Pages - Menu

Pages

15, నవంబర్ 2015, ఆదివారం

Tum Agar Saath Dene Ka Vaada Karo - Mahendra Kapoor



Youtube Link
https://youtu.be/p7pBVGaXK_k

తుమ్ అగర్ సాత్ దేనే కా వాదా కరో
మై యుహీ మస్త్ నగుమే లుటాతా రహూ
తుమ్ ముజే దేఖ్ కర్ ముస్కురాతీ రహో
మై తుమే దేఖ్ కర్ గీత్ గాతా రహూ

అని మహేంద్ర కపూర్ తన మధుర స్వరంతో ఆలపించిన ఈ మధురగీతం 1967 లో వచ్చిన "హమ్ రాజ్" అనే చిత్రం లోనిది.ఈ సినిమా ఒక మ్యూజికల్ హిట్ మూవీ.ఇందులోని గీతాలన్నీ ఆపాతమధురాలే.ఎందుకంటే వీటికి సాహిత్యాన్నీ సంగీతాన్నీ సమకూర్చినవారూ పాడినవారూ కూడా ఉద్దండులు.అందుకే ఈనాటికీ ఈ పాటలు మన నోళ్ళలో ఇంకా నానుతున్నాయి.వినేవారికి కూడా ఆనందాన్నిస్తున్నాయి.

చాలా సున్నితమైన ప్రేమభావాన్ని అంతకంటే సున్నితమైన మధురరాగంలో ఎంతో భావుకతతో వ్యక్తీకరించే గీతం ఇది. 

నా గళంలో కూడా ఈ పాటను మరొక్కసారి వినండి మరి.

Movie :-- Hamraaz (1967)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Ravi Shankar Sharma (Ravi)
Singer:--Mahendra Kapoor
Karaoke Singer :--Satya Narayana Sarma
Enjoy
----------------------------------------------
Tum agar saath dene ka vaada karo
Mein yunhi mast nagme lutata rahoon
Tum mujhe dekh kar muskuraati raho
Mein tume dekh kar geet gaata rahoon

Kitne jalve fizaavon me bikhare magar
Meine abtak kisee ko pukaara nahee
Tumko dekha tho nazre ye kehne lagee
Hamko chehre se hatna gavaara nahee
Tum agar meri nazron se aage raho
Mein har ek shai se nazre churata rahoon
Tum agar saath dene ka vaada karo
Mein yunhi mast nagme lutata rahoon

Maine khvabon me barso taraasa jise
Tum vohee sange marmarke tasveer ho
Tum na samajho tumhara muqaddar hu mein
Mein samajhtaahu tum meri taqdeer ho
Tum agar mujhko apna samajhne lago
Mein baharon ki mehfil sajaata rahoon
Tum agar saath dene ka vaada karo
Mein yunhi mast nagme lutata rahoon

Mein akela bahut der chaltaa rahaa
Ab safar zindgaani ka kathtaa nahee
Jab talak koi rangeen sahara na ho
Vaqt kaafir javaani ka kathtaa nahin
Tum agar hum qadam banke chalti raho
Mein zamee par sitare bichata rahoon
Tum agar saath dene ka vaada karo
Mein yunhi mast nagme lutata rahoon
Tum mujhe dekh kar muskuraati raho
Mein tume dekh kar geet gaata rahoon

Meaning:--

If you promise to be with me
I will keep singing soft melodies for you
If you look at me and keep smiling
I will keep looking at you and sing for you

Many beautiful temptations came my way
I have never been attracted to any
As soon as I took one look at you
I was not able to take my eyes off you
You remain in front of me always
I will keep glancing at your beauty

The image that I had cherished in my dreams
You are that same image come alive
You may not accept that I am you destiny
But I believe you are mine
If you think of me as your own
I will decorate you with flowers of poetry

I have been walking on this path
all alone for quite a long time
But now I can't live this lonely life anymore
If one does not have a beautiful partner
The time of youth becomes unbearable
If you walk along with me in my path
I will throw a carpet of stars under your feet

If you promise to be with me
I will keep singing soft melodies for you
If you look at me and keep smiling
I will keep looking at you and sing for you

తెలుగు స్వేచ్చానువాదం

నువ్వు నాతో ఉంటానని మాటిస్తే
నీకోసం మధుర గీతాలు ఆలపిస్తాను
నువ్వు నావైపు నవ్వుతూ చూస్తూ ఉండు
నేను నిన్ను చూస్తూ పాటలు పాడుతూ ఉంటాను

ఎన్నో అందాలు నా ఎదుట మెరిశాయి
కానీ నేను వేటికీ లొంగలేదు
నిన్ను చూచిన క్షణం నుంచీ
'మేము ఇక్కడ నుంచి కదలము'
అని నా చూపులు అంటున్నాయి
నువ్వు నా ఎదుటనే ఎప్