నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, ఆగస్టు 2015, సోమవారం

మూడవ యాస్ట్రో వర్క్ షాప్ (హైదరాబాద్) కు ఆహ్వానం

గతంలో రెండు యాస్ట్రో వర్క్ షాప్స్ - ఒకటి హైదరాబాద్ లో, రెండు విజయవాడలో - జరిగాయి.జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వారికి ఆ సబ్జెక్ట్ లో ప్రాధమికమైన అంశాలు ఎలా ఉంటాయో వాటిలో నేర్పడం జరిగింది.

వాటికి కొనసాగింపుగా ఈ మూడవ వర్క్ షాప్ హైదరాబాద్ లో 30-8-2015 ఆదివారం నాడు జరుగుతుంది.మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం స్నాక్స్  అక్కడే ఏర్పాటు చెయ్యబడతాయి.

ఈ వర్క్ షాప్ లో - ఒక చార్ట్ ను నేను ఎలా ఎనలైజ్ చేస్తాను? అన్న పద్ధతి నేర్పించబడుతుంది.గత 17 ఏళ్ళుగా చేసిన జ్యోతిష్య రీసెర్చి ఫలితంగా చాలా జ్యోతిష్య సూత్రాలను నేను కనుగొన్నాను.అలా వెలుగు చూచిన సూత్రాలను విద్యార్ధులకు పరిచయం చెయ్యడం - ఒక చార్టును నేను చేసే ఎనాలిసిస్ ఎలా ఉంటుంది? దానిలోని సూత్రాలు మరియు రహస్య అంశాలేమిటి? అసలు ఒక మనిషి యొక్క జాతకాన్ని ఎలా విశ్లేషణ చెయ్యాలి? దానిలోని కీలకాంశాలను ఎలా అర్ధం చేసుకోవాలి? ఒక మనిషి జాతకంలో భూత భవిష్యత్ వర్తమానాలనూ వాటిలోని సంఘటనలనూ ఎలా తెలుసుకోవాలి? అన్న విషయాలు ఉదాహరణ చార్టులతో సహా వివరంగా నేర్పించబడతాయి.

మొదటి రెండు వర్క్ షాపులకు వచ్చినవారు వాటిల్లో నేర్పబడిన ప్రాధమిక అంశాలను ఈ పాటికి బాగా ఆకళింపు చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను.ఈ వర్క్ షాప్ లో మళ్ళీ ప్రాధమిక అంశాలను చర్చించను.ఇది కొంచం హై లెవల్ క్లాస్ గనుక,టెక్నికల్ పదాలు వాడుతూ సరాసరి విశ్లేషణాభాగం లోకి వెళతాను గనుక, మళ్ళీ ఒక్కసారి బేసిక్స్ అన్నీ బాగా చదువుకుని రావలసిందిగా ఇంతకు ముందు అటెండ్ అయిన వారిని కోరుతున్నాను.అప్పుడే నేను సరాసరి చేస్తున్న చార్ట్ ఎనాలిసిస్ ను మీరు చక్కగా అర్ధం చేసుకుని ఫాలో అవ్వగలుగుతారు.

ఈ వర్క్ షాప్ కు రావాలనుకునే వారు 25-8-2015 లోపల పంచవటి ట్రస్ట్ P.R.O రాజూ సైకంతో మాట్లాడి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. వెన్యూ వివరాలు తెలుసుకోవచ్చు.స్పాట్ రిజిస్ట్రేషన్లు అనుమతించబడవు.

Contact Details:
Raju Sykam, M.A (Astrology)
Cell:- 9966007557
E-mail:- www.raju@gmail.com