Pages - Menu

Pages

10, అక్టోబర్ 2015, శనివారం

Geet Gaata Chal-Ravindra Jain



Youtube link
https://youtu.be/wy_5DvgxJ5g

గీత్ గాతా చల్ ఓ సాథీ గుంగునాతా చల్....

అంటూ  జస్పాల్ సింగ్ ఉచ్చస్వరంలో ధ్వనించిన ఈ గీతం 1975 నాటిది.దీనిని రచించినదీ, సంగీత దర్శకత్వం వహించినదీ మధుర సంగీత దర్శకుడు రవీంద్రజైన్. ఆయన నిన్న మరణించాడు.ఈ అమావాస్య నీడ ఆయన జీవన గమనాన్ని పరిసమాప్తం చేసింది.

రవీంద్ర జైన్ స్మృత్యంజలిగా ఈ పాటను పాడుతున్నాను.

రవీంద్ర జైన్ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది.ఈయన ఎక్కువగా క్లాసికల్ బేస్ ఉన్న పాటలే చేశాడు.కానీ,అవసరమైన సమయంలో వాటికి స్పీడ్ బీట్ ఎలా కలపాలో ఈయనకు బాగా తెలుసు.

ఈయన పుట్టుగ్రుడ్డివాడు. అయినా సరే పట్టుదలతో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి మంచి సంగీతజ్ఞునిగా ఎదిగాడు.తన మొదటి సినిమాలోనే మహమ్మద్ రఫీ అంతటి వాడికే సంగీత దర్శకత్వం వహించిన ఘనుడు.

ఒక్క "చిత్ చోర్"  సినిమా చాలు.ఈయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి.అందులోని పాటలన్నీ హిట్ సాంగ్సే. వాటిని వ్రాసినదీ సంగీతం ఇచ్చినదీ ఆయనే.కవీ సంగీతజ్ఞుడూ ఇద్దరూ ఒక్కరిలోనే ఉంటె ఆవ్యక్తికి ఒక సౌలభ్యం ఉంటుంది.ఆ రాగానికీ, దాని మూడ్ కీ సరిపోయే పదాలను వారే పేర్చుకుని పాటను వ్రాసుకోగలుగుతారు.రవీంద్రజైన్ అటువంటి ఘనుడు.అందుకే 1976 లో వచ్చిన "చిత్ చోర్" సినిమా పాటలను ఈనాటికీ పాడుకునే సంగీతాభిమానులు లక్షల్లో ఉన్నారు.

ప్రముఖ గాయకుడు జేసుదాస్ ను హిందీ చిత్రరంగానికి పరిచయం చేసింది ఈయనే.జేసుదాస్ గళం అంటే ఈయనకు ఎంతిష్టం అంటే -- తనను చూపంటూ వస్తే, మొదటగా జేసుదాస్ ముఖాన్నే చూస్తానని ఆయన అనేవాడు.జేసుదాస్ ను ఆయన 'వాయిస్ ఆఫ్ ఇండియా' అని పిలిచేవాడు.

నిజమైన సంగీత కళాకారులు ఎవ్వరూ మరణం తర్వాత అధోగతులకు పోరు. ఎందుకంటే వారికి సరస్వతీ కటాక్షం ఉంటుంది గనుక. ఈ విషయాన్ని 'తారాస్తోత్రం' లో ఒకచోట చూచాయగా ప్రస్తావించి ఉన్నాను.అమ్మ పలుకులైన సప్తస్వరాలే ఏడు బీజాక్షరాలై, ఏడు వెన్నెలమెట్లుగా రూపుదాల్చి వారిని ఉత్తమగతులకు చేరుస్తాయి.

అయినా సరే మన తృప్తి కోసం ఈ పాటను ఆయన ఆత్మశాంతికి నీరాజనంగా అర్పిస్తున్నాను.

Movie:--Geet Gaata Chal (1975)
Lyrics:--Ravindra Jain
Music:--Ravindra Jain
Singer:--Jaspal Singh
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-------------------------------------------
Geet gata chal o sathee gungunata chal, o bandhu re
Hanste hansate bite har ghadee har pal,
chorus - Geet gata chal o sathee gungunata chal,
Ho Saathi
chorus - Geet gata chal o sathee gungunata chal,

Khula khula gagan yeh haree bharee dhartee
Jitna bhee dekho tabiyat nahee bharatee
chorus oo oo oo
HO Sunder se sunder har ek rachna
Phul kahen kanton me bhee seekho hansna,
Chorus -- Oh Sathi seekho hasnaa..
O rahee re....
Kumhala naa jaye kahee man teraa komal,
Chorus -- Oh Sathi seekho hasnaa..
O Saathi- chorus
Chorus -- Oh Sathi seekho hasnaa..

