుగు దంతాల ఏనుగులు కాపలా కాస్తున్నాయని ఆయన వ్రాయడం. అటువంటి ఏనుగులు లక్ష సంవత్సరాల క్రితం ఉండేవని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే విధంగా రామాయణం నిండా ఇటువంటి ఎన్నో రుజువులు లభిస్తున్నాయి. వాటిపైన ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని త్వరలో విడుదల చేయబోతున్నాను.
నేటికి 6000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ను పాలించిన ఫారో రాజులలో 'రామా' అనే పేరు సర్వసామాన్యంగా ఉండేది. థాయ్ ల్యాండ్, ఇండోనేషియా, మొదలైన దేశాలలో శ్రీరాముని నేటికీ పూజిస్తారు. ఇండోనేషియా రాజవంశానికి పూర్వీకులు రఘువంశపు రాజులే. వారి చరిత్ర ఈ విషయాన్ని చెబుతున్నది. లాటిన్ అమెరికా లోని హొండురాస్ దేశాన్ని (పాతాళ లోకాన్ని) ఆంజనేయుడు చేరుకొని అక్కడ భీభత్సం సృష్టించినట్లు ఈనాటికీ అక్కడ గాధలున్నాయి. మహిరావణ చరిత్రలో దీనికి ఆధారాలున్నాయి.
శ్రీరాముడు జన్మించిన భవ్యమందిరం, మహారాజ ప్రాసాదంగా 1660 CE వరకూ అయోధ్యలో ఉండేది. ఆ సంవత్సరంలో, ఆ ప్రాంతానికి గవర్నరు, ఔరంగజేబు అనుచరుడైన ఫిదాయ్ ఖాన్ అనే నీచుడు ఆ రాజభవనాన్ని అందులోని మందిరాన్ని కూలగొట్టి, 1528 CE లో బాబర్ సైన్యాధిపతి అయిన మీర్ బాకీ అనే ఇంకొక నీచుడిచే కట్టబడిన మసీదును పెద్దదిగా నిర్మించి, దానికి బాబరీ మసీద్ అని పేరు పెట్టాడు.
గాంధీ నెహ్రూల కుట్రలు + సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ పాలనల పుణ్యమా అని హిందువులు తమ దేశంలో సెకండ్ గ్రేడ్ పౌరులయ్యారు. వారి ఆలయాలు, చారిత్రక స్థలాలు దిక్కులేని వయ్యాయి. దేశచరిత్ర మొత్తం వక్రీకరించబడింది. హిందూమతాన్ని ఒక ప్లాన్ ప్రకారం చాప క్రింద నీరులాగా నిర్మూలించే కుట్ర అమలుచేయడం మొదలైంది. కులాలను రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఓట్లు దండుకుని అధికారం చేజిక్కించుకుని తమ తమ ఎజెండాలు అమలు చెయ్యడం మొదలైంది.
ఈ క్రమంలో అనర్హులు అందలాలు ఎక్కారు. నీతి అనేది సమాజం నుంచి మాయమైంది. అడుగడుగునా అవినీతి మయమైంది. దేశం పరాయి దేశాల తొత్తుగా మారింది. దేశసంపద ఇతర దేశాలకు తరలిపోయింది. ఎడారి మతాల ప్రాబల్యం పెరిగింది. టెర్రరిజం పెరిగింది. స్వతంత్రం వచ్చాక భరతమాత మళ్ళీ బందీ అయింది. అంతర్జాతీయ వేదికల పైన నవ్వుల పాలైంది. అన్నిరకాలుగా పతనమై పోయింది.
6 డిసెంబర్ 1992 న, దౌర్జన్యానికి, బానిసత్వానికి ప్రతీక అయిన బాబరీ మసీదు రామభక్తుల చేత కూలగొట్టబడింది. ఆ చైతన్యాన్ని వారిలో రగిల్చింది, లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇంకా అనేకులు ఏళ్ల తరబడి చేసిన నిరంతర కృషి. ఆ క్రమంలో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పులలో అనేకమంది కరసేవకులు, రామభక్తులు చనిపోయారు. అయినా సరే వెనుకకు తిరుగకుండా, ఆ అక్రమ కట్టడాన్ని కూలగొట్టి తమ దేశభక్తిని, దైవభక్తిని చాటుకున్నారు. చరిత్రలో నిలిచిపోయారు. భగవంతుని పాదాల చెంతకు చేరుకున్నారు. మనం వారిని మర్చిపోయినా, దైవదృష్టిలో వారు ఉత్తములే అని నా నమ్మకం.
ఆ రోజు నుంచి హిందువులలో చైతన్యం రావడం మొదలైంది.
అప్పటినుంచీ బీజేపీ పార్టీ, విశ్వహిందూ పరిషత్, ఆరెస్సెస్ లు చేసిన సమిష్టి న్యాయపోరాట ఫలితంగా విజయాన్ని సాధించి, అయోధ్యలో శ్రీరాముని భవ్య మందిరాన్ని నిర్మించి, ఈ నెల 22 న బాలరాముని విగ్రహాన్ని ఆ ఆలయంలో ప్రతిష్ట చేయబోతున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చాక భారతదేశ పునరుజ్జీవనం మొదలైంది. కోల్పోయిన గత వైభవాన్ని మన దేశం తిరిగి పొందటం మొదలైంది. ప్రపంచదేశాలు మనల్ని ఒక కలోనియల్ బానిసలా చూడటం మానేసి, తిరిగి గౌరవించడం మొదలు పెట్టాయి.
మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత అయి ఉండికూడా, ఊపిరి సలపనంత బిజీ పనులలో ఉంటూ కూడా, 22 న రామ్ లాలా విగ్రహ ప్రాణప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక సామాన్యుడిలాగా పది రోజుల ఉపవాసదీక్షను చేస్తున్నారు. నేలపైన నిద్రపోతూ నిరంతరం రామనామాన్ని జపిస్తున్నారు. ఆయనకిప్పుడు 73 ఏళ్లు. దేశంకోసం ధర్మంకోసం కుటుంబాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. వివేకానందస్వామి అనుచరుడు. ఇటువంటి దైవత్వం ఉన్న మనీషి మన ప్రధానమంత్రి కావడం మన అందరి అదృష్టం. అటువంటి ఉత్తముడు అసలు రాజకీయాలలో ఉండటమే ఒక అద్భుతం !
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాధ్ ఇంకొక కారణజన్ముడు. కళంకం లేని దేశభక్తుడు. మహాయోగి గోరఖ్ నాథ్ స్థాపించిన యోగసంప్రదాయానికి చెందిన నేటి జగద్గురువు ఈయన. అటువంటి నిస్వార్థపరుడు, బ్రహ్మచారి, నిజమైన సన్యాసి, సాధువు, ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, టెర్రరిజాన్ని అణచి పారేసి, రామరాజ్యాన్ని అక్కడ నడిపిస్తున్నాడు. 'సన్యాసి రాజ్యం ఏలుతాడు' అని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో వ్రాసినది యోగి అదిత్యనాథ్ గురించే గాని, కొందరు పిచ్చివాళ్ళు అనుకున్నట్లు ఎన్టీఆర్ గురించి కానే కాదు. రంగుగుడ్డలు వేసుకున్నంత మాత్రాన, రంగులు పూసుకుని నటించినంత మాత్రాన, నలభై రోజుల పార్ట్ టైమ్ దీక్షలు చేసినంత మాత్రాన, ఎవరూ గురుస్వాములు, సన్యాసులు, స్వామీజీలు అయిపోరు. వారి జీవితచరిత్రలు, దినచర్యలు అందుకు అనుగుణంగా, మచ్చ లేనివిగా ఉండాలి.
యోగి అదిత్యనాథ్ వంటి మరొక్క మహనీయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న సమయంలో పుట్టడం మనందరి అదృష్టం.
రామ్ లాలా విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్, తన కుటుంబానికి దూరంగా ఉంటూ, ఆరు నెలలు మౌనదీక్షలో ఉండి, ఆ విగ్రహాన్ని కర్ణాటకలో దొరికే నల్లరాతి ఏకశిల నుండి చెక్కాడు. అతని జన్మ ధన్యమైంది ! అతని తపస్సు ఫలించింది. ఆ విగ్రహాన్ని కోట్లాదిమంది యుగయుగాలపాటు పూజించబోతున్నారు. దానిలో శ్రీరామచంద్రుని దివ్యమూర్తిని దర్శించ బోతున్నారు. ఎంతటి ధన్యాత్ముడో ఈ శిల్పి! ఈ పుణ్యబలం వల్ల, అరుణ్ యోగిరాజ్ పూర్వీకులందరూ ఉత్తమలోకాలను పొందారని నా నమ్మకం !
అయోధ్య కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో గొప్ప ఐకమత్యం., సోదరభావం, దేశభక్తులు వెల్లివిరుస్తున్నాయి. కులాలకు అతీతంగా వారిలో ఐక్యతాభావం పెల్లుబుకుతోంది. శ్రీరాముని పాదపద్మాల చెంత అందరూ ఒక్కటౌతున్నారు.
ఈ సమయం భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత ఘట్టం. ఇటువంటి సమయంలో మనం పుట్టి, ఈ ఉత్సవాన్ని చూస్తూ ఉండటం గొప్ప అదృష్టం.
ఇది సాంస్కృతిక ధార్మిక పునరుజ్జీవన యుగం. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మరపురాని ఘట్టాన్ని ఆసాంతం ఆస్వాదించండి. ఉప్పొంగిన హృదయాలతో శ్రీరామ నామగానం చేయండి. హిందువులుగా పుట్టినందుకు, ప్రపంచంలో ఎక్కడా లేని మహోన్నతమైన ఆధ్యాత్మిక సంస్కృతికి వారసులైనందుకు గర్వించండి.
పంచవటి తరఫు నుండి మేము కూడా రేపటినుంచి మూడు రోజుల దీక్ష చేస్తున్నాం. దీనిలో ఉపవాసము, మౌనం, నిరంతర రామనామ జపం భాగాలుగా ఉంటాయి. 22 వ తేదీన, 'రామ తాపినీ ఉపనిషత్' కు నా వ్యాఖ్యానమును ఉచిత 'ఈ-బుక్' గా విడుదల చేస్తున్నాము. ఇది శ్రీరాముని పాదపద్మముల చెంత మేము ఉడతాభక్తిగా చేస్తున్న సేవ.
హిందువులందరూ మీకు చేతనైన రీతిలో కనీసం ఈ మూడు రోజులైనా దీక్షలు చెయ్యండి. 22 వ తేదీన జరిగే బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాన్ని మీ మీ కుటుంబాలలో ఒక పండుగగా జరుపుకొండి.
మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇటువంటి అవకాశం వస్తుంది.
మరువకండి !
రామభక్తులుగా జీవించండి. రావణ సైన్యంలో చేరకండి
జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ ! జై శ్రీ రామ్ !