Pages - Menu

Pages

12, నవంబర్ 2015, గురువారం

Prevention is better than cure - నాటిక


పోయిన్నెలలో Vigilance Awareness Week కార్యక్రమం జరిగింది.దానిలో భాగంగా గుంటూరు డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో ఒక నాటికను అప్పటికప్పుడు వ్రాసి ప్రాక్టీస్ చేసి ప్రదర్శించాము.
దానిపేరే Prevention is better than cure.

ఎప్పుడు ఏ డ్రామా వెయ్యాలన్నా రెడీగా మాకొక టీం ఉంది.మా నాటికను అప్పటికప్పుడు మేమే వ్రాసుకుని ప్రదర్శిస్తూ ఉంటాము.అలా ఇప్పటికి ఒక నాలుగైదు డ్రామాలు వ్రాశాము. వేశాము. అన్నీ సక్సెస్ అవుతున్నాయి.

ప్రస్తుత నాటిక ప్రధానాంశం - ఉద్యోగులలో అవినీతి నిర్మూలన.


ఈ డ్రామా ఇతివృత్తం ఏమంటే - ఒక ఆఫీసులో అవినీతిపరులైన ఉద్యోగులు కొందరుంటారు.కొన్ని పోస్టులకు సెలక్షన్ జరుగుతుంది. అందులో అవినీతి జరుగుతున్నదని పసిగట్టి విజిలెన్స్ నుంచి ఒక ఇన్ఫార్మర్ ను బ్రోకర్ గా అక్కడ ప్రవేశపెడతారు.అతను వ్యవహారం మొత్తాన్నీ పెన్ కెమెరాలో బంధిస్తాడు.చివరలో అందరూ కలసి అవినీతి డబ్బు పంచుకుంటుంటే CBI ఆఫీసర్ వచ్చి వారిని అరెస్ట్ చేసి ఒక సందేశాన్ని వినిపిస్తాడు.ఇదీ కధ.

ఈ డ్రామాలో నేను సీబీఐ ఆఫీసర్ గా నటించాను.నా మెసేజి తోనే డ్రామా అయిపోతుంది.ఈ డైలాగ్ కొంచం పెద్దది.ఏకబిగిన దానిని చెప్పాలి.దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

నా డైలాగ్స్ ని పైన ఇచ్చిన ఆడియో ఫైల్ లో వినండి.