నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, సెప్టెంబర్ 2015, బుధవారం

Chalo Pee Le Ke Yaar Aaye Na Aaye - Pankaj Udas




నా కత్యంత ఇష్టమైన ఘజల్స్ లో ఒక ఘజల్ ఇప్పుడు వినండి.

Album:--Rubayee
Singer:--Pankaj Udhas
Karaoke Singer:--Satya Narayana Sarma

Enjoy
-------------------------------

Khothe naho jo hosh - unhe ghar bulaake pee-2
Ya phir buto ko saamne - apne bithaake pee
Behad na pee -na bol bahut - josh me naa aa
Ruk ruk ke pee - sukun se pee - sar jhuka ke pee

Daulat hai fakat -chaar dino kee pee le
Ijjat hai fakat -chaar dino kee pee le
Hai wakt - shabo roj - tabaahee kee taraf
Mohlat hai fakat chaar dino kee pee le

Chalo pee le - ke yaar aaye na aaye-2
Yeh mausam - baar baar aaye na aaye
Chalo pee le - ke yaar aaye na aaye

Gulaabo kee tarah tum - taaja rahana-3
Jamaane me - bahaar aaye na aaye-2
Yeh mausam - baar baar aaye na aaye
Chalo pee le - ke yaar aaye na aaye

Yeh socha hai ke usko bhul jaaye-3
Abb iss dil ko karaar aaye naa aaye-2
Yeh mausam - baar baar aaye na aaye
Chalo pee le - ke yaar aaye na aaye

Jameer is jindgee se kyun khafa ho-3
Ise phir tumpe pyaar aaye na aaye-2
Yeh mausam - baar baar aaye na aaye
Chalo pee le - ke yaar aaye na aaye-2

Meaning:-

If some one has not lost his senses
and still remains half drunk
call him to your home and drink with him

Or if some one is totally sane and conscious
make him to sit with you and drink,

Dont drink too much
Dont talk much
Dont chatter...
Drink slowly
Drink peacefully
Bend your head and drink...

Money and riches last - just for four days
So, have a drink.
Good name and fame last - just for four days
So,have a drink.
Time, as day and night,is fast heading towards destruction (death)
This vacation (of life) lasts - just for four days
So,have a drink.

Let a friend accompany you or not
Go have a drink
This season may come again or not
Go have a drink
May your friend accompany or not
Go have a drink

Like the roses you be happy and fresh always
may the Spring arrive or not
This season may come again or not
Go have a drink
May your friend accompany or not
Go have a drink

I decided to forget this world
may my heart have a support or not
This season may come again or not
Go have a drink
May your friend accompany or not
Go have a drink

Why my conscience is so angry with this world?
It is because,In it's infatuation
I may not love you at all;
This season may come again or not
Go and drink
May your friend accompany or not
Go have a drink...
Go have a drink...

ఇది పంకజ్ ఉదాస్ పాడిన 'రుబాయీ' అనే ఆల్బం లోని పాట.ఇది నాకత్యంత ఇష్టమైన ఘజల్స్ లో మొట్టమొదటిది.ఇంతకంటే మంచి తాంత్రికగీతం నాకింతవరకూ కనిపించలేదు.

నాకు ఉమర్ ఖయ్యాం తత్త్వం అంటే బాగా ఇష్టం అని మీకందరికీ తెలుసు. అందుకే ఈ ఘజల్ నా లిస్టులో మొదటి వరుసలో మొదటి స్థానంలో కూచుని ఉంటుంది.నా ఆలోచనా విధానాన్ని,నా మనస్తత్వాన్నీ, నా టేస్ట్ నీ ఈ గీతం అతి స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

ఇందులో మొదటి రెండు పద్యాలు ఆలాపనగా వస్తాయి.అవి ఉమర్ ఖయ్యాం పార్శీలో వ్రాసిన రుబాయత్ లోని పద్యాలు.వాటికి అధ్బుతమైన రాగాన్ని అమర్చి పాడాడు పంకజ్.

