Pages - Menu

Pages

1, ఆగస్టు 2015, శనివారం

అనూరాధా నక్షత్ర జాతకులకు చెడుకాలం

ప్రస్తుతం శనీశ్వరుడు వృశ్చికరాశిలో అనూరాధా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం డిసెంబర్ 2014 లో మొదలైంది. ఇది డిసెంబర్ 2015 వరకూ ఉంటుంది.

ఈ సమయంలో అనూరాధా నక్షత్రంలో పుట్టినవారి జీవితాలలో అనేక చెడు సంఘటనలు జరుగుతాయి.ముఖ్యంగా వీరికి బద్ధకం బాగా ఎక్కువ అవుతుంది.చెయ్యాలనుకున్న పనులు చెయ్యలేరు.చిన్న పనికూడా అనూహ్యంగా వాయిదా పడిపోతూ ఉంటుంది.ప్రతిపనీ జాగు అవుతుంది.

అంతేకాక,దీర్ఘరోగాలు వీరిని ఈ సమయంలో 'మేమున్నామంటూ' పలకరిస్తుంటాయి.ముఖ్యంగా ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు వీరిని విడువకుండా బాధిస్తాయి.స్త్రీలలో అయితే నెలసరి బాధలు ఎక్కువౌతాయి. ఇవి అతి స్వల్పమైన బాధలనుంచి,పునరుత్పత్తి వ్యవస్థలో ప్రమాదకరమైన మార్పుల దాకా, రకరకాలుగా ఉంటాయి.

వీరి సోదరులకు,జీవిత భాగస్వామికి కూడా ఇది కష్టకాలమే.వారికి కూడా ఎంత ప్రయత్నించినా ఏ పనులూ ముందుకు సాగవు.ఈ ఏడాది కాలంలో వీరికి ఆలస్యాలు,ఆశాభంగాలు,నిరాశా నిస్పృహలు సహజం అయిపోతాయి. ధైర్యం సన్నగిల్లుతుంది.

అనూరాధా నక్షత్ర జాతకులకు ఈ సమయంలో వృత్తిపరమైన ఇబ్బందులు కూడా ఉద్ధృతంగా ఉంటాయి.పై అధికారులతో మనస్పర్ధలు, వాగ్వాదాలు ఉంటాయి.తద్వారా వృత్తి ఉద్యోగాలలో చికాకులు, రావలసిన గుర్తింపులు రాకపోవడం, ఆశాభంగాలు మొదలైనవి ఉంటాయి.

డిసెంబర్ 2015 తర్వాతే వీరికి కొంత ఊరట కనిపిస్తుంది.అంతవరకూ ఈ సమస్యలు వీరికి తప్పవు.

ఒక నాలుగు రోజులలో వీరికి జరుగబోతున్న సంఘటనను ముందుగానే చెబుతున్నాను.

ఆగస్ట్ 4 నుంచి 8 లోపు వీరిలో కొందరికి అనారోగ్యం చేస్తుంది.కొందరికి యాక్సిడెంట్ అవుతుంది.ఇంకొందరికైతే తల్లికి గండం ఉంటుంది.ఇంకొందరికి ప్రయాణాలలో ప్రమాదం జరుగుతుంది.వీరిలో అందరికీ కామన్ గా ఈ సమయంలో ఉద్రేకం ఎక్కువౌతుంది.

గమనించి చూచుకొండి మరి.