నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఆగస్టు 2015, శుక్రవారం

Jo Baat Tujh Me hai - Mohammad Rafi




యూట్యూబ్ లో ఈ గీతాన్ని ఇక్కడ చూడండి.
https://youtu.be/9daGnwj9Ot4


జో బాత్ తుజ్ మే హై తెరీ తస్వీర్ మే నహీ...

మహమ్మద్ రఫీ గంధర్వస్వరం లోనుంచి సుతారంగా జాలువారిన మధురగీతాలలో ఇదొక మరపురాని మధుర గీతం.

1963 లో రిలీజైన 'తాజ్ మహల్' అనే సినిమాలోది ఈ గీతం.

ఈ కరావోకే గీతాన్ని విని ఇది రఫీ పాడిన అసలు పాటేమో అని భ్రమపడకండి.
:)

దీనిని అక్షరాలా నేనే పాడాను.

ఈ మధ్య కళాపోషణ అంటూ ఏమీ లేకుండా వేదాంతం ఎక్కువైందని,ఆ వేదాన్తోపన్యాసాలు వింటుంటే నీరసం వస్తున్నదనీ,మహిళా అభిమానులు కొందరు బాగా గొడవ చేస్తుంటే ఈ పాటను పాడి పోస్ట్ చెయ్యవలసి వచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే 1961 లో రిలీజైన 'జగదేకవీరుని కధ' సినిమాలో 'రారా కనరారా కరుణ మానినారా ప్రియతమలారా' అంటూ ఘంటసాల మాస్టారు పాడిన పాటకూడా ఇదే రాగంలో ఉంటుంది.దానికి పెండ్యాల నాగేశ్వర రావు సంగీతం సమకూర్చారు.

అంటే - మన తెలుగుబాణీలు కూడా కొన్ని హిందీలోకి కాపీ కొట్టబడినయ్యన్న మాట.

Movie:--Taj Mahal (1963)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Roshan
Singer:--Mohammad.Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------------------------
Jo baat tujhme hai, teree (tasvir me nahee -2)

Rango me tera aks dhala, too na dhal sakee
saanso kee aanch jism kee khushbu na dhal sakee
tujhme - tujhme jo loch hai, meree (taharir me nahee -2)
jo baat tujhme hai, (teree tasvir me nahee-2)

Bejaan husn me kaha, raftar kee ada
inkaar kee ada hai, na ikrar kee ada
koyee - koyee lachak bhee julfe (giraahgir me nahee -2)
jo baat tujhme hai, (teree tasvir me nahee-2)

Duniya me koyee cheej nahee hai teree tarah
phir ek baar saamne aaja kisee tarah kya aur - kya aur ek jhalak meree (takdir me nahee -2)

Jo baat tujhme hai, teree (tasvir me nahee -2)
Jo baat tujhme hai

Meaning:--

The real spark that is in you
is somehow missing in your painting

The colors in the painting
have captured your shadow
not the real you

Your warm breath and your body fragrance
the painting could not capture at all.
The real beauty that is there in you
my brush strokes could not capture it
in the painting clearly

The real spark that is in you
is somehow missing in your painting

Where is your lovely grace in this painting?
It can neither invite me nor can refuse me
Nor is there the liveliness 
in the curls of your enticing hair
in the painting

The real spark that is in you
is somehow missing in your painting

There is nothing lovely in this whole world
that is comparable to your beauty
Just for once, appear in front of me somehow
What? Am I not destined to have atleast
one more glimpse of your beauty?
Tell me am I not? 

The real spark that is in you
is somehow missing in your painting
The real spark that is in you...


తెలుగు స్వేచ్చానువాదం

నీలో ఉన్న జీవం ఏదో
నీ చిత్తరువులో లోపించింది

ఈ రంగులు నీ ప్రతిబింబాన్ని చిత్రించగలిగాయి
కానీ నిన్ను కాదు
నీ వెచ్చని ఊపిరి
నీ ఒంటి సువాసన
నీ చిత్తరువులో లేవు
నీలో మెరిసే సౌందర్యాన్ని
నా కుంచె పట్టుకోలేకపోయింది

నీలోని సుకుమారమైన జీవకళ
ఈ చిత్తరువులో రాలేదేమి?
ఈ బొమ్మ నన్ను రమ్మని ఆహ్వానించనూ లేదు
పొమ్మని ముద్దుగా తిరస్కరించనూ లేదు
ఇదెందుకు?
ఆహ్వానించే నీ ఉంగరాల ముంగురులలో ఉన్న 
చిలిపిదనం,జీవం
ఈ చిత్తరువులో లేవు

ఈ ప్రపంచంలో ఏదీ నీ సౌందర్యంతో సాటి రాదు
ఒక్కసారి నా ఎదురుగా ప్రత్యక్షం కావూ?
ఇంకొక్క సారి నిన్ను చూచే అదృష్టం 
నా తలవ్రాతలో లేదా?
నిజం చెప్పు

నీలో ఉన్న జీవం ఏదో
నీ చిత్తరువులో లోపించింది
నీలో ఉన్న జీవం ఏదో...