చూడటానికి ఇది త్రాగుబోతు పాటలా అనిపిస్తుంది.కానీ అలా అనుకుని దీనిని తేలికభావంతో తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.ఇది అసలైన మార్మిక ఆధ్యాత్మిక గీతం.ఒక గంటసేపు గాఢమైన ధ్యానం చేసినప్పటి కంటే, ఈ పాట ఒక్కసారి పాడితే చాలు నాకు విపరీతమైన మత్తు వచ్చేస్తుంది. అంత మంచి పాట ఇది.

దీనిని త్రాగుబోతు పాట అని తెలియనివాళ్ళు అనుకోవడం కూడా ఒక రకంగా నిజమే.నిజమైన ఆధ్యాత్మికులందరూ ఒకరకమైన త్రాగుబోతులే. ఎందుకంటే - లోకానికి అందని అతీతమైన మత్తులో వాళ్ళు ఎప్పుడూ మైమరచి ఉంటారు గనుక. ఆ మత్తేమిటో దానిని రుచి చూచిన వారికే అర్ధమౌతుంది. ఇతరులకు అది అర్ధం కాదు.ఖేచరీ ముద్రలో అమృతపానం చేసినవారికి కలిగే మత్తు ఇది.

ఉమర్ ఖయ్యాం యొక్క ఈ అద్భుత గీతాన్ని పంకజ్ ఉదాస్ ఎంత అద్భుతంగా పాడాడో చెప్పలేము. ఈ గీతాన్ని ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తుంది. ఒక అతీతమైన ఆధ్యాత్మిక భావాన్ని అలవోకగా సరళమైన పదాలలో ఇమిడ్చి చెప్పిన ఎంతో గొప్ప మార్మికగీతం ఇది.

This is my most favorite Ghazal.

తెలుగు స్వేచ్చానువాదం


ఎవరికైనా ఇంకా మత్తు పూర్తిగా ఎక్కకపోతే
వారిని నీ ఇంటికి పిలిచి మరీ త్రాగించు.
నువ్వూ వారితో కలసి త్రాగు

ఎవరైనా అసలు త్రాగకుండా పూర్తి తెలివిలో ఉంటే
వారిని నీ పక్కనే ప్రేమగా కూర్చుండబెట్టుకుని త్రాగించు
నువ్వూ వారితో కలసి త్రాగు.

కానీ, మరీ ఎక్కువగా త్రాగకు
ఎక్కువగా మాట్లాడకు
అనవసర ప్రేలాపన అసలే వద్దు
మెల్లిగా త్రాగు
శాంతంగా త్రాగు
తల వంచుకుని త్రాగు

ధనమూ విలాసాలూ ఎన్నాళ్ళుంటాయి?
నాలుగు రోజులు తప్ప?
కనుక మధువును సేవించు

పరువూ మర్యాదా ఎన్నాళ్ళుంటాయి?
నాలుగు రోజులు తప్ప?
కనుక మధువును సేవించు

ప్రతి రోజూ సమయం నీ కళ్ళెదురుగానే
మరణం వైపు అతివేగంగా పరిగెత్తుతున్నది
జీవితమనే ఈ సెలవలు కొన్నాళ్ళే !
కనుక మధువును సేవించు

నీ స్నేహితులు నీతో కలసి రానీ రాకపోనీ
నువ్వు మాత్రం మధువును సేవించు
ఈ మధుమాసం మళ్ళీ వస్తుందో రాదో?
పద ! మధువును సేవించు

వసంతం నీకెదురు కానీ రాకపోనీ
గులాబీలాగా నువ్వు స్వచ్చంగా నిష్కల్మషంగా ఉండు
ఈ మధుమాసం మళ్ళీ వస్తుందో రాదో?
పద ! మధువును సేవించు
నీ స్నేహితులు నీతో కలసి రానీ రాకపోనీ
నువ్వు మాత్రం మధువును సేవించు

