Pages - Menu
(దీనికి తరలించండి ...)
హోం
ఆధ్యాత్మికం
జ్యోతిషం
చురకలు
My Books
▼
Pages
(దీనికి తరలించండి ...)
హోమ్
▼
లక్షణాలను క్రోడీకరించి ఒక మందును సరైన పోటేన్సీలో ఇచ్చినపుడు ఏమి జరిగితే రోగం తగ్గుతున్నట్లు ? ఏమి జరిగితే రోగం తగ్గనట్లు ? అనేది హోమియో చికిత్సలో చాలా ముఖ్యమైన అంశం . మందు ఇచ్చిన వెంటనే రోగికి మానసికంగా తేలికగా అనిపించాలి . ఇది అత్యంత ప్రధానం . తరుణ వ్యాదులలో ఇది వెంటనే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది . దీనిని బట్టి మందు వెంటనే పని చేస్తున్నదా లేదా తెలుసుకోవచ్చు . దీనికి కారణం మందు మొదటగా సూక్ష్మ స్థాయిలలో పని చెయ్యటం మొదలు పెడుతుంది . కనుక వైటల్ లెవెల్ లో ముందు రిలీఫ్ కలుగుతుంది . రోగికి హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది . దీర్ఘ వ్యాధిలో అయితే రోగం వెంటనే తగ్గినట్లు లక్షణాలు అపుడే కనిపించవు . నిదానంగా మార్పులు వస్తాయి . కాని తరుణ వ్యాధిలో అయితే వ్యాధి లక్షణాలు కూడా వెంటనే తగ్గుతూ కనిపిస్తాయి . ఈ ముఖ్య విషయాన్ని , హోమియో దిగ్గజాలలో ఒకడైన డాక్టర్ హెరింగ్ తన పరిశోధన ద్వారా సూత్రీకరణ చేసాడు . 1. లోపలనుంచి బయటకు లక్షణాలు తగ్గాలి . అంటే అంతర్గత అవయవాల బాధలు తగ్గి రోగం చర్మం పైకి రావటం చూడ వచ్చు . లేదా రోగం స్రావాల రూపంలో ప్రాణ శక్తి చేత విసర్జింప బడ వచ్చు . 2. పైనుంచి క్రిందకు లక్షణాలు తగ్గుతూ రావటం చూడ వచ్చు . శరీరంలో పై భాగాలైన తల , ముఖము , మెడ , చాతీ ఈ వరుసలో లక్షణాలు తగ్గుతూ వస్తాయి . 3. ముఖ్య అవయవాల బాధలు మొదట తగ్గి తరువాత అంతకంటే వరుసలో తరువాతి అవయవాల బాధలు తగ్గటం చూడవచ్చు . గుండె , మెదడు , ఊపిరితిత్తులు , కిడ్నీలు మొదలైన ప్రాణాధారా అవయవాల బాధలు ముందు తగ్గి , అంతకంటే ప్రాముఖ్యతలో తరువాతివి అయిన అవయవాల బాధలు తరువాత తగ్గడం కనిపిస్తుంది . 4. వ్యాధి మొదలై , వ్యాపించి పెరిగిన క్రమంలోనే వెనుకకు తగ్గుతూ వస్తుంది . ఈ క్రమంలో లక్షణాలు కనిపిస్తే వ్యాధి తగ్గు ముఖం పడుతున్నట్లు సూచన . దీనికి వ్యతిరేక దిశలో లక్షణాలు ఉంటే , వ్యాధి తగ్గనట్లు తెలుస్తూంది . అపుడు కేసును మళ్ళీ పరీక్షించి ఎందుకు ఇలా జరుగుతున్నదో చూడాలి . అపుడు అవసరమైతే మందును మార్చటం లేక పోటేన్సీని మార్చటం చేయ వలసి ఉంటుంది .
