Pages - Menu

Pages

17, జులై 2015, శుక్రవారం

కుక్కసబ్బు కంటే ఆవుసబ్బు మేలు

మనలో చాలామంది గ్లిజరిన్ సబ్బును చాలా శుభ్రతనిచ్చే సబ్బుగా భావిస్తారు. ఒకసారి గ్లిజరిన్ సబ్బుతో స్నానానికి అలవాటు పడితే ఇంక మరే ఇతర సబ్బునూ వాడటం కష్టమే.

కానీ గ్లిజరిన్ సబ్బు అభిమానులు తెలుసుకోవలసిన విషయం ఒకటుంది.

ఈ సబ్బును యూరప్లో పెంపుడు కుక్కలకు స్నానం చేయించడానికి వాడతారు.మనుషులు దానిని వాడరు.ఎందుకంటే దానిలో అంత ఘాటైన రసాయనాలుంటాయి.అది మొద్దుచర్మం ఉన్న జంతువులకే పనికొస్తుందిగాని లైట్ స్కిన్ ఉన్న మనుషులకు పనికిరాదని వారి భావన.యూరప్ వరకూ అది జంతువుల సబ్బు.కానీ మన దేశంలో హైక్లాస్ మనుషులు వాడే సబ్బు. అలాంటి భ్రమ కల్పించడానికి యాడ్ పరిశ్రమ తనవంతు పాత్ర తను బాగా పోషిస్తుంది.

ఒక బాతింగ్ టబ్ నురగలో పడుకున్న ఒక కుర్రవయసు మోడల్ సాధ్యమైనంత ఎక్కువగా తన ఒంటిని చూపిస్తూ ఆ సబ్బుతో రుద్దుకుంటూ కెమెరా వైపు చూసి నవ్వుతుంది. ఇంకేముంది? మర్నాటినుంచి ఆ సబ్బు సేల్స్ చుక్కల్లో ఉంటాయి.

అదే యూరప్ లో వచ్చే యాడ్స్ అయితే - ఒక యజమాని తన పెంపుడు కుక్కను దానితో స్నానం చేయిస్తున్నట్లూ,ఆ తర్వాత ఆ కుక్క మిగతా కుక్కలకంటే మహా హుషారుగా పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉన్నట్లూ ఆ యాడ్ ఉంటుంది.

అంటే - విదేశీ కంపెనీల దృష్టిలో - భారతదేశంలోని మనుషులు యూరప్ లోని కుక్కలతో సమానం అన్నమాట.

అది నిజం అయినా కాకపోయినా,మన దేశ జనాభాను బట్టి మనం ప్రపంచంలోని అతి పెద్ద కన్స్యూమర్ మార్కెట్ గనుక,కుక్కసబ్బునైనా పందినూనెనైనా, లేకపోతే, సీసం ఉన్న నూడుల్స్ నైనా,ఇంకే ప్రాడక్ట్ నైనా సరే మనదేశంలో యధేచ్చగా మార్కెట్ చేసుకోవచ్చు.కావలసిందల్లా,ఒళ్ళు చూపించడానికి సిద్ధపడే ఒక మోడల్ మాత్రమే.అదొక్కటి దొరికితే మన దేశంలో ఏ ప్రాడక్ట్ అయినా సరే శరవేగంతో అమ్ముడైపోతుంది.

ఇది కుక్క సబ్బు గురించి.ఇప్పుడు ఆవు సబ్బు గురించి చూద్దాం.

మోదీగారు గుజరాత్ లో తీసుకొచ్చిన విప్లవాలలో గోరక్షణ ఒకటి.గోవునుంచి వచ్చే పంచగవ్యాలను మనం ప్రాడక్ట్స్ గా మార్చి వాడుకుంటే మనకొచ్చే ఎన్నో రోగాలనుంచి సహజమైన రక్షణ పొందవచ్చు.గోమూత్రానికి కేన్సర్ ను తగ్గించే శక్తి ఉన్నదని పరిశోధనలో తేలింది.అదే విధంగా గోమయంతో చేసిన సబ్బులు వాడితే  చర్మానికి ఎంతో మేలు చేసినవాళ్ళం అవుతాం.పాతకాలంలో పల్లెటూళ్ళలో ఇంటిలోగిళ్ళను ఆవుపేడతో అలికేవారు.అది గొప్ప క్రిమినాశనిగా పనిచేసేది.నేటి గ్రానైట్ బండలకంటే అలా అలకబడిన నేల ఎక్కువ చల్లదనాన్ని ఇచ్చేది.చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చేది.

కొంతమందికి స్నానం అంటే మహాబద్ధకం ఉంటుంది.హోమియోపతిలో ఈ లక్షణాన్ని 'సోరిక్ మయాజం' అంటాం.సల్ఫర్ ఔషధం సూచింపబడే రోగులలో ఈ లక్షణం బాగా ఉంటుంది.వారికి స్నానం అంటే బద్ధకం.అలాంటి ఒక వ్యక్తికి ఈ మధ్యన నేను గోమయంతో చేసిన సబ్బును వాడమని సలహా ఇచ్చాను.ఆ సబ్బును గోమయం+అలోవీరా+సువాసన పూల గుజ్జులతో కలిపి తయారు చేశారు.ఆ సబ్బును వాడటం మొదలు పెట్టిన రెండోరోజునుంచీ ఆ వ్యక్తి రోజుకు రెండుసార్లు స్నానం చేస్తున్నాడని వాళ్ళింట్లో వాళ్ళు చెప్పారు.గోసబ్బుతో చేసే స్నానం ఇచ్చే హాయి అలా ఉంటుంది మరి.

గోవు ఉత్పత్తులు తయారు చేసే సంస్థలు ఉత్తరభారతంలోనూ.పశ్చిమ భారతంలోనూ,ముఖ్యంగా గుజరాత్ లోనూ ఎక్కువగా ఉన్నాయి.వీటిని వాడటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి.

1.కెమికల్స్ తో కూడిన ఉత్పత్తులు వాడి ఒళ్ళు గుల్ల చేసుకునే బదులు సహజసిద్ధంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

2.విదేశీ కంపెనీల మాయలో పడి ఆ ఉత్పత్తులు కొని మోసపోకుండా రక్షించబడతాం.

3.గోవులను వధ్యశాలలకు తరలించకుండా పరోక్షంగా అడ్డుకోగలుగుతాం. తద్వారా గోవధను నివారించగలుగుతాం.

గోసబ్బు మాత్రమేగాక,గోమయంతో చేసిన అగర్బత్తీలు కూడా వాతావరణాన్ని శుభ్రం చెయ్యడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.గోమూత్రంతో చేసిన బాత్రూం క్లీనర్స్, కెమికల్ క్లీనర్స్ కంటే ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి.ఇక ఆవుపాలు ఆవునెయ్యి వాడటం వల్ల కలిగే ఉపయోగాలు నేను చెప్పవలసిన పనిలేదు.

విదేశాలు మన నెత్తిన రుద్దే కుక్కసబ్బులు వాడటం కంటే,పవిత్రమైన గోమయంతో చేసిన మన భారతదేశపు సబ్బులు వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఒక్కసారి గోసబ్బు వాడి చూస్తే మీకే ఆ తేడా ఏమిటో వెంటనే అర్ధమౌతుంది.

గోవు ఉత్పత్తులు వాడదాం.ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం.గోమాతను కాపాడుకుందాం.