నీ హృదయానికి ఒక ఆసరా ఉండనీ ఉండకపోనీ
ఈ ప్రపంచాన్ని మాత్రం వదిలెయ్
ఈ మధుమాసం మళ్ళీ వస్తుందో రాదో?
పద ! మధువును సేవించు

నీ స్నేహితులు నీతో కలసి రానీ రాకపోనీ
పద !మధువును సేవించు

ఎందుకు నా మనసుకి ఈ ప్రపంచం మీద ఇంత కోపం?
ఎందుకంటే --దీని మాయలో పడి నిన్ను మరచిపోతానేమో అని
ఈ మధుమాసం మళ్ళీ వస్తుందో రాదో?
పద ! మధువును సేవించు
నీ స్నేహితులు నీతో కలసి రానీ రాకపోనీ
పద ! నువ్వు మాత్రం మధువును సేవించు

Spiritual Commentary

ఖోటే న హో జో హోష్ ఉన్హే ఘర్ బులాకే పీ
యా ఫిర్ బుటోం కో సామ్నే అప్నే బిఠాకే పీ
బేహద్ న పీ - న బోల్ బహుత్ - జోష్ మె న ఆ
రుక్ రుక్ కె పీ - సుకూన్ సె పీ - సర్ ఝుకాకే పీ

కొందరు సాధకులుంటారు.వారు సాధనామార్గంలో కొద్దిదూరం నడచి ఉంటారు.కానీ అక్కడే ఆగిపోయి ఉంటారు.ముందుకు దారి తెలియక తటపటాయిస్తూ ఉంటారు.దారి చూపేవారు ఈ సమాజంలో ఎక్కడా వారికి కనపడరు.దొంగ గురువుల చేతిలో వారు మోసపోయి ఉంటారు.అలాంటి వారిని నీ ఇంటికి పిలిచి వారికి సరియైన దారిని చూపించు.వారికి నిజమైన సాధన ఏమిటో నేర్పించు. వారితో కలసి సాధన చెయ్యి.

కానీ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయేంతగా నీ సాధనలో మునుగకు.నీ రహస్యాలను ఎక్కువగా అందరికీ బయటపెట్టకు.ఎక్కువగా మాట్లాడకు. ఒకేసారి సాధనలో లోతుగా వెళ్ళకు.నిదానంగా కొద్ది కొద్దిగా పురోగమించు. శాంతంగా దైవభూమికలో మునుగు.ఎంత తెలిసినా తెలియనివాడిలాగా
వినయంతో ఉండు. తలవంచుకుని మరీ నీ సాధన చెయ్యి.

తలవంచుకుని సాధన చెయ్యమన్న మాటలో 'జాలంధర బంధం' అనే తాంత్రికముద్ర సూచితం అవుతున్నది.మధువును త్రాగడం అంటే - ఖేచరీ ముద్రను పట్టినప్పుడు పినియల్ మరియు పిట్యూటరీ గ్రంధులనుంచి గొంతులోకి జారే ఒక విధమైన ద్రవాన్ని (అమృతాన్ని) మ్రింగడం అని అసలైన అర్ధం.దీనినే యోగపరిభాషలొ 'సోమరసం' అంటారు.దీనిని త్రాగినవాడే సోమయాజి అనబడతాడు.


దౌలత్ హై ఫకత్-చార్ దినోం కీ-పీలే
ఇజ్జత్ హై ఫకత్-చార్ దినోం కీ - పీలే
హై వక్త్ - షబో రోజ్ - తబాహీ కీ తరఫ్
మొహలత్ హై ఫకత్ - చార్ దినోం కీ - పీలే

డబ్బూ హోదా ఎన్నాళ్ళుంటాయి? నాలుగు రోజులే.ఎప్పటికైనా నీ సాధన ఒక్కటే నీతో ఉంటుంది.ఈ విషయం మర్చిపోకు.జనుల మెప్పులూ, పొగడ్తలూ,పరువు మర్యాదలూ ఎన్నాళ్ళుంటాయి?నాలుగు రోజులే.  ఎప్పటికైనా నీ సాధన ఒక్కటే నీతో ఉంటుంది. మర్చిపోకు.

