కొత్త సంవత్సరంలో నేను తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా జనవరిలో సమాజానికి దూరంగా 'ఏకాంతవాసం' జయప్రదంగా జరిగింది.
ఆ రెండురోజులూ ఎవరితోనూ సంబంధం లేకుండా నాలోకంలో నేనున్నాను. అతితక్కువ ఆహారం,పూర్తి మౌనం,రహస్యయోగసాధన,మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం,ప్రకృతిలో మమేకమై విహరించడం,బాహ్యాంతరిక ప్రకృతి రహస్యాలను అర్ధం చేసుకుంటూ ఏకాంతవాసం గడిచింది.
ముఖ్యంగా చీకటి రాత్రులలో సమాజానికి దూరంగా నిర్మానుష్య ప్రదేశాలలో ఒంటరిగా ఉండటం చాలా వింత అనుభూతినిస్తుంది.అలా...
31, జనవరి 2013, గురువారం
29, జనవరి 2013, మంగళవారం
వీదిబజారులో వింత మోళీలు
ఎవరో తెలియని లోకుల కోసం
ఏదీ పట్టని లోకం కోసం
నీవేడుస్తావెందుకు నేస్తం
నీ ఏడుపు వినేవాడెవ్వడు
నిన్నోదార్చే వాడెవ్వడు
భ్రమలు వీడి సత్యం వైపు తేరిచూడు
పొరలు కరిగిపోయేలా పట్టిపట్టి చూడు
ఈ నాటకరంగంలో
రాజు రాజూ కాడు
పేద పేదా కాడు
వాళ్ళ మాటలు వాస్తవాలూ కావు
వాళ్ళ వేషాలు సత్యమైనవీ కావు
పాత్రలు నిజమని భ్రమించకు నేస్తం
నాటకం అబద్ధం నాటకరంగం వాస్తవం
ఎప్పటికీ ఇదే సత్యం
తెలుసుకో ఈ నిజం
నేటి...
లేబుళ్లు:
మనోవీధిలో మెరుపులు
25, జనవరి 2013, శుక్రవారం
శని రాహు యోగం-4 (కమలహాసన్ విశ్వరూపం)
నటుడు కమలహాసన్ జాతకాన్ని ఇంకోసారి ఎప్పుడైనా తీరికగా చర్చిస్తాను. ప్రస్తుతం మాత్రం ఇతనిమీద శపితయోగ ప్రభావం మాత్రమె మాట్లాడు కుందాం.
ఇతని జాతకంలో చాలా మంచి యోగాలు కొన్ని ఉన్నాయి.కుజుడూ గురువూ శనీ ఇతని జాతకంలో ఉచ్ఛ స్తితిలో ఉన్న గ్రహాలు.అందుకే అన్ని అవార్డులు సొంతం చేసుకోగలిగాడు. విలక్షణమైన ప్రయోగాలు చేసే నటుడు అనిపించుకున్నాడు.ప్రస్తుతం ఆ సంగతి అలా ఉంచుదాం.
ఇతని జాతకంలో శని సూర్యుడు వక్రబుదుడూ తులారాశిలో ఉన్నారు. ఇతని లగ్నం...
లేబుళ్లు:
జ్యోతిషం
24, జనవరి 2013, గురువారం
శని రాహు యోగం -3 (వ్యక్తిగత జీవితాలలో ప్రభావాలు)
ఈ యోగ ప్రభావం దేశంమీదే కాదు మనుషుల జీవితాలలో కూడా దారుణంగా ఉంటుంది.అయితే ఈ దారుణ ఫలితాలకు గ్రహాలు బాధ్యులు కావు.దానికి కారణాలు మనుషులు చేసుకునే కర్మలోనూ ఈ గ్రహాల కారకత్వాలలోనూ ఉన్నాయి.
మన బ్యాంక్ ఎకౌంట్లో డబ్బులు లేకపోతే అది బ్యాంక్ మేనేజర్ తప్పు కానట్లే, మన జీవితం సరిగా లేకుంటే దానికి దేవుడో గ్రహాలో బాధ్యులు కావు.మనం చేసుకున్న కర్మే దానికి కారణం.దానికి ఎవరినీ నిందించవలసిన పని లేదు.అయితే దానిని బాగుచేసుకునే అవకాశం మన చేతిలోనే...
లేబుళ్లు:
జ్యోతిషం
22, జనవరి 2013, మంగళవారం
శని రాహు యోగం -2 (ఆంధ్రా తెలంగాణా గొడవలు)
ఆంద్రదేశం గురించి మనకు తెలిసినంత వెనుకనుంచి నేటి తెలంగాణారాష్ట్ర ఉద్యమం వరకూ సంఘటనలను ప్రభావితం చేస్తున్న గ్రహస్తితులను పరికిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు కనిపిస్తాయి.వాటిని పరిశీలిద్దాం.
