నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

2, ఫిబ్రవరి 2009, సోమవారం

సినీ నటుడు నాగేష్ గారి జాతకం

నాగేష్ గారి జనన సమయం దొరకలేదు. సామాన్యంగా జనన సమయం లేనపుడు జాతకాన్ని అనేక ఇతర విధానాల ద్వారా విశ్లేషణ చెయ్యవచ్చు. దానికి ఇతర మార్గాలు గ్రంథాలలో ఇవ్వ బడ్డాయి. క్లిష్ట మైన పద్దతుల జోలికి పోకుండా, సరళ మైన రెండు విధానాల ద్వారా వీరి జాతకాన్ని చూద్దాం.

నిజానికి నియమం ప్రకారం పోయిన వాళ్ల జాతకాలు చూడరాదు. కాని ఈయన సామాన్యుడు కాదు గనుకా, రీసెర్చ్ కోణంలో చూడొచ్చు గనుకా విశ్లేషణ చేస్తున్నాను.

చూడగానే కొట్టొచ్చినట్టు కనబడేది వీరి జాతకం లో కాల సర్ప యోగం. విచిత్రం కదూ.నిన్న మొన్నటి వరకు మనం చర్చించినది దాని గురించే. ఇప్పుడు వెంటనే అదే జాతకం చూడాల్సి రావటం అర్థం చేసుకుంటే ఇదొక విచిత్రమే మరి. సరే ఈ యోగ జాతకులు పడే బాధలు ఈయన కూడా పడ్డాడు. ఎలాగో ముందు ముందు చూద్దాం.

జనన సమయం లేదు గనుక, చంద్ర లగ్నాత్ చూస్తె ..
రెండులో శని వక్ర స్థితి : కుటుంబ సుఖం తక్కువ. బాధలెక్కువ. మాట సూటి.
మూడులో రాహు: పౌరుష వంతుడు. ధైర్య వంతుడు. మాట కరుకుగా వుంటుంది.
తొమ్మిదిలో కేతు: ఆచారం, దైవ భక్తీ, ఆధ్యాత్మిక చింతన కలవాడు.

పదిలో రవి, బుధ, గురువులు: ఇది ఈయన జాతకంలో ముఖ్య యోగం. వృత్తిని చూపే దశమంలో సప్తమ దశమాధిపతి అయిన బుధుడు ఉచ్చ స్థితిలో ఉండి, రవితో కలసి బుధాదిత్య యోగాన్ని ఇస్తూ, లగ్న చతుర్తాధిపతి గురువుతో కలసి ఉండటం. దీనివల్ల ఈయనకు కళా రంగం లో ఔన్నత్యం, ప్రజాదరణ, మాట చెల్లుబాటు కావడం, వాహన యోగం, పేరు ప్రఖ్యాతులు ఒచ్చాయి. పరాశర మహర్షి చెప్పిన ధర్మ కర్మాధిపతి యోగం తొమ్మిది, పది అధిపతులు పదిలో కలవటం వల్ల రాజ యోగాన్నిచ్చింది. అయితే, బుధుని కేంద్రాదిపత్య దోషం వల్ల అదే యోగం అనేక చికాకులను, గొడవలను కూడా ఇచ్చింది. పైన చెప్పిన అన్ని రంగాలలో అధికారంలో ఉన్నవారితో గొడవలు ( ఉదా: ఎం జీ ఆర్ తో) ఇదే యోగం ఇచ్చింది. ఒకే యోగం మంచినీ చెడునూ కూడా చేస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ.

పదకొండులో శుక్ర, కుజుల యుతి: ఈ యోగం వృత్తిలో గొప్ప ధనార్జన, అందమైన యువతులతో పరిచయం, భోగ విలాసాలు మొదలైన సినీ రంగానికి సహజ మైన ఇతర కార్య కలాపాలను ఇచ్చింది. వీరిపైన రాహు దృష్టి వల్ల కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఒక ఆంగ్లో ఇండియన్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతే గాక కుజుని పంచమా దిపత్యం వల్ల కుమారుడు ఆనంద బాబు మంచి డాన్సర్ అయ్యుంది కూడా, రాహు దృష్టి ఫలితంగా, తాగుడు అలవాటై అవకాశాలు పోగొట్టుకొని సినీ రంగంలో రాణించలేక పోయాడు.

నాడీ జాతక విధానంలో జీవ కారకుడైన గురువుని పురుషులకు లగ్నంగా తీసుకుంటారు. ఆ పద్ద్తతిలో చూస్తె,
లలిత కళా కారకుడు శుక్రుడు, కుజునితో కలిసి తులా రాశిలో ఉండటం వల్ల నాటక సినిమా రంగాల్లో రాణింపు, ధన యోగం, విలాసాలు, అందమైన యువతులతో పరిచయాలు మొ|| కలిగాయి. మాట లో హాస్య చతురత కలిగింది.

తెలివిని, ప్రావీణ్యాన్ని చూపే బుధుడు ఉచ్చ స్థితి లో ఉండటం, అధికారాన్ని, పదవిని ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని చూపే రవి గురువులతో కలిసి ఉండటం వల్ల, పాండిత్యం, పరిచయాలు, తెలివి, మంచి గ్రహణ శక్తి ఇత్యాది కలిగాయి.

ఐదింట శని వక్ర స్తితి వల్ల సంతానం పైకి రాలేక పోవడం. వారికి దురలవాట్లు ఇత్యాది కలిగాయి. శని వృత్తి కారకత్వం వల్ల
వక్రత వల్ల రైల్వే లో ఉద్యోగం చేసి మాను కున్నాడు.

ఆరు, పన్నెండులలో రాహు కేతుల వల్ల, శత్రు విజయం,భక్తి, ఆధ్యాత్మిక చింతన, మరణించిన తరువాత ఉత్తమ లోక ప్రాప్తి కలిగాయి.

అయితే, కాల సర్ప యోగం వల్ల అనేక బాధలు, ఎగుడు దిగుళ్ళు ఆయన జీవితంలో అనుభవించాడు అన్నది కూడా నిజమే.

గ్రహ దృష్టులు చూస్తె శని కుజులకు పరస్పర ద్రుష్టి ఉంది. చతుర్థం మీద శని గురుల దృష్టి ఉంది. శని పైన గురు దృష్టి ఉంది. వీటివల్ల చెడె గాని మంచి లేదు. కాల సర్ప యోగం ఇచ్చే ఫలితాలే ఈ దృష్టులు కూడా ఇస్తాయి. ఇంత కంటే వ్యక్తిగత జీవితం లోకి తరచి చూడటం సభ్యత కాదు గనుక ఇంతటితో విశ్లేషణ ఆపుతున్నాను.