ఒక్కొక్కసారి దశ అన్తర్దశలు , గోచారం అన్నీ బాగున్నా చెడు సంఘటనలు జరుగుతాయి . కారణం వెదికితే దొరకదు . అటువంటప్పుడు మాంది , గుళిక లను బట్టి చూస్తె ఆశ్చర్య కర ఫలితాలు అగుపిస్తాయి . ఉదాహరణకు రవీంద్రనాథ్ టాగూర్ జాతకంలో గురువు కటకంలో ఉచ్చ స్థితి . లగ్నం మీనం . మీనంలో చంద్రుడు . ఈయన మరణం గురు దశ / గురు అంతర్దశలో జరిగింది . లగ్నాధిపతి పంచమంలో ఉచ్చ స్థితిలో ఉండగా , పంచమాధిపతి లగ్నంలో ఉండగా , వీరిద్దరి పరివర్తన యోగం లో ఉన్న స్థితి మారక దశ ఎట్లా అయింది ? దీనికి సమాధానం దొరకదు . ఇప్పుడు గుళిక ను గమనిస్తే , ఈ బిందువు తులా రాశిలో గురువు గారి విశాఖా నక్షత్రంలో ఉంది . లగ్నాత్ అష్టమ రాశి . కనుక తన మారక శక్తిని గురు దశలో గురు అంతర్ దశలో ఉపయోగించి మారకం చేసింది . కనుక గుళిక అనేది చాలా ముఖ్య మైన బిందువు అని తెలుస్తూంది . ఇటువంటి అనేక ఉదాహరణలు ఇవ్వ వచ్చు . కొన్ని గుళిక ఫలితములు గుళిక తో కూడి ఉన్న గ్రహ దశ యోగించదు . అనేక కష్ట నష్టాలు పెడుతుంది . అప్పుడు మన తెలివి తేటలు , స్వ శక్తి కబుర్లు ఎందుకూ పనికి రావు . గుళిక బిందువు లగ్న బిందువుకు ఎంత దగ్గిరగా ఉంటే అంత దోషం . వీరికి అవయవ లోపం ఉండవచ్చు . చిన్న తనంలో తీవ్ర అనారోగ్యం తో భాద పడవచ్చు . ఈ రకంగా ఏ భావం లో ఉంటే ఆ భావ కారకత్వాలు పాడు అవుతాయి . ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ కారకత్వాలు నాశనం అవుతాయి . గులికను శని భగవానుని సంతానంగా చెబుతారు . ఈయన లక్షణం ప్రతీ దాన్ని ఆలశ్యం చెయ్యటం . భ్రమకు లోను చెయ్యటం . ఆటంకాలు కల్పించటం . నిరాశకు గురి చెయ్యటం మొదలైనవి . చిన్న ఉదాహరణ . ఒకరి జాతకంలో గుళిక నాలుగో భావంలో ఉంది . ఆ వ్యక్తి విద్యా రంగంలో తీవ్ర ఆలశ్యం , ఆటంకాలు కలిగాయి . ఇంట్లోని వారి ఒత్తిడి వల్ల తనకు పూర్తిగా ఇష్టం లేని శాఖలో చదువు సాగింది . గుళిక పూర్తిగా చెడు చెయ్యదు . ఒక్కో సారి మంచినీ చేస్తుంది . ఉదాహరణకు , మనం ఎక్కాల్సిన రైలో బస్సో మనం లేటు చెయ్యటం వల్ల వెళ్ళిపోతుంది . తిట్టుకుంటాం . కాని తరువాత తెలుస్తూంది , దానికి ఏక్సిడెంట్ అయి జనం చనిపోయారు అని . ఇటువంటి మంచి కూడా గుళిక వల్ల జరుగుతుంది . ఆధ్యాత్మికంగా ఉన్నతుల జాతకాల్లో గుళిక మంచి చేస్తుంది . వారికి ఉన్న అంతర్ముఖత్వం , ప్రపంచం మీద నిర్లిప్త ధోరణి చాలా వరకు శని , గులికుల వల్లనే కలుగుతాయి . గుళిక 3,6,10,11 ఉపచయ స్థానాలలో మంచి చేస్తుంది . ఆయా రాశి నాధులు కేంద్రాలలో ఉంటే రాజయోగాన్ని కూడా ఇస్తుంది. ఒక వ్యక్తికి గులికతో కలిశిన చంద్ర దశ ప్రారంభం కావటం తోనే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆఫీసర్ సెలెక్షన్ వచ్చింది. కారణం చంద్రుడు కేంద్ర స్థానంలో గురువుతో కలిసి గజకేసరి యోగం లో ఉండటమే. గుళికకు 180 డిగ్రీలలో ఉన్న బిందువును ప్రమాణ గుళిక అంటారు . దీనికి కూడా ప్రాముఖ్యత ఉంది . ఈ రెండు బిందువుల మీద శని గోచారం అత్యంత చెడు ఫలితాలు ఇస్తుంది . ఒకరి జాతకంలో ప్రమాణ గుళిక బిందువు మీద శని గోచారంలో అనుకోకుండా తండ్రి మరణం జరిగి ఆ కుటుంబం చిన్నా భిన్నం కావటం జరిగింది . గులికతో కలిశిన గ్రహం కారకత్వాలు పూర్తిగా ధ్వంసం అవుతాయి అని పైన చెప్పాను . ఒక ఉదాహరణ . ఒక జాతకంలో గుళిక చంద్రునితో దగ్గిరగా కలిశి ఉంది . ఈ జాతకుని తల్లిగారు జీవితమంతా విపరీత బాధలతో గడిచింది . ఇంకొక జాతకునికి గుళిక రవితో ఒకే డిగ్రీలో కలిశి ఉంది . ఆ జాతకుని తండ్రి అసహజ మరణం పాలయ్యాడు . ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా ఉన్నాయి . ఈ జాతకుని తండ్రి గారు ఇలా చనిపోతారు అని ఆరేళ్ల ముందుగానే దీన్ని బట్టి చెప్పటం జరిగింది . ఈ విషయం చెప్పి తగిన రేమేడీలు సూచించినపుడు వాళ్లు నవ్వి , తేలికగా కొట్టి పారేశారు . కాని ఆరేళ్ల తర్వాత ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ల కుటుంబం వారు అందరూ వచ్చి బాధపడ్డారు , రేమేడి చేసుంటే బాగుండేదే అని . ఇంకొక జాతకునికి గుళిక కుజునితో కలిశి ఆరవ రాశిలో ఉంది , ఇతడు ఒక ఫేక్షన్ లీడర్ . కుజ దశ ప్రారంభం కావటం తోనే జరిగిన కొట్లాటలో నడి రోడ్డు మీద పట్ట పగలు హత్య చెయ్య బడ్డాడు . గులికను బట్టి ఇంకా సూక్ష్మ వివరాలు చెప్ప వచ్చు . ముఖ్యమ్గా పూర్వ జన్మ దోషాలు గులికను బట్టి తేట తెల్లం గా తెలుస్తాయి . సర్ప దోషం మొదలైనవి కేరళ జ్యోతిష్కులు అత్యంత ఖచ్చితంగా దీన్ని బట్టే చెప్ప గలుగుతారు . గుళిక డిగ్రీని బట్టి దశలను గుణించే విధానం ఒకటి ఉంది . దీన్ని గుళిక దశ అంటారు . జీవితంలో రాబోయే కష్ట కాలాన్ని ఇది ఖచ్చితంగా చూపుతుంది . దానిని బట్టి తెలివైన వారు ముందే జాగర్త పడి రేమేడీలు చేసుకొని ఆ యా బాధల నుంచి తప్పుకోవచ్చు . ప్రశ్న విధానంలో గుళిక ను బట్టి వారి కుటుంబంలో ఏ తరంలో ఎవరు ఏ దోషం చేసారు . దానికి నివారణ ఏమిటి అనేది కేరళ జ్యోతిష్కులు ఆశ్చర్య కరమైన వివరాలు చెప్ప గలరు . విచారిస్తే ముందు తరాలలో ఏ తాత ముత్తాతలో అటువంటి పని చేసినట్టు తెలుస్తూంది . ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది . రాహు కాలం అందరికీ చెడు చేస్తుంది . కాని జాతకంలో రాహువు మూడింట ఉన్న వారికి మంచి చేస్తుంది . అలాగే గుళిక కాలం కూడా . గుళిక ఒక జాతకంలో రాజ యోగాన్ని ఇస్తుంటే అతనికి గులికోదయ కాలం చాలా మంచిని చేస్తుంది . ఆ సమయంలో చేసిన పని సఫలం అవుతుంది . ఇది ప్రతిరోజూ గమనించ వచ్చు .
