Pages - Menu

Pages

16, జులై 2011, శనివారం

పానగల్లు ఆలయాలు



మొన్నీమధ్య నల్గొండ వెళ్ళినపుడు పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం, ఛాయాసోమేశ్వరాలయాలను చూడటం జరిగింది. 10 -11 శతాబ్దాలలో ఈ నిర్మాణాలు జరిగాయట. పొందూరుచోడులు అనే రాజులు కాకతీయరాజుల సామంతులు. వాళ్ళు ఈ ఆలయాలు కట్టించారు. 

పక్కనే కొంత దూరంలో ఉదయసముద్రం అనే పెద్ద చెరువు ఉంది. అదీ ఆ రాజులు కట్టించినదే. కొండల్లో ఉన్న లోతట్టు ప్రాంతాన్ని ఎంచుకుని దానిచుట్టూ గట్టు కట్టారు. వర్షపు నీరు అక్కడికి చేరుతుంది. అప్పట్లోనే ఐదువేల ఎకరాలను అది సాగు చేసేదిట. దాని దిగువన నేటి నల్లగొండ పట్టణం ఉన్నది. ప్రాచీన కాలంలో తెలుగునాడులోని ముఖ్య నగరాలలో పానగల్లు ఒకటిట.

ఈ రెండు ఆలయాలూ ముస్లిం దండయాత్రల్లో ఘోరంగా ధ్వంసం చెయ్యబడ్డాయి. విరిగిపోయి దిక్కులేకుండా పడి ఉన్న శిల్ప సంపదను చూస్తె గుండె తరుక్కుపోతుంది. ఒక్కొక్క శిల్పాన్నీ చెక్కడానికి ఎన్నెన్ని నెలలు పట్టాయో ఊహకందదు. అంత చక్కని శిల్పాలు అక్కడ ఉన్నాయి. వాటిని నాశనం చెయ్యడానికి ముస్లిములకు చేతులెలా వచ్చాయో అర్ధం కాదు. 

ఆ విరిగిన శిల్పాల మధ్యన నిలబడి ఆలోచిస్తే, వాళ్ళంత రాక్షసజాతి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో అనిపించింది. ఈనాటికీ వాళ్ళలో మార్పు రాలేదు. ఈ మధ్య కాలంలోనేగా బమియాన్ బుద్ధ విగ్రహాలను షూటింగ్ రేంజిగా మార్చుకుని  వరల్డ్ హెరిటేజి సైట్ ను కూడా రాక్షసంగా ధ్వంసం చేసారు -- అని పక్కనే ఉన్న స్నేహితుడు కామెంట్ చేసాడు. పైగా ఇస్లాం అంటే శాంతి అని చెప్తారు. వీళ్ళు చెప్పే నీతులు దయ్యాలు నీతులు చెప్తున్నట్లు ఉంటాయి. 

విరిగిపోయి ధ్వంసం కాబడిన ముక్కల్ని ఒకచోట ఉంచి "మ్యూజియం" నడుపుతోంది ప్రభుత్వం. ఆ మ్యూజియం చూస్తె హృదయం ద్రవిస్తుంది. మ్యూజియం చుట్టూ ఉన్న ఆవరణలో యుద్ధం లో కాళ్ళూ చేతులూ తెగి పడి ఉన్న సైనికులలాగా అనేక శిల్పాలు శిదిలావస్తలో వికలాంగుల లాగా పడి ఉండటం చూస్తె కళ్ళలో నీరు గిర్రున తిరిగుతుంది. కాళ్ళూ చేతులూ విరిగిన గణేశ విగ్రహాలు, బుద్ధ విగ్రహాలు, నిలువునా నరికివేయబడిన నంది విగ్రహాలు లెక్కలేనన్ని కనిపిస్తాయి. సంపదను దోచుకుంటే దోచుకున్నారు. కళాఖండాలను కూడా నాశనం చెయ్యటం ఏమిటో? వారిది అసలు మానవ జన్మేనా అని అసహ్యం కలుగుతుంది.   