కుజుడు దక్షిణ భారతదేశానికీ ముఖ్యంగా ఆంద్రరాష్ట్రానికీ సూచకుడు.దక్షిణ దిక్కుకు ఆయనే అధిపతి అని మనకు తెలుసు.ఇకపోతే రాహుశనుల కలయిక శపితయోగం అవుతుందనీ మనకు తెలుసు.ఆంద్రదేశం మీద విశ్వామిత్రుని శాపం ఉన్నదని పురాణాలు మనకు చెబుతున్నాయి. ఎందుకంటే...
లేబుళ్లు:
జ్యోతిషం
17, జనవరి 2013, గురువారం
శనిరాహు(శపిత)యోగం - ఫలితాలు
జాతకంలో శనిరాహువులు ఒక రాశిలో కలసి ఉంటె అది గొప్పదోషంగా పరిగణింపబడుతుంది. దీనిని శపితయోగం అని అంటారు.కొన్ని జ్యోతిష సాంప్రదాయాలలో దీనిని మహాదోషంగా పరిగణిస్తారు.కొంతమంది నిష్టాపరులైన జోస్యులు అయితే, ఈ దోషం ఉన్న జాతకాన్ని చూడటానికి,ఆ జాతకునితో మాట్లాడటానికీ కూడా ఇష్టపడరు.
గోచారరీత్యా శనిరాహువులిద్దరూ ఒకే రాశిలో కలసినప్పుడు కూడా లోకానికి ఇదే దోషం ఏర్పడుతుంది.వీరిద్దరి పరస్పర వేగాలలో తేడాలవల్ల అలా కలవడం ఎప్పుడో కాని...
లేబుళ్లు:
జ్యోతిషం
12, జనవరి 2013, శనివారం
ఒక దివ్యజ్యోతి వెలిగి నేటికి 150 ఏళ్ళు
ఇంగ్లీషుతేదీల ప్రకారం వివేకానందస్వామి జన్మించి నేటికి 150 ఏళ్ళు పూర్తయ్యాయి.ఈ నూటఏభై ఏళ్ళుగా ఆయన చెప్పినదాన్ని మనం ఎంతవరకూ అర్ధం చేసుకున్నాం, ఎంతవరకూ ఆచరిస్తున్నాం అని ఇంకోసారి ప్రశ్నించుకోవలసిన రోజు ఈరోజు.
అసలెందుకు ప్రశ్నించుకోవాలి?ఎందుకు ఆయన చెప్పినది వినాలి?ఎందుకు ఆచరించాలి?ఏం ఆమాత్రం మనకు తెలీదా?అని ప్రశ్నించుకుంటే కొన్నిజవాబులోస్తాయి.
తరతరాలుగా మన జాతి మహర్షుల ప్రభోధాలను ఆచరిస్తూ ధర్మమార్గంలో నడుస్తున్నజాతి.మనం...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
7, జనవరి 2013, సోమవారం
డిల్లీ లో క్రైం రేట్ ఎందుకు ఎక్కువ? - కొన్ని సామాజిక కోణాలు
డిల్లీ వంటి నగరాలలో క్రైం రేట్ ఎక్కువగా ఉంటుంది.దీనికి కొన్ని కారణాలున్నాయి.అన్నింటి కంటే ముఖ్య కారణం మాత్రం ఒకటుంది.అనేక రాష్ట్రాలనుంచి వలస వచ్చిన రకరకాల సంస్కృతులూ మనస్తత్వాలూ కలిగిన మనుషుల వల్లనే ఇక్కడ క్రైం ఎక్కువగా జరుగుతుంది.
డిల్లీలో ఒక నేరం జేరిగితే దానికి కారకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులా,బిజినెస్ వ్యక్తులా పిల్లలే అయి ఉంటారు. లేదా బీహార్,రాజస్తాన్,పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చి నగరంలో అనేక చిన్న చిన్న పనులు చేసుకుంటున్న...
లేబుళ్లు:
ఇతరములు
6, జనవరి 2013, ఆదివారం
అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయా?
ఈ మధ్య జరుగుతున్న రేపులు అమ్మాయిల మీద దాడుల దృష్ట్యా కొన్ని రాష్ట్రాలలో అమ్మాయిలకు మార్షల్ ఆర్స్ నేర్పాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మంచిదే. ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ లో గత 30 ఏళ్ళుగా నాకున్న అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్తాను.
ప్రస్తుతం మన దేశంలో ఉన్న మార్షల్ ఆర్ట్స్ శిక్షకులలో బోగస్ శిక్షకులే ఎక్కువ.వీళ్ళలో చాలామందికి అసలైన మార్షల్ ఆర్ట్స్ రావు.వీరికి సరైన సంస్థలతో అఫిలియేషన్ ఉండదు.ఏవో కొన్ని మాయ టెక్నిక్స్...
