నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, నవంబర్ 2015, మంగళవారం

Do Naina Matware Tihare Ham Par Zulm Kare - K.L.Saigal












Youtube link
https://youtu.be/QSUmIknk8zQ

దో నైనా మత్ వారే తిహారే హమ్ పర్ జుల్మ్ కరే...
అంటూ కుందన్ లాల్ సైగల్ గంభీర మధుర స్వరంనుంచి జాలువారిన ఈ గీతం 1944 సంవత్సరం నాటిది.ఈ పాట పుట్టి ఇప్పటికి 71 సంవత్సరాలు గడిచాయి.కానీ ఈనాటికీ ఇది ఆపాత మదురగీతమే.

కే.ఎల్.సైగల్ అంటేనే చాలామంది 'అబ్బా' అంటూ తల పట్టుకుంటారు.కానీ హిందూస్తానీ రాగాలలోని మాధుర్యం తెలిసినవారు ఆయన పాటలను అమితంగా అభిమానిస్తారు.ఈయనది చాలా బేస్ వాయిస్.చాలా మంద్రస్థాయిలో కూడా ఈయన పాడగలడు.ఈయన పాటలు పాడాలంటే చాలా కష్టం.ఈయన స్టైల్ ను తరువాత తరంలో Ch.Atma అనుకరించాడు.మన తెలుగులో వీరిద్దరినీ అనుకరించినవాడు M.S.Rama Rao.ఈయన గళం వీరిద్దరినీ పోలి ఉంటుంది.

ఈపాటలో కుందన్ లాల్ సైగల్,సుమిత్రాదేవి నటించారు.సైగల్ తన పాటలను తనే పాడుకునేవాడు.మహాగాయకుడైనప్పటికీ త్రాగుడుకు అలవాటు పడి చనిపోయాడు.ఈయన పాడిన పాటలన్నీ ఆణిముత్యాలే

ఈయన హిందీలో ఉత్త 110 సినిమా పాటలు మాత్రమే పాడాడు.కానీ నేటికీ సినీ సంగీత ప్రపంచంలో ధ్రువతారగా నిలిచి ఉన్నాడు. 70 ఏళ్ళు గడచినా కూడా ఈ పాటల మాధుర్యం ఏమాత్రమూ తగ్గలేదు.నేటి గాయకులు వేలాది పాటలు పాడుతున్నారు.కానీ వాటిల్లో ఒక్క పాటకూడా మర్నాటికి నిలబడడం లేదు.ఎవరికీ గుర్తుండటం లేదు.

ఈయన సంగీతాన్ని నేర్చుకోలేదు.కానీ హిందూస్తానీ రాగాలను అలవోకగా ఆలపించేవాడు.ఈయన స్వరంలోని మాధుర్యం ఆ తర్వాత గాని నేటి గాయకులలో గాని ఎవరికీ లేదు.చాలామంది ఈయన పాటలను పాత చింతకాయ పచ్చడి అనుకుంటారు.కానీ ఆ చింతకాయ పచ్చడి రుచి తెలిస్తే నేటి వంటకాలు ఏవీ వారికి నచ్చవు.పాపం వారికా రుచి తెలియదనే నేను భావిస్తాను.

వినండి మరి.

Movie :--Meri Bahen (1944)
Lyrics:-Pandit Bhushan
Music:-Pankaj Mallick
Singer :-- K.L.Saigal
Karaoke Singer :-- Satya Narayana Sarma
Enjoy
--------------------------------------
Do naina matware tihare
hum par zulm kare-2
Do naina matware tihare
hum par zulm kare-2

Naino me rahe tho - sudh budh khoye - 2
Chupe tho
Chupe tho Chain hare
Do naina matware tihare
hum par zulm kare-2

Tan tan ke chalaye teer
Nas nas me
Nas nas me uthaye peer
Tan tan ke chalaye teer
Nas nas me uthaye peer
Madh Bhare Rasile Nithar bade
Na dare na dheer dhare
Do naina matware tihare
hum par zulm kare

Jab hoti ho
Jab hoti ho tum us paar
Man kee
Man kee bina ke baj uththe hai jor jor se taar
Man kee
Man kee bina ke baj uththe hai jor jor se taar
Paas aye

Paas aye tho aise bhula gaye
Pal Khyn mein
Pal Khyn me sab kuch bhula gaye
Khushiyon ke sote ubal pade
Har ang me rang bhare
Do naina matware tihare
hum par zulm kare
Do naina matware tihare
hum par zulm kare

తెలుగు స్వేచ్చానువాదం
రెండు అందమైన మత్తుకళ్ళు
నన్ను వెంటాడుతున్నాయి
వాటివైపు చూస్తే నామతి పోతున్నది
పోనీ చూపు మళ్ళిస్తే మనశ్శాంతి కరువౌతున్నది
ఆ కళ్ళు తనువంతా బాణాలు గుచ్చుతున్నాయి
నరనరాల్లో ఆనందాన్ని పరుగెత్తిస్తున్నాయి
భయం లేకుండా,అలుపులేకుండా
మధురసంతో నన్ను నింపుతున్నాయి

నువ్వు ఎదురుగా ఉంటే చాలు
నా మానసవీణ
పై స్థాయిలో రాగాలాపన చేస్తోంది
ఇక నువ్వు దగ్గరగా వస్తే చాలు
ఒక్క క్షణంలో అన్నింటినీ మర్చిపోతున్నాను
ఈ మధురమైన మత్తులో మునిగి
నా శరీరం అంతా వింతకాంతితో మెరుస్తోంది
రెండు అందమైన మత్తుకళ్ళు
నన్ను వెంటాడుతున్నాయి
రెండు అందమైన మత్తుకళ్ళు...