నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, డిసెంబర్ 2014, గురువారం

గురువుగారి వక్రస్థితి - ఫలితాలు

డిసెంబర్ 9 నుంచి గురువు గారి వక్రస్థితి మొదలైంది.ఈ స్థితి  2015 ఏప్రిల్ 8 వరకూ నాలుగు నెలలపాటు ఉంటుంది.

ఈ నాలుగునెలల క్రమంలో గురువుగారు ప్రస్తుతం ఉన్న ఆశ్లేషా నక్షత్రం 4 పాదంనుంచి క్రమంగా వెనక్కు వెళుతూ ఒకటోపాదం వరకూ సంచరిస్తాడు.ఆ తర్వాత ఋజుగతిలోకి ప్రవేశించి మళ్ళీ ఆశ్లేషానక్షత్రం మొత్తాన్నీ దాటుతాడు.

ఈ ప్రతి మార్పూ మనుషుల జీవితాలలో మార్పులు తీసుకొస్తుంది.

చంద్రుడు లేదా గురువు ఆయా రాశులలో ఉన్నవారికి ఆయా ఫలితాలు వర్తిస్తాయి.గమనించండి.

మేషరాశి
చదువు మీద దృష్టి ఎక్కువౌతుంది.ప్రేమవ్యవహారం ముగుస్తుంది.షేర్ మార్కెట్లో నష్టాలోస్తాయి.సంతానానికి చేటుకాలం.

వృషభరాశి
వృత్తి ఉద్యోగాలలో,ఇంటి వ్యవహారాలలో పనిభారం ఎక్కువౌతుంది.

మిధునరాశి
తండ్రికి,పితృసమానులకు,తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు ఆరోగ్య భంగం.కష్టకాలం.

కర్కాటక రాశి
ఖర్చులు నష్టాలు ఎక్కువౌతాయి.మానసిక చింత పీడిస్తుంది.

సింహరాశి
భార్యకు/భర్తకు కష్టకాలం.దూరప్రాంత నివాసం.ఉన్నత స్థాయిలో వారితో విరోధం.

కన్యారాశి
అజీర్ణ బాధలు.గృహసౌఖ్యలోపం.అనుకోని ఆకస్మిక ఖర్చులు.త్రిప్పట ఉంటుంది.

తులారాశి
సంతాన విషయంలో,విద్యావిషయంలో చింత ఎక్కువౌతుంది.స్నేహితుల సాయం అందుతుంది.

వృశ్చికరాశి
ఇంటిలో సమస్యలు కలుగుతాయి.గృహసౌఖ్యం లోపిస్తుంది.తండ్రికి లేదా పితృ సమానులకు కష్ట కాలం.వృత్తిలో ఇబ్బందులు.

ధనూరాశి
కమ్యూనికేషన్ లోపాలు.చికాకులు.విద్యాభంగం.ఇంటిలోని పెద్దవారికి ఆరోగ్య సమస్యలు.

మకరరాశి
తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు కష్టకాలం.నేత్రరోగాలు.విద్యా,ధన సంబంధ విషయాలలో చికాకులు.

కుంభరాశి
అజీర్ణ,కాలేయ సంబంధ సమస్యలు.భార్య/భర్తకు కష్ట కాలం.డబ్బుకు ఇబ్బంది పడతారు.

మీనరాశి
రహస్యవిషయాలలో శ్రద్ధ పెడతారు.మతదృక్పధాలు మారుతాయి. మార్మిక,మాంత్రికవిద్యలలో సాధన చేస్తారు.గుళ్ళు గోపురాలు సందర్శిస్తారు. వాటి కొరకు ఖర్చు పెడతారు.

ఈ ఫలితాలు నేటినుంచి జనవరి 12 వరకూ కనిపిస్తాయి.