నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

12, ఏప్రిల్ 2015, ఆదివారం

Telugu Melodies-జీవితమే ఒక ముగియని కలగా...




సి.హెచ్.ఆత్మా పాడిన - జీవన్ ఏక్ అధూరా సప్నా...పాటకు తెలుగులో నేను వ్రాసుకుని పాడిన పాట ఇది.గీత సౌలభ్యం కోసం భావాన్ని అక్కడక్కడా మార్చాను.

Song:--Jeevithame Oka...
Lyrics:--Satya Narayana Sarma
Music:--Kersi Mistry
Singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------


[జీవితమే ఒక ముగియని కలగా
మెలకువ లోనీ... మరుపేగా ]-2
సుఖ దుఖ్ఖములా చిక్కటి వలగా-2
నడపునదెపుడూ విధియేగా
జీవితమే ఒక ముగియని కలగా

ఆశయనే చిరుదీపము చేగొని

నడచితి చీకటి దారులలో
జీవితమనియెడి పరదేశములో
గమ్యము నెరుగని పయనములో
అడుగడుగునా...
అడుగడుగున-కంటక పధములలో -2
ఒంటరినై- నే - నడచితిగా
జీవితమే ఒక ముగియని కలగా...

నావారెవరో కానిది ఎవరో-2
అందరినెరిగితి నెంతయునే
నీతో నడువగ రారెవ్వరునూ-2
ఈ జగమే ఒక మాయ కదా...
విధిగా...
విధిగా నీ నొసటను వ్రాసినదేదో
కాదనినా అది జరుగునుగా

జీవితమే ఒక ముగియని కలగా
మెలకువ లోనీ మరుపేగా
సుఖదుఖ్ఖములా చిక్కటి వలగా-2
నడపునదెపుడూ విధియేగా

జీవితమే ఒక ముగియని కలగా...