ప్రతిరోజూ నీ ఆయుష్షు తరిగిపోతున్నది.బాగా గమనించు.ఈ మురిపెం నాలుగు రోజులే.బాగా అర్ధం చేసుకో.నీ సాధనే ఎప్పటికైనా నీ తోడు

చలో పీలే కె యార్ ఆయే న ఆయే
యే మౌసం బార్ బార్ ఆయే న ఆయే
చలో పీలే కె యార్ ఆయే న ఆయే

నీతో ఎవరు నడచినా నడవకపోయినా నీ సాధన మాత్రం నీవు చెయ్యి.నీ దారిలో నీవు నడువు.ఒకరి కోసం నీవు ఆగకు.ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో సందేహమే.కనుక వాళ్ళతో పెట్టుకుని ఈ జన్మను వృధా చేసుకోకు.


గులాబోం కీ తర్హా తుమ్ తాజా రెహనా
జమానే మె బహార్ ఆయే న ఆయే
యే మౌసం బార్ బార్ ఆయే న ఆయే
చలో పీలే కె యార్ ఆయే న ఆయే

కాలం కలసి వచ్చినా రాకపోయినా పట్టించుకోకు.నీ జీవితంలో వసంతం వచ్చినా రాకున్నా లెక్కించకు.నీ సాధనను మాత్రం ఉల్లాసంగా కొనసాగించు. ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో?నీ సాధనను పట్టుదలగా చెయ్యి.

ఎ సోచా హై కె ఉస్కో భూల్ జాయే
అబ్ ఇస్ దిల్ కో కరార్ ఆయే న ఆయే
యే మౌసం బార్ బార్ ఆయే న ఆయే
చలో పీలే కె యార్ ఆయే న ఆయే

నువ్వు 'నావి' అనుకుంటున్నవి ఏవీ నీవి కావు.అదంతా నీ పిచ్చి భ్రమ.నీ హృదయాన్ని ఏనాటికీ ఈ ప్రపంచానికి అర్పించకు. నీ హృదయానికి ఏ విధమైన ఆసరా లేకపోయినా ఏమీ చింతించకు.నీ తోడుగా ఎవరూ రాకపోయినా ఏమీ బాధపడకు.నీ దారిలో ఒంటరిగా నడువు.ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో?నీ సాధనను మాత్రం పట్టుదలగా చెయ్యి.

జమీర్ ఇస్ జిందగీ సె క్యో ఖఫా హై
ఇసే ఫిర్ తుంపే ప్యార్ ఆయే న ఆయే
యే మౌసం బార్ బార్ ఆయే న ఆయే
చలో పీలే కె యార్ ఆయే న ఆయే

ఈ ప్రపంచం అంటే నాకెందుకు కోపం? కోపం ఏమీ లేదు. కాకపోతే - దీని మాయలో పడి నిన్ను మరచిపోతానేమో అని జాగ్రత్త - అంతే. ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో? నీ సాధనను పట్టుదలగా చెయ్యి. నీతో ఎవరు నడచినా నడవకపోయినా నీ సాధన మాత్రం నీవు చెయ్యి. నీ దారిలో నీవు నడువు.ఒకరికోసం నీవు ఎన్నటికీ ఆగకు.

ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ వస్తుందో రాదో సందేహమే. కనుక ఈ జన్మను అనవసరంగా వృధా చేసుకోకు. సాధనలో మునుగు.

ప్రతిరోజూ మధుపానం చెయ్యి.