Chandee sa chamakta yeh nadiya kaa panee
Panee kee har ek bund detee jindaganee
Ambar se barse jamin se mile
Neer ke bina toh bhaiya kam naa chalea,
Chorus - O bhayya kaam na chale
O Megha re.....
Jal jo naa hota toh yeh jag jata jal,
chorus - Git gata chal o sathee gungunata chal,
Ho Sathi
chorus - Geet gata chal o sathee gungunata chal,

Kahan se tu aaya aur kahan tujhe jana hai
Khush hai wahee jo iss bat se begana hai
Chorus Oo Oo O
Ho..
Chal chal chalatee hawayen karen shor
Udte pakheru kheenche manva kee dor,
o panchhee re....
Panchhiyon ke pankh le ke ho ja tu ojhal,
Chorus - geet gata chal.....

Meaning:--

Move along you way my friend
singing all the while
humming all the while
O my dear friend
Smile and let others smile
every moment of your life

Such an open sky stretching to infinity
Such an earth filled with greenery all along
Howsoever you may watch
you will never be satisfied fully
In God's creation everything is so beautiful
The flowers say to you
learn to smile in the midst of thorns
Let your mind which is too sensitive
Not become dull and sorrowful
Move along you way my friend
singing all the while

This water sparkles white like the moon light
Its every drop gives us life and delight
It rains from the sky above
and reaches the weary Earth down below
Without water,nothing moves in this world
O clouds O my friends
Without your water this whole world burns like hell
Move along you way my friend
singing all the while

Where from do you come into this world?
and where do you go, my friend,finally?
Atleast be happy that you dont own this world
The moving breeze makes strange sounds
The flying birds catch our attention
O bird O my friend
Unfurl your wings and disappear in the sky

Move along you way my friend
singing all the while
humming all the while
O my dear friend
Smile and let others smile
every moment of your life

తెలుగు స్వేచ్చానువాదం

కళ్ళు లేని రవీంద్ర జైన్ - ప్రకృతిని ఇంతగా వర్ణించాడంటే అతనెంత కళాపిపాసో అతనిదెంత కళాత్మక హృదయమో తేలికగా అర్ధం చేసుకోవచ్చు. కళ్ళున్న మనం చూడలేని మన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళులేని అతను భావస్ఫోరకంగా ఫీలౌతూ వర్ణించడం ఎంత వింత? అయినా కూడా మనం ఆ కోణంలో ప్రకృతిని చూడలేకపోవడం ఎంత దౌర్భాగ్యం?

భగవంతుని లీల అంటే ఇదేనేమో?
----------------------------
ఓ మిత్రమా...పాట పాడుకుంటూ నీ దారిలో సాగిపో
నవ్వుతూ సాటివారిని నవ్విస్తూ నీ జీవితాన్ని గడుపు
ఓ మిత్రమా...పాట పాడుకుంటూ నీ దారిలో సాగిపో

అనంతమైన వినీలాకాశం
ఎటుచూచినా పచ్చని భూమి
ఎంత చూచినా తనివితీరని సౌందర్యం
దైవసృష్టి ఎంత అద్భుతమైనది?
ముళ్ళు చుట్టూ ఉన్నా నవ్వచ్చని పూలు చెబుతున్నాయి
ఓ యాత్రికుడా
నీ కోమలమైన మనస్సును క్రుంగిపోనివ్వకు
ఆనందంగా నీయాత్రను సాగించు

ఈ నదీజలం చూడు వెన్నెలలా ఎలా మెరుస్తోందో?
ఈ నీటి ప్రతి బిందువూ మనిషికి జీవితాన్ని ఇస్తుంది
ఆకాశంలో పుట్టి నేలకు దిగివస్తుంది ఈ నీరు
ఓ మేఘాల్లారా
మీరిచ్చే ఈ నీరు లేకుంటే మా జీవితమే లేదు

ఎక్కడనుంచి వచ్చావు? ఎక్కడకు పోతావు?
ఇదంతా నీది కాదు సంతోషించు
వీచే గాలి చేసే శబ్దాలను విను
ఎగిరే పక్షులను చూచి ఆనందించు
ఓ విహంగమా
నీ రెక్కలు విప్పుకో
అనంతాకాశంలో మాయమై పో

ఓ మిత్రమా...పాట పాడుకుంటూ నీ దారిలో సాగిపో
నవ్వుతూ సాటివారిని నవ్విస్తూ నీ జీవితాన్ని గడుపు
ఓ మిత్రమా...పాట పాడుకుంటూ నీ దారిలో సాగిపో