Pages - Menu

Pages

6, ఏప్రిల్ 2015, సోమవారం

Ei Raat Tomar Amaar - Hemant Kumar Mukherjee-




ఏయి రాత్ తొమార్ అమార్....ఈ రాత్రి నీదీ నాదీ...

Most romantic melody ever sung...

ఒక అత్యద్భుతమైన మధుర ప్రేమగీతాన్ని వినాలంటే ఈ బెంగాలీ భావగీతాన్ని వినండి.ఇదే రాగాన్ని ఇంతకు ముందు 'కొహరా' అనే హిందీ సినిమాలో " ఏ నయన్ దరీ దరీ' అనే గీతంలో విన్నారు.దానిని పాడింది కూడా హేమంత్ కుమారే.

ఈ బెంగాలీ పాటను హేమంత్ ముఖర్జీ ఎంతో ఫీల్ తో పాడాడు.పాట కొన్ని లైన్లే కానీ భావం ఎంతో అద్భుతంగా ఉంటుంది.దానిని ఫీల్ అయ్యే రహస్యం మనకు తెలియాలి.అప్పుడు ఎంతో రసానందాన్ని మనం ఫీల్ అవ్వచ్చు.

గతాన్నీ భవిష్యత్తునీ పూర్తిగా విస్మరించిన రెండు ఆత్మల వర్తమాన సంగమంలోని మాధుర్యాన్ని అతి తక్కువ పదాలలో ఇమిడ్చి,దానికి ఒక అత్యంత మధుర రాగాన్ని జోడించిన గీతం ఇది.

ప్రేయసీ ప్రియుల మధ్య ఉండే అనుబంధమే ధ్యానికీ దైవానికీ మధ్యన ఉంటుంది.మాధుర్యభక్తి అంటే అదే.అందుకే బెంగాల్ వైష్ణవ గీతాలైనా,బౌలులు పాడే తత్త్వాలైనా,మీరా భజనలైనా,సూఫీ ఖవ్వాలీలైనా కూడా ప్రేయసీ ప్రియుల మధ్యనున్న మధురప్రేమభావాన్నే ప్రతిబింబిస్తూ ఉంటాయి.అయితే అది అందరికీ తెలిసిన లౌకికప్రేమ కాదు.మనుషులకు తెలిసిన లౌకిక ప్రేమ అనేది నిజానికి ప్రేమ కాదు.అది స్వార్ధానికి ఇంకొక రూపం. మార్మికయోగులకు తెలిసిన ప్రేమ మాత్రమే అసలైన ప్రేమ.వారి గీతాలలో కనిపించేది అదే.అయితే అందులో లౌకికప్రేమ ఛాయలు ప్రతిబింబిస్తూ ఉంటాయి.

ఆ విషయం అలా ఉంచితే--ఇదే రాగాన్ని తెలుగులో కూడా వాడుకున్నారు.

'నవమోహిని' అనే సినిమాలో పీ.సుశీల పాడిన 'మనసే మయూరమై వయసే వయారమై' అనే పాటలో ఇదే రాగం ధ్వనిస్తుంది.కానీ ఆపాటలో మాధుర్యం లోపించింది.లిరిక్స్ లోనూ మాధుర్యం లేదు.సుశీల పాడిన తీరులోనూ మాధుర్యం లేదు.మనవాళ్ళు మంచిమంచి హిందీ/బెంగాలీ పాటల్ని ఇలాగే ఖూనీ చేశారు.డబ్బే ప్రధానం అయినప్పుడు,ఒక మంచి టేస్ట్ అనేది లేనప్పుడు మన తెలుగుపాట ఇలాగే అఘోరిస్తుంది.

స్వల్పమైన పదాలలో అనల్పమైన భావాన్ని పొదిగిన గీతం ఇది.ఈ గీతాన్ని ఊరకే కేజువల్ గా వింటే దీని టేస్ట్ అందదు.దీనిని ఒక ధ్యానస్థితిలో వినాలి. అప్పుడే ఇందులోని రసానందాన్ని మనం రుచి చూడగలుగుతాము. భావుకులు మాత్రమే రసానందాన్ని పొందగలరు.దీనిని డబ్బుతో కొనలేం.

Lyrics:--Gowri Prasanna Mazumdar
Music:--Hemant Kumar Mukhopadhyaay
Singer:--Hemant Kumar Mukhopadhyaay
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------
ఏయి రాత్ తొమార్ అమార్
ఒయీ చాంద్ తోమార్ అమార్
శుద్ధూ దొ జనేర్
ఏయి రాత్ శుధూ జి గానేర్
ఏయి ఖోన్ ఎ దూతి ప్రాణేర్
కుహూ కుజనేర్
ఏయి రాత్ తొమార్ అమార్

తుమి ఆచొ అమీ ఆచి తాయ్
అనుభొబే తొమారె జెపాయ్
తుమి ఆచొ అమీ ఆచి తాయ్
అనుభొబే తొమారె జెపాయ్
శుధూ దొ జనేర్
ఏయి రాత్ తొమార్ అమార్
ఒయీ చాంద్ తోమార్ అమార్
శుద్ధూ దొ జనేర్

తెలుగు స్వేచ్చానువాదం:--

ఈ రాత్రి నీదీ నాదీ
ఆ వెన్నెల నీదీ నాదీ
కేవలం మనిద్దరిదే...

ఈ రాత్రి ఒక మధురగానం
ఈ క్షణమే మన ప్రాణం
చెడ్డవాళ్ళు ఏమన్నా అనుకోనీ
మనకనవసరం
ఈ రాత్రి మాత్రం మనదే...

నువ్వు ఈ క్షణంలోనే ఉన్నావు
నేనూ ఈ క్షణంలోనే ఉన్నాను...
నిన్ను నాలో అందుకుంటున్నాను...
నిన్ను మాత్రమే....

ఈ రాత్రి నీదీ నాదీ
ఆ వెన్నెల నీదీ నాదీ
కేవలం మనిద్దరిదే...

English Meaning

This night belongs to you and me
That moon belongs to you and me
Just ours...

This night is pure melody of two souls
that exist just in this moment
Let bad people comment as they like..
Never care them
This night is ours

You exist in this moment
I exist in this moment
In my depths I feel only you
Just you...

This night belongs to you and me
That moon belongs to you and me
Just ours...