నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, మే 2009, బుధవారం

డాక్టర్ హానెమాన్ జాతకం: శకట యోగం


డాక్టరు హాన్నేమాన్ అత్యంత మేధా సంపన్నుడూ, శాస్త్ర వేత్తా అయి కూడా జీవితమంతా నానా బాధలు పడ్డాడు. శాస్త్రీయస్పృహ ఉన్న పశ్చిమ దేశాలలోనే ఈయన వేధింపులకు గురి అయ్యాడంటే వారి శాస్త్రీయత నేతి బీరకాయ అని తోస్తుంది. దానికి అసలు కారణాలు ఆయన జాతకంలోని దుర్యోగాలు. ఈయన జాతకంలో చూడగానే కనిపించే దుష్ట యోగం శకటయోగం. గురువు నుంచి చంద్రుడు 6,8,12 స్థానములలో ఉంటే యోగం కలుగుతుంది. హానేమాన్న్ జాతకంలో చంద్రుడు మకరంలో మరియు గురువు సింహంలో ఉండుట తో యోగం ఏర్పడింది.

శకట యోగాన్ని గురించి ఫలదీపిక ఆరవ అధ్యాయం పదిహేడవ శ్లోకంలో విధం గా అంటుంది.

శకట యోగ జాతకుడు దురదృష్ట వంతుడు మరియు తాను కోలుపోయిన దానిని తిరిగి పొందువాడు అగును. అతడు ప్రపంచమున పేరు లేని వాడు, సాధారనుడు అగును. అనేక కష్టములను మానసిక వ్యధను పొందును.

శకటం అనగా బండి. అనగా బండి వలె దేశ దేశాలు తిరుగ వలసిన అగత్యం పడుతుంది. యోగం వల్లనే హనెమాన్ తనకు అసాధారణ మేధా సంపత్తి ఉండి కూడా ప్రపంచ నిరాదరణకు గురి అయ్యి, ప్రజలు ప్రభుత్వాల చేత వెంటాడబడి చివరకు జర్మనీని విడిచి పారిస్ లో తన చివరి దశను గడుప వలసి వచ్చింది.తాను కోలుపోయిన గుర్తింపును జీవిత చివరి దశలో తిరిగి పొందాడు. కాని జీవితమంతా కష్టాలను మానసిక వ్యదను అనుభవించాడు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే శకట యోగం ప్రభావం స్ఫుటం గా కనిపిస్తుంది.