నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

25, మార్చి 2009, బుధవారం

గుళిక సాధన


వ్యాసంలో ఇంకొక విధానం ద్వారా జనన కాల సంస్కరణ చేద్దాం.

గుళిక అనేది గ్రహమో ఉపగ్రహమో కాదు అది ఒక గణిత బిందువు. పరాశరాది ఋషులు అనేక గణిత బిందువులను కూడా ముఖ్యం గా స్వీకరించారు. అంటే వేల సంవత్సరాల నాడే గణిత జ్యోతిషంలో ఎంతటి రీసెర్చి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇవి ప్రాతి పాదిక మీద పుట్టాయో కూడా అర్థం కాని దుస్థితిలో నేడు మనం ఉన్నాం.

గుళిక అనే బిందువును కేరళ జ్యోతిష్కులు చాలా ముఖ్యమైన దానిగా పరిగనిస్తారు. ప్రశ్న విధానంలో దీని పాత్ర అమోఘం. ఏదైనా సంశయం వస్తే, గులికను నిర్ణయాత్మక బిందువుగా వారు చూస్తారు. పరాశర హోరలోను, ప్రశ్న మార్గాది ఇతర కేరళ గ్రంథాల లోను దీని వివరాలు ఉన్నాయి.

గుళిక సాధన

దిన ప్రమాణం 8 భాగాలు చెయ్యాలి. ఆయా భాగాలకు వరుసగా ఆయా దినాధిపతులు నాధులైతారు. ఎనిమిదో భాగం శూన్యం. దానికి అధిపతి లేదు. భాగాలలో శని భాగం ఉదయ సమయం గుళిక కాలం అంటారు. అప్పటి లగ్న బిందువును గుళిక బిందువు అంటారు. అదే రాత్రి జన్మ అయితే కూడా ఇదే విధానం కాని గ్రహ సమయాలు వార గ్రహం నుంచి ఐదో గ్రహంతో మొదలు పెట్టాలి. గ్రహముల లెక్క వారముల వరుసలోనే వస్తుంది.

గుళిక ఆశ్చర్య కరమైన ఫలితాలను ఇస్తుంది. కేరళ జ్యోతిష్కులు కళ్లు తిరిగే ఆశ్చర్య కరమైన ఫలితాలు ఎలా చెప్పగలుగు తున్నారంటే గుళిక వంటి ప్రత్యెక బిందువులు, విధానాలే కారణం.

దీనికి ఆధారాలు, ఎట్లా ఇది కనుక్కున్నారు అనేవి ప్రస్తుతం దొరకటం లేదు. మన ముఖ్య రిసెర్చి గ్రన్థాలన్నీ ముస్లిం దండ యాత్రలలోనూ, మన నిర్లక్ష్య ధోరణి తోనూ కాల గర్భం లో కలిశి పోయాయి. మిగిలిన కాస్త కూడా మన తిరస్కార ధోరణికి గురౌతున్నది.

కాని మనం నిర్లక్ష్యం చేసినా విదేశీయులు ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీ ని కళ్ళకద్దుకుని నేర్చుకుంటున్నారు. యోగాలోను, వేద జ్యోతిషంలోను అమెరికా, యూరప్ లో జరుగుతున్న రీసెర్చి కి భారతీయులుగా మనం సిగ్గుతో తలదించుకొనే స్థితి ఇప్పటికే వచ్చింది. బహుశా వారు మనకు నేర్పే రోజు దగ్గర లోనే ఉందేమో.

విషయాలు అట్లా ఉంచితే, గుళిక అనేది, లగ్నాన్ని గుర్తించటానికి కూడా పనికి వస్తుంది. అయితే లగ్న డిగ్రీలను ఖచ్చితంగా గుర్తించ టానికి ఇతర పద్ధతులుu వాడాలి. లగ్న సంధి లో ఉన్నా, లగ్నమో తెలియని స్థితిలో ఉన్నా,లగ్నం అనేది గుళిక సహాయంతో ఖచ్చితంగా గుర్తించ వచ్చు.

గుళిక టెస్ట్

గులికకు గాని, దాని నవాంశ కు గాని లగ్నం కోణ స్థితిలో ఉంటుంది. లేదా సప్తమంలో ఉంటుంది. లగ్నాధిపతి పరివర్తన చెందటం లేదా బలమైన గ్రహంతో లగ్నం చూడ బడటం జరిగితే ఆ గ్రహాన్నుంచి కోణం లో ఉంటుంది. ఇది ఖచ్చితమైన టెస్ట్ గా చెప్పవచ్చు.

ఉదాహరణతో ఒక జాతకం చూద్దాం.

జనన సమయం: 13-7-1963, 8.21 PM, 80E10, 16N05. మకర లగ్నం.
సూర్యోదయం: 5.48, సూర్యాస్తమయం: 18.41
రాత్రి ప్రమాణం: 667 Min
ఒక గ్రహ సమయం = 667/8 = 83.375 Min Or 83 Min 22 Sec
శని వారం రాత్రి జననం కనుక 5 వది అయిన బుధుని నుంచి లెక్కించాలి. బుధ, గురు, శుక్ర అయిన తరువాత శని సమయం వస్తుంది.
అనగా 3x83.375 Min = 250.125 Or 250 Min 7 Sec Or 4 hrs-10 Min- 7 Sec
దీనిని సూర్యాస్త మయానికి కలుపగా: 6.41+4-10-7= 10.51.07 PM
సమయానికి గులికోదయం జరుగుతుంది.
సమయానికి ఉదయ డిగ్రీలు: మీన 8 De 17 Min
కనుక గుళిక మీన రాశిలో 8.17 డిగ్రీలలో ఉంది.
నవాంశ
లో దీని స్థితి కోసం ఇలా లెక్కించాలి.
గుళిక మీన
రాసి లో మూడవ పాదంలో ఉంది. కనుక కర్కాటకం నుంచి నవాంశ లెక్క మొదలు అవుతుంది. అనగా కటకం నుంచి మూడవ రాశి అయిన కన్య లో గుళిక ఉంది.

ఇప్పుడు లగ్న పరీక్ష చేస్తే, లగ్నమైన మకరం నవాంశ గుళిక స్థితి అయిన కన్య కు కోణ స్థితి లో ఉంది. కనుక మకర లగ్నం కరెక్టు అని చెప్ప వచ్చు.

వచ్చే వ్యాసంలో గుళిక ద్వారా ఆశ్చర్య కరమైన ఫలితాలు ఎలా చెప్ప వచ్చో చూద్దాం.