నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

14, మార్చి 2010, ఆదివారం

అతికామ యోగాలు

జ్యోతిర్విజ్ఞానం లో, ఒక మనిషిలోని అతి కామ వాంచలను తెలుసుకోగలిగే కొన్ని యోగాలు ఉన్నవి.బృహత్పరాశరాది ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో దీని గురించి అనేక యోగములు (కాంబినేషన్స్) ఇవ్వబడ్డాయి. అనేక వందల రకములైన యోగములను తరచి చూడగా కొన్ని ముఖ్య సూత్రములు కనిపిస్తాయి.

జాతక చక్రంలో సప్తమ స్థానం కామ విషయికంగా అతి ముఖ్యమైనది. గ్రహ పరంగా శుక్రుడు,కుజుడు,రాహువు ముఖ్య గ్రహాలు. అలాగే వీరి రాశులైన వృషభం,తులా,మేషం,వృశ్చికం ముఖ్యమైనవి.

సప్తమానికి ఎదురుగా ఉండే లగ్నంకూడా ముఖ్యమైనదే. ఎందుకనగా, ఇది జాతకునికి సూచిక మాత్రమే గాక, ఇందులో ఉండే గ్రహం సప్తమాన్ని చూస్తుంది. అలాగే సప్తమంలో ఉండే గ్రహం లగ్నాన్ని చూస్తుంది. కనుక లగ్నం కూడా ముఖ్యమైనదే.

శని గ్రహం సామాన్యంగా సోమరితనాన్ని, బద్దకాన్ని,కష్టాలను,బాధలను సూచిస్తుంది. కాని పై గ్రహాలతో కూడి ఉంటే నీచ ప్రవర్తనను చూపుతుంది. అతికామం కలిగిన వారు సామాన్యంగా నీచ ప్రవర్తన కలిగి ఉంటారు కనుక గ్రహం కూడా ముఖ్యమైనదే.

పై నాలుగు గ్రహాల నక్షత్రాలు పరిశీలించగా, మొత్తం పన్నెండు నక్షత్రాలు వస్తాయి. వీనిలో తిరిగి సూక్ష్మ పరిశీలన చెయ్యగా-

**కుజునిదైన మేష రాశి(అగ్ని తత్వ రాశి) గనుక, ఇందులో ఉండే శుక్ర నక్షత్రమైన భరణి
**శుక్రునిదైన వృషభ రాశి (భూతత్వ రాశి) లోని కుజ నక్షత్రమైన మృగశిర ఒకటి రెండు పాదములు
**అలాగే, శుక్రునిదైన తులా (వాయు తత్వ రాశి) రాశిలో కుజునిదైన చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు, రాహువుదైన స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు.

అలాగే, కుటుంబ స్థానం అయిన రెండవ భావం మరియు సుఖ స్థానం అయిన నాల్గవభావం కూడా ముఖ్యమైనవే. వెరసిపైన చెప్పిన నక్షత్రాలు, రాశులు, భావాలు, గ్రహముల కలయిక అతికామ యోగాలను ఇస్తుంది. కాంబినేషన్స్ కుఎటువంటి వారు కూడా అతీతులు కారు. నేను నిత్యానంద జాతకం చూడలేదు. కాని జరుగుతున్న విషయాలను బట్టిఅతని జాతకంలో రాహువు,శుక్రుడు,కుజుడు- మూడు గ్రహాల పాత్ర అతి బలీయంగా ఉందని ఊహిస్తున్నాను.

ఎందుకనగా, రాహువు+శుక్రుల కలయిక సినిమా స్టార్స్, మోడల్స్ తో శృంగారాన్ని ఇస్తుంది. విలాసాలు,కుతంత్రాలతోకూడిన జీవితం కూడా కాంబినేషన్ ఇస్తుంది. శుక్రుని బలం వల్ల ముఖంలో చక్కని కళ, సమ్మోహనమైన నవ్వుఉంటాయి.కుజుని బలీయమైన స్థితి వల్ల ధృఢమైన శరీరం ఉంటుంది. ఇవన్నీ ఇతని విషయంలో ఉన్నాయి కనుకజాతకంలో పై గ్రహాల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేగాక, కాంబినేషన్ వల్ల, బయటి వారి రహస్యప్లాన్ లకు జాతకుడు బలి కావటం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మొత్తం వ్యవహారంలో క్రైస్తవమిషనరీల కుతంత్రం కూడా ఉండవచ్చు అనటానికి కూడా అవకాశం ఉన్నది.

ఏది ఏమైనప్పుటికీ, జాతకంలో అతికామ యోగాల పరిశీలన వల్ల జాతకుని మానసిక సంతులనం, నిగ్రహం ఎంతవరకుఉన్నాయి అన్న విషయం, అతనికి/ఆమెకు కామాసక్తి ఎంతవరకు ఉంటుంది అన్న విషయాలు తెలుసుకోవచ్చు.