ఈ రెండు ఆలయ సముదాయాలూ కట్టిన శిల్పరీతిని త్రికూట ఆలయనిర్మాణం అంటారుట. అంటే ఒక ఆలయంలో మూడు ఆలయాలు ఉంటాయి. అన్నీ కలిసి ఒకే కప్పు కింద ఉంటాయి. ఛాయా సోమేశ్వరాలయం లో ఉన్న రెండు స్తంభాల నీడా ఒక్కటిగా శివలింగం మీద పడుతూ లింగాకారం కప్పువరకూ ఉన్న భ్రాంతిని కలిగిస్తుంది. ఏ నెలలో అయినా సూర్యకాంతి ఒకే విధంగా పడుతూ ఈ రకమైన ఎఫ్ఫెక్ట్ ఏడాది పొడుగునా ఒకేలా ఉంటుంది.  సింపుల్ టెక్నిక్ తో దీనిని రాబట్టారు. 

పచ్చల సోమేశ్వరాలయంలోని రాతిని ఓరుగల్లు వద్ద దొరికే పచ్చ రాయితో కట్టించారని దానికా పేరు వచ్చిందట. ఈ ఆలయంలో ఒకరకమైన శాండ్ స్టోన్ తో తయారు చేసిన గణేశ విగ్రహం ఒకటి ఉంది. గట్టిగా పిసికితే ఆ రాయి పిండి అయిపోతుంది. అంత మెత్తని రాతిని ఎంత అద్భుతంగా చేక్కారంటే, గణపతి చేతిలోని లడ్డులో ఉండే రవ్వ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మధ్యనే ఇక్కడికి వచ్చిన హరిహర్ శృంగేరీ శంకరాచార్యస్వామి ఈ విగ్రహాన్ని చూచి "ఇది మహత్తరమైన విగ్రహం. దీనిని జాగ్రత్తగా కాపాడుకున్నంత వరకూ నల్లగొండకు ఏమీ భయం లేదు." అని చెప్పారట. 

నల్లరాతితో చెక్కిన నందివిగ్రహాల నునుపు ఎంత బాగుంటుందంటే నేటి ఆధునిక మిషన్లతో కూడా అటువంటి నునుపును తీసుకు రాలేము. చెన్న కేశవ స్వామి విగ్రహానికి ఉన్న కిరీటమూ మరియు ఆభరణాల పనితనం వర్ణించడానికి మాటలు చాలవు. రాతి చెక్కడంలో అంత సూక్ష్మమైన వర్క్ ను చెక్కడం అంటే ఎంతో అద్భుతం. ఆలయం గోడలపైన చెక్కిన ఏనుగుల బొమ్మలు నిజంగా అద్భుతం. ఆడుకుంటున్నవి, ఒకదానివేనుక ఒకటి పరిగేట్టుతున్నవి, యుద్ధం చేస్తున్నవి, ఇలా ఏనుగుల అనేక మూడ్స్ ను ఎన్నో శిల్పాలలో అద్భుతంగా చెక్కారు. అవీ ధ్వంసం అయి హృదయ విదారకంగా ఉన్నాయి. అటువంటి కళాఖండాలను ధ్వంసం చెయ్యడానికి మనసెలా వచ్చిందో ఆ రాక్షసులకు అని చాలా బాధ కలిగింది.

ఛాయా సోమేశ్వరాలయంలో పై కప్పు తొమ్మిది భాగాలుగా విభజించబడి ఉంది. వాటిలో ఒక్కొక్క భాగంలోనూ ఒక్కొక్క గ్రహం యొక్క యంత్రం పద్మాకారంలో చెక్కబడి ఉండటం గమనించాను. అంటే తొమ్మిది ఖాళీలలో నవగ్రహాల యంత్రాలు ఉన్నాయి. మధ్యలో ఉన్న సూర్య యంత్రంలో మధ్యలో సూర్యుణ్ణి ఉంచి చుట్టూ నవగ్రహాలను చెక్కారు. దానికేదో ఖగోళపరమైన  ఉపయోగం ఉందని అనిపించింది. 

ఈ ఆలయం ముందున్న కోనేటినుంచి నీరు కాలువల ద్వారా ఆలయంలోనుంచి ప్రవహిస్తూ తిరిగి మళ్ళీ కోనేటిలోకి చేరేటట్లు కట్టబడి ఉన్న కన్సీల్డ్ కాలువలు చూస్తె రీ సైక్లింగ్ అనేది వెయ్యి సంవత్సరాల నాటి ఆ రోజుల్లో కూడా ఉందా అని ఆశ్చర్యం కలిగింది.

బాలనాగమ్మ నాటకమూ, సినిమా మనకు తెలుసు. అందులో మాయలపకీరు బాలనాగమ్మను బంధించితే రాజు చివరకు విడిపిస్తాడు. ఆ కధ ఇక్కడే జరిగిందని స్థానికులు చెబుతారు. మాయల పకీరు ఇక్కడే ఛాయా సోమేశ్వరాలయం లో ఉండేవాడట. సినిమాలో చూపినట్లు అతను దుర్మార్గుడు కాదుట. ఈశ్వర ఉపాసకుడై ఉండి, తన శక్తులతో ప్రజలకు మేలు చేస్తూ ఈ ఆలయంలోనే ఉంటూ ఉండేవాడట. తరచుగా ఈశ్వర దర్శనానికి వచ్చే రాణిని చూచి మోహించి ఆమెను తన మంత్రశక్తులలో వశపరచుకుందామని ప్రయత్నించాడుట. అది తెలిసిన రాజు, మాంత్రికుణ్ణి తన కత్తికి బలిచేసాడని ఒక స్థానిక గాధ వినిపిస్తుంది. పాపం మాంత్రికుడు మంచివాడే. అతను అసలు మాంత్రికుడు కాదనీ, శైవ ఉపాసకుడనీ కూడా అంటారు.
కాకుంటే అతనికి రావణునికి ఉన్న బలహీనత లాటిదే ఉంది. తన స్థాయిని  మరచి ఏకంగా రాణినే మోహించేసరికి రాజు చేతిలో బలయ్యాడు. సినిమాకోసం దీన్ని చిలవలు పలవలుగా కథ అల్లి మూడు గంటలకు పెంచారు. వెయ్యి సంవత్సరాల క్రితం ఇక్కడ  శైవ మతం బాగా పరిడవిల్లింది అనడానికి రుజువులు చాలా కనిపిస్తాయి.

ఆలయంలో ఫోటోలు తీసుకుంటున్న సమయంలో నాలుగో ఐదో తరగతులు చదువుతున్న స్కూలు పిల్లలు ఒక ఇరవై మంది అక్కడకు వచ్చారు. మాకూ ఫోటోలు తియ్యండి అంకుల్ అని వాళ్ళడిగితే సరే అని కొన్ని ఫోటోలు తీశాను. "బాబూ మీరంతా బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలి" అని వారితో చెప్పాను. అదే నే చేసిన తప్పు. వాళ్ళలో ఒక బొడ్డూడని కుర్రకుంక " ఎందుకు చదువుకోం సార్? తెలంగాణా వస్తే మేమూ బాగా చదువుకొని మంచిఉద్యోగాలు చేస్తాం.జై తెలంగాణా" అని నినదించాడు. అంతే. ఆ పిల్లలందరూ "జై తెలంగాణా, జై తెలంగాణా" అని ఒకటే గోల. అది చూసి నాకు నోట మాట రాలేదు. అంత చిన్న పిల్లలకు కూడా ఎంతగా ఈ పిచ్చిని నూరిపోశారో అనిపించింది.

ఇలాటి సైట్ ఒకటి అమెరికాలో ఉంటె దాన్ని ఎంత బాగా డెవెలప్ చేసి, ఒక టూరిస్ట్ సెంటర్ గా మార్చి ఉండేవారో కదా అనిపించింది. లక్షల కోట్లు స్విస్స్ బ్యాంకులలో మూలుగుతున్న డబ్బుతో ఇలాటి హెరిటేజ్ సైట్స్ బాగు చేస్తే ఎంత బాగుంటుంది? మన చరిత్ర ఎంత గొప్పదో, మన దేవాలయాలు ఎంత గొప్పవో, మన కళలు ఎంత గొప్పవో కనీసం ఈ తరాలకు తెలుస్తుంది. దిక్కూ మొక్కూ లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఎంత శిల్ప సంపద ఇలా అఘోరిస్తున్నదో? ఇదంతా చూస్తుంటే ఛీ మనది ఎంత సిగ్గులేని జాతో అని అసహ్యం కలుగుతుంది. బానిస బతుకే మనకు కరెక్ట్. మన సంస్కృతీ వారసత్వాన్ని ఆస్వాదించే హక్కు మనకు లేదు అనిపించింది.

ముష్కరుల చేతుల్లో ముక్కలైన మన జాతిసంపదను మ్యూజియాల్లో పెట్టుకుని చూసుకుంటూ మురిసిపోయే ముదనష్టపు నిర్వీర్యత మన ముఖాలనుంచి ఎప్పుడు తొలగుతుందో? మన ప్రాచీన శిల్ప సంపదను, నాశనం అవుతున్న ఇతర కళా సంపదలను రక్షించుకుని వాటిని చూచి గర్వపడే రోజు ఎప్పుడొస్తుందో?