నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, ఫిబ్రవరి 2014, శనివారం

ఫిబ్రవరిలో ముఖ్యమైన సంఘటనలు జరుగబోతున్న తేదీలు

ఫిబ్రవరి 15
రాజకీయ సమీకరణాలు మారతాయి.కళాకారులకు ప్రమాదాలుంటాయి. నాయకుల కుట్రలు ఎక్కువౌతాయి.ఎవరి స్క్రిప్ట్ వారు తయారు చేసుకుని చదువుతూ జనాన్ని వెధవాయిలను చెయ్యాలని చూస్తుంటారు.జనం ఇప్పటికే వెధవలయ్యారన్న సంగతి వారు గ్రహించలేరు.గ్రహించినా ఓట్లకోసం నాటకాలు ఆడుతుంటారు.

వ్యక్తిగత జీవితాలలో -- సమన్వయ లోపం వల్లా,ఒకరినొకరు అర్ధం చేసుకోలేక పోవడం వల్లా,మూడో వ్యక్తుల ప్రమేయం వల్లా ఈగో సమస్యలు తలెత్తి గొడవలు అయ్యే సూచన ఈ రోజున ఉన్నది.

ఫిబ్రవరి 19,ఫిబ్రవరి 20
ఫిబ్రవరిలో ఈ తేదీలు చాలా ముఖ్యమైనవి.కొందరికి అధికారం పోతుంది.కొందరికి వస్తుంది.కొందరికి పండుగ అయితే ఇంకొందరికి ఏడుపు మిగుల్తుంది.అధికార పదవులలో ఉన్నవారికి ఈ రెండు రోజులు చాలా టెన్షన్ కలిగిస్తాయి.ఇది రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు.ఉద్యోగులకూ అధికారులకూ ఏ రంగంలోనైనా ప్రముఖులకూ కూడా ఇది తప్పదు.

వ్యక్తిగత జీవితాలలో -- ప్రమాదాలు,మోసపోవడాలు,వంచనకు గురికావడం, కొందరికైతే యాక్సిడెంట్ లో ప్రాణాలే పోవడం జరుగుతుంది.

ఫిబ్రవరి 25
మహిళల మీద దాడులు జరుగుతాయి.కొందరు ప్రముఖ స్త్రీలకు ఆరోగ్యం బాగుండక ఆస్పత్రి దర్శనం కలుగుతుంది.పెట్రోల్ తదితర ద్రవపదార్ధాలకు చెందిన అగ్నిప్రమాదాలూ,జలయాన ప్రమాదాలూ,వాహన ప్రమాదాలూ జరుగుతాయి.

ఈ ఫలితాలు ఒక్క మన దేశానికే కాదు.భూమి మొత్తానికీ వర్తిస్తాయి అని గుర్తించాలి.