నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, ఏప్రిల్ 2015, గురువారం

Telugu Melodies-Satya-Ninne talachi talachi..



ఒక మంచి రాగం నాకు నచ్చితే దానికి లిరిక్స్ వ్రాసుకోవడం నా అలవాటు.ఆ క్రమంలో అసలు పాట భావాన్ని మార్చి నాకు నచ్చినట్లుగా వ్రాస్తూ ఉంటాను.

ఈ పాట కూడా అలాంటిదే.సి హెచ్ ఆత్మా పాడిన 'కేహనే కో బహుత్ కుచ్ థా' పాట రాగానికి నేను వ్రాసి పాడిన పాట ఇది.

ప్రియురాలికోసం ఎదురుచూడటం ఈ పాటలో పైపైన కనిపించే భావం.దైవాన్ని చేరుకోవడం కోసం పడే తపన అంతర్లీన భావం.ఈరోజు మధ్యాన్నం పదే పది నిముషాలలో ఈ పాట వచ్చేసింది.వెంటనే పాడటం జరిగింది.

'ఒకరోజు నిన్ను చేరుటకై--శిలనై నిలిచానే..." అనే పాదంలో, జీవితానుభవాలనూ కష్టాలనూ రాయిలా సహిస్తూ ఒకనాటికి నీ ఒడిలోకి చేరడంకోసం ఎదురుచూస్తూ జీవయాత్ర సాగిస్తున్నాననే మాటను దైవంతో చెబుతున్నట్లు భావిస్తూ వ్రాయడం జరిగింది.

మొన్న మా పల్లెటూరికి వెళ్ళినపుడు అక్కడ చెరువుగట్టుమీద మర్రిచెట్టు కింద తీసిన ఫోటో ఇది.నా చిన్నప్పుడు ఈ చెరువుగట్టుమీదే ఈ చెట్టుకిందే చాలాసేపు ఒక్కడినే కూర్చుని ఉండేవాడిని.సరిగ్గా 39 ఏళ్ళక్రితం మొదటిసారిగా నాకు ధ్యానానుభవాలు కలిగిన చోటు ఇదే.ఈ చెట్టుక్రిందే ఇలాంటి భావాలు నాకు తరచుగా అప్పట్లో కలిగేవి.

Song:--Ninne talachi talachi
Original song:--Kehne ko bahuth kuch tha by Ch.Atma.
Lyrics and Singing:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే-2
నీ కొరకై వేచివేచి - నా నిదురే కరువాయే
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే

ఏనాటిదో ఈ హృదయమునే- నీ ముంగిట పరచానే
నీ ప్రేమకే నే బానిసనై - నీ వాకిట నిలిచానే
ఆనాటి వలపు దారులలో-- నీకై వేచానే...
నిన్నే తలచి తలచి - ఈ రేయి బరువాయే

ఉన్మాదినై నీ మోహములో - ప్రతిరేయి గడపేనే
నీ రూపమే నా ధ్యానముగా- మదిలోన తలచేనే
ఒకరోజు నిన్ను చేరుటకై-శిలనై నిలిచానే...
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే

నీ కొరకై వేచివేచి - నా నిదురే కరువాయే
నిన్నే తలచి తలచి -ఈ రేయి బరువాయే...