ఈ వ్యాసంలో ఇంకొక విధానం ద్వారా జనన కాల సంస్కరణ చేద్దాం . గుళిక అనేది గ్రహమో ఉపగ్రహమో కాదు అది ఒక గణిత బిందువు . పరాశరాది ఋషులు అనేక గణిత బిందువులను కూడా ముఖ్యం గా స్వీకరించారు . అంటే వేల సంవత్సరాల నాడే గణిత జ్యోతిషంలో ఎంతటి రీసెర్చి జరిగిందో అర్థం చేసుకోవచ్చు . ఇవి ఏ ప్రాతి పాదిక మీద పుట్టాయో కూడా అర్థం కాని దుస్థితిలో నేడు మనం ఉన్నాం . గుళిక అనే బిందువును కేరళ జ్యోతిష్కులు చాలా ముఖ్యమైన దానిగా పరిగనిస్తారు . ప్రశ్న విధానంలో దీని పాత్ర అమోఘం . ఏదైనా సంశయం వస్తే , గులికను నిర్ణయాత్మక బిందువుగా వారు చూస్తారు . పరాశర హోరలోను , ప్రశ్న మార్గాది ఇతర కేరళ గ్రంథాల లోను దీని వివరాలు ఉన్నాయి . గుళిక సాధన దిన ప్రమాణం 8 భాగాలు చెయ్యాలి . ఆయా భాగాలకు వరుసగా ఆయా దినాధిపతులు నాధులైతారు . ఎనిమిదో భాగం శూన్యం . దానికి అధిపతి లేదు . ఈ భాగాలలో శని భాగం ఉదయ సమయం గుళిక కాలం అంటారు . అప్పటి లగ్న బిందువును గుళిక బిందువు అంటారు . అదే రాత్రి జన్మ అయితే కూడా ఇదే విధానం కాని గ్రహ సమయాలు ఆ వార గ్రహం నుంచి ఐదో గ్రహంతో మొదలు పెట్టాలి . గ్రహ ముల లెక్క వారముల వరుసలోనే వస్తుంది . గుళిక ఆశ్చర్య కరమైన ఫలితాలను ఇస్తుంది . కేరళ జ్యోతిష్కులు కళ్లు తిరిగే ఆశ్చర్య కరమైన ఫలితాలు ఎలా చెప్పగలుగు తున్నారంటే గుళిక వంటి ప్రత్యెక బిందువులు , విధానాలే కారణం . దీనికి ఆధారాలు , ఎట్లా ఇది కనుక్కున్నారు అనేవి ప్రస్తుతం దొరకటం లేదు . మన ముఖ్య రిసెర్చి గ్రన్థాలన్నీ ముస్లిం దండ యాత్రలలోనూ , మన నిర్లక్ష్య ధోరణి తోనూ కాల గర్భం లో కలిశి పోయాయి . మిగిలిన ఈ కాస్త కూడా మన తిరస్కార ధోరణికి గురౌతున్నది . కాని మనం నిర్లక్ష్యం చేసినా విదేశీయులు ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీ ని కళ్ళకద్దుకుని నేర్చుకుంటున్నారు . యోగాలోను , వేద జ్యోతిషంలోను అమెరికా , యూరప్ లో జరుగుతున్న రీసెర్చి కి భారతీయులుగా మనం సిగ్గుతో తలదించుకొనే స్థితి ఇప్పటికే వచ్చింది . బహుశా వారు మనకు నేర్పే రోజు దగ్గర లోనే ఉందేమో . ఆ విషయాలు అట్లా ఉంచితే , ఈ గుళిక అనేది , లగ్నాన్ని గుర్తించటానికి కూడా పనికి వస్తుంది . అయితే లగ్న డిగ్రీలను ఖచ్చితంగా గుర్తించ టానికి ఇతర పద్ధతులుu వాడాలి . లగ్న సంధి లో ఉన్నా , ఏ లగ్నమో తెలియని స్థితిలో ఉన్నా , లగ్నం అనేది గుళిక సహాయంతో ఖచ్చితంగా గుర్తించ వచ్చు . గుళిక టెస్ట్ గులికకు గాని , దాని నవాంశ కు గాని లగ్నం కోణ స్థితిలో ఉంటుంది . లేదా సప్తమంలో ఉంటుంది. లగ్నాధిపతి పరివర్తన చెందటం లేదా బలమైన గ్రహంతో లగ్నం చూడ బడటం జరిగితే ఆ గ్రహాన్నుంచి కోణం లో ఉంటుంది. ఇది ఖచ్చితమైన టెస్ట్ గా చెప్పవచ్చు . ఉదాహరణతో ఒక జాతకం చూద్దాం . జనన సమయం : 13-7-1963, 8.21 PM, 80E10, 16N05. మకర లగ్నం . సూర్యోదయం : 5.48, సూర్యాస్తమయం : 18.41 రాత్రి ప్రమాణం : 667 Min ఒక గ్రహ సమయం = 667/8 = 83.375 Min Or 83 Min 22 Sec శని వారం రాత్రి జననం కనుక 5 వది అయిన బుధుని నుంచి లెక్కించాలి . బుధ , గురు , శుక్ర అయిన తరువాత శని సమయం వస్తుంది . అనగా 3x83.375 Min = 250.125 Or 250 Min 7 Sec Or 4 hrs-10 Min- 7 Sec దీనిని సూర్యాస్త మయానికి కలుపగా : 6.41+4-10-7= 10.51.07 PM ఈ సమయానికి గులికోదయం జరుగుతుంది . ఈ సమయానికి ఉదయ డిగ్రీలు : మీన 8 De 17 Min కనుక గుళిక మీన రాశిలో 8.17 డిగ్రీలలో ఉంది . నవాంశ లో దీని స్థితి కోసం ఇలా లెక్కించాలి . గుళిక మీన రాసి లో మూడవ పాదంలో ఉంది . కనుక కర్కాటకం నుంచి నవాంశ లెక్క మొదలు అవుతుంది . అనగా కటకం నుంచి మూడవ రాశి అయిన కన్య లో గుళిక ఉంది . ఇప్పుడు లగ్న పరీక్ష చేస్తే , లగ్నమైన మకరం నవాంశ గుళిక స్థితి అయిన కన్య కు కోణ స్థితి లో ఉంది . కనుక మకర లగ్నం కరెక్టు అని చెప్ప వచ్చు . వచ్చే వ్యాసంలో గుళిక ద్వారా ఆశ్చర్య కరమైన ఫలితాలు ఎలా చెప్ప వచ్చో చూద్దాం .
పంచ తత్వ సిద్ధాంత రీత్యా, ఒక ఉదాహరణతో జనన కాల సంస్కరణ చేద్దాం. జనన తేది: 5-1-1990 శుక్ర వారం ఒక పిల్లవాని జననం జరిగింది. సమయం: 13.05 hours Long 77 E 23; Lat 15 N 18. సూర్యోదయం: 6-51 hours సూర్యాస్తమయం: 17-59 hours ఈ వివరాలతో లెక్క మొదలు పెడదాం. దినమానం: 668 min తత్వారోహణ సమయం: 668/8 = 83 min 30 sec ఆరోహణ అవరోహనకు పట్టే సమయం: 2 hours 47 min. ఈ రోజు శుక్రవారం గనుక జలతత్వం ప్రారంభం. జలతత్వం: 24/90 x83.5 = 22 min 18 sec అగ్నితత్త్వం: 18/90x83.5 = 16 min 42 sec వాయు తత్త్వం: 12/90x83.5 = 11 min 8 sec ఆకాశ తత్త్వం: 6/90x83.5 = 5 min 36 sec భూ తత్త్వం: ౩౦/90x83.5 = 27 min 48 sec సూర్యోదయం నుంచి 2 hours 47 min కి ఒక వృత్తం చొప్పున రెండు ఆవృత్తములు తిరిగి 12-25 PM కి మరలా జలతత్త్వం ఉదయిస్తూ ఉంటుంది. జలతత్వం: 12.25+22.18= 12.47.18+16.42 (agni)= 1.04+11.8(vaayu) = 1.15.8 కనుక వాయు తత్వములో జన్మ జరిగింది. దీనిలో అంతర్ తత్వములు: వాయు తత్త్వం= 11.13 min వాయు అంతరం: 11.13/83.5x11.13 = 1 min 30 sec ఆకాశ అంతరం: 11.13/83.5x5.6 = 0 min 44 sec భూ అంతరం: 11.13/83.5x27.28= 3 min 37 sec జన్మ సమయం 13.05 hours 13.04+1.30(vaayu antar)= 13.5.౩౦ వాయు అంతరం కనుక స్త్రీ జన్మ జరగాలి. కాని పురుష జన్మ కనుక తిరిగి ఆకాశ అంతరం 44 sec కలుపగా 13.05.30+0.44= 13.06.14 ఇది ఆకాశ అంతరం కనుక పురుష జన్మ తో సరి పోతుంది. కనుక జనన సమయం ఒక నిముషం ముందుకు జరపాలి. సవరించిన జన్మ సమయం 13. 06 Hours అనితీసుకోవచ్చు. ఇది చాలా ఖచ్చితంగా రికార్డు చెయ్య బడిన సమయం. అయినప్పటికీ తత్వ రీత్యా ఒక నిముషం సవరణ అవసరమైంది. దీనిని ఇతర విదానములతో cross check చేస్తే నాడీ అంశను నిర్థారించ వచ్చు.