నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, డిసెంబర్ 2009, గురువారం

జీవితం


ప్రతి నిముషం సమస్యలతో పోరాటం
అనుక్షణం దేనికోసమో ఆరాటం
చివరికి తప్పని ఆశాభంగం
ఇది కాదోయ్ జీవితం
చదువూ ఉద్యోగం సంపాదనా సంసారం
వార్ధక్యం నిష్క్రమణం ఇది కాదోయ్ జీవితం
నటించేవాడు ఆస్వాదించలేడునాటకాన్ని
జీవించేవాడు తెలుసుకోలేడు

జీవితాన్ని
నీడల వెంట పరుగెత్తేవాడు
చేరుకోలేడు వెలుగును
ఎండమావులే నిజమనుకుంటే
తీర్చుకోలేడు దాహాన్ని
నాది అనుకున్న ప్రతిదీఒకనాటికి నిన్నువిస్మరిస్తుంది
ఎప్పుడూ నిన్ను విడువని నిన్ను
ఎందుకు విస్మరిస్తున్నావ్ నువ్వు?
ఎన్నిసార్లు ఆడావో ఈ ఆటను
గుర్తుందా నీకు?

ఎన్నిసార్లు ఓడావో ఈ యుద్ధంలో
ఎలా మరిచావ్ నువ్వు?

ముగుస్తోంది నీ ప్రయాణం
గమ్యం చేరకముందే
ఈసారి జరగనివ్వకలా


నువ్వు వ్రాసుకున్న విధి

నిన్నే వెక్కిరిస్తోంది
ఈమారు ఒప్పుకోకలా
  ఎన్నాళ్ళీ వృధా స్వప్నాలు?
నీడల లోకంలో నిజమనేది ఉందా ?నీ పిచ్చి వెతుకులాటలో
ఏం కోల్పోతున్నావో తెలుస్తోందా?
నువ్వు ప్రేమిస్తున్న ఈ జీవితం
జారిపోతోంది అనుక్షణం
నీ వేళ్ళ మధ్యనుంచిఇదెప్పుడైనా గమనించావా?

దేనికోసం నీ పరుగు
గమ్యం కోసమా?ప్రతి గమ్యం ఒక భ్రమే
ఇంకా తెలీదా నీకు?
నువ్వు వెతుకుతున్న గమ్యం ఉంది నీలోనే
నీ ప్రయాణం నిజానికి
సాగాలి నీలోనికే
అదే నిజమైన జీవితం
అపుడే నీ తృష్ణకి అంతం