లేబుళ్లు:
ఇతరములు
4, జనవరి 2013, శుక్రవారం
2013 లో మీ రాశిఫలాలు
రాహు,శని,గురువుల గోచారరీత్యా పన్నెండురాశులకు 2013 లో ఏమి జరుగబోతున్నదో చూద్దాం.
మేషరాశి
ఉన్నట్టుండి ఉత్సాహం పెరుగుతుంది.పనులన్నీ చకచకా కదులుతాయి.విదేశీ ప్రయాణాలు నెరవేరుతాయి.ఇతర మతాలగురించి సంస్కృతుల గురించి తెలుసుకుంటారు.సంఘంతో సంబంధాలు ఎక్కువౌతాయి.వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి వస్తుంది.లాభాలు వస్తాయి.మీ ఉన్నతిని చూచి కుళ్ళుకునేవారు ఎక్కువౌతారు.బలమైన శత్రువులు పెరుగుతారు.చెడుస్నేహాలు, అక్రమ సంబంధాలు,దురలవాట్లు రమ్మని...
లేబుళ్లు:
జ్యోతిషం
3, జనవరి 2013, గురువారం
రాహుకేతువుల రాశిమార్పు - 2013 ఫలితాలు
డిసెంబర్ 24 ప్రాంతంలో రాహుకేతువులు రాశులు మారినారు.రాహువు వృశ్చికంలో నుంచి తులలో ప్రవేశించాడు.కేతువు వృషభం నుంచి మేషంలోకి ప్రవేశించాడు.గత ఏడాదిన్నరగా వారు నీచస్తితిలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎంతో విధ్వంసాన్ని కలిగించారు.
విధ్వంసాన్ని రాహుకేతువులు కలిగించారు అనడం కంటే,భయంకరమైన చెడుకర్మను పోగుచేసుకున్న ప్రజలకు వారివారి కర్మానుసారం తగిన ఫలితాలిచ్చారు అనడం సరిగ్గా ఉంటుంది.గ్రహాలు మనకు మిత్రులూ కావు, శత్రులూ కావు.అవి దైవస్వరూపాలు.ఎవరెవరి...
లేబుళ్లు:
జ్యోతిషం
2, జనవరి 2013, బుధవారం
డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-5
న్యాయశాస్త్రంలో క్రిమినాలజీ,క్రిమినల్ జ్యూరిస్ ప్రుడెన్స్ వంటి సబ్జేక్టులున్నాయి.వాటిలో- అసలు నేరస్తులు ఎలా తయారౌతారు? వారు అలా రూపు దిద్దుకోవడానికి గల వ్యక్తిగత,సామాజిక,కుటుంబ కారణాలేమిటి?మొదలైన అంశాలూ,నేరాలూ-శిక్షలూ-వాటి తీవ్రతలూ ఎలా ఉండాలి?మరణదండన విధించడం సబబేనా?వంటి మౌలికమైన విషయాల పైన ప్రాచ్య,పాశ్చాత్య భావాల పరిశీలన ఉంటుంది.
మనస్తత్వ శాస్త్రం కూడా ఈ విషయం మీద అనేక కారణాలను కనుక్కున్నది. బాల్యంలో ఒక వ్యక్తి పొందిన అనుభవాలే...
లేబుళ్లు:
ఇతరములు
1, జనవరి 2013, మంగళవారం
డిల్లీ గ్యాంగ్ రేప్ కేస్-కొన్ని ఆలోచనలు-4
దారుణ రేప్ కు గురై చనిపోయిన అమ్మాయి శవాన్ని ఒక దొంగశవంలా దొంగచాటుగా దహనం చెయ్యడం హీనమైన చర్య. ఆ అమ్మాయికి సొంత ఊర్లో దహనసంస్కారాలు జరుగకుండా ఎక్కడో డిల్లీలో అనామకంగా అవి జరిపించడం ఆ అమ్మాయికి ఆత్మశాంతి లేకుండా చెయ్యడమే.కసబ్ నూ ఈ అమ్మాయినీ ఒకే విధంగా ప్రజలకు కనిపించకుండా కడతేర్చారు.ఇదా మనం ఈ అమ్మాయికి ఇచ్చే కనీస మర్యాద?ప్రధానమంత్రి ,ఇంకా ఇతర ప్రముఖులు దహన సంస్కారాలకు వచ్చినంత మాత్రానా,గంధపు కట్టెలతో దహనం చేసినంత మాత్రానా అదేమీ...
లేబుళ్లు:
ఇతరములు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)