Pages - Menu

Pages

26, ఆగస్టు 2015, బుధవారం

Telugu Melodies-Satya-మరీ మరీ మనసే...




మరీ మరీ మనసే - మరువలేక నీ సొగసే
పదే పదే తలచే - వదలలేక నీ తలపే
మరీ మరీ మనసే...

నిన్న ఒక మహిళా అభిమాని ఇలా అడిగారు.

'మీరు ప్రస్తుతం చిక్కటి వేదాంతంలో ఉన్నారు కదా.ఈ సమయంలో మంచి ప్రేమగీతం వ్రాసి పాడగలిగితే మీ టాలెంట్ ని ఒప్పుకుంటా. లేకుంటే లేదు.'

ఇలా చెప్పాను.

'నా టాలెంట్ నీకు మళ్ళీమళ్ళీ ప్రూవ్ చెయ్యవలసిన అవసరం లేదు.కానీ నీ చాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నాను.పదేపది నిముషాలలో నీవడిగిన ప్రేమగీతం వ్రాస్తాను.'

మనకిష్టమైన మంచి ఘజల్స్ లోనుంచి ఆలోచిస్తే జగ్జీత్ సింగ్ పాడిన 'జుకీజుకీ సి నజర్ బెకరార్ హై కె నహీ' అనే పాట గుర్తొచ్చింది. 

కొద్దిసేపు మనస్సును ఏకాగ్రం చేశాను. తెలుగుపాట వచ్చేసింది.

వినండి మరి.

Lyrics:--Satya Narayana Sarma
Singer:--Satya Narayana Sarma
Original Track:--Jagjith Singh's Ghazal -'Jhuki Jhuki Si Nazar'
------------------------------

మరీ మరీ మనసే మరువలేక నీ సొగసే
పదే పదే తలచే వదలలేక నీ తలపే
మరీ మరీ మనసే మరువలేక నీ సొగసే
పదే పదే తలచే...

మనోజ్ఞ సీమలలో మరపురాని మోహములే-2
జ్వలించు వెన్నెలలై చెంత చేరగా పిలిచే
మరీ మరీ మనసే మరువలేక నీ సొగసే
పదే పదే తలచే

జగాలనే మరచి కరగినట్టి కాలములే-2
నిశీధ రాత్రులలో నిన్ను చేరగా పిలిచే
మరీ మరీ మనసే మరువలేక నీ సొగసే
పదే పదే తలచే

హిమాల లోగిలిలో విడువలేని కౌగిలిలో-2
వియోగమే మరచి నిలిచి పోవగా పిలిచే
మరీ మరీ మనసే మరువలేక నీ సొగసే
పదే పదే తలచే వదలలేక నీ తలపే
మరీ మరీ మనసే మరువలేక నీ సొగసే
పదే పదే తలచే...