35 ఏళ్ల క్రితం, హైద్రాబాద్ వాసి సందీప్ కుమార్ భట్టాచార్య, కాశ్మీర్ యాత్రకని కుటుంబంతో సహా వెళ్లి, శ్రీనగర్ గడియారస్థంభం సెంటర్లో బాంబుపేలుడులో చనిపోయాడు. అతను నా స్నేహితుడు.
నిన్న 27 మంది అమాయక టూరిస్టులు పహల్గావ్ లో హత్యకు గురయ్యారు. మతం అడిగి మరీ ఈ హత్యలు చేశారు. 35 ఏళ్ళు గడచినా, కాశ్మీర్ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు
మొన్న శ్రీనగర్, నిన్న ముజఫర్ నగర్, నేడు పహల్ గావ్, రేపు ఇంకెక్కడో. దారుణాలు కిరాతకాలు మళ్ళీమళ్ళీ జరుగుతూనే ఉంటాయి. మనం మాత్రం క్షమించేస్తూ ఉంటాము. కళ్ళు మూసుకుని అన్నీ మర్చిపోయి హాయిగా బ్రతికేస్తూ ఉంటాము.
మన మధ్యనే ఉన్న రాక్షసులు మనకు నీతులు చెబుతూనే ఉంటారు. మతాలన్నీ ఒకటేనంటారు. శాంతిసూత్రాలు వల్లిస్తారు. సరిహద్దు అవతల ఉన్న వారి సోదరులు కూడా, అదే గ్రంథం ప్రాతిపదికగా హత్యలు చేస్తూ ఉంటారు. అడిగితే, మేమేం చెయ్యలేదంటారు. మిమ్మల్ని మీరే చంపుకుని అమాయకులమైన మామీద తోస్తున్నారంటారు.
మనమేమో డబ్బుకు అమ్ముడుపోతూనే ఉంటాము. వాళ్ళచేతే తన్నించుకుంటూ ఉంటాము. దేశాన్ని తాకట్టుపెడుతూ ఉంటాము. అదే మనకు ఆనందం !
సమస్య టెర్రరిజంలో లేదు. మనలో ఉంది. వాళ్ళ పనిని వాళ్లు తెలివిగా చేస్తూనే ఉన్నారు. మనమే చేతులు కట్టుకుని కూర్చున్నాం.
పరిష్కరించనంత వరకూ సమస్య ఉంటూనే ఉంటుంది. జండుబామ్ తో కేన్సర్ తగ్గదు. మంచిమాటలు రాక్షసులకు వినిపించవు.
దెబ్బకు దెబ్బచాలదు. ఒక దెబ్బకు పది దెబ్బలు పడాలి. చైనా ఇజ్రాయెల్ లను చూచి మన దేశం నేర్చుకోవాలి. లేదంటే ముందుముందు సర్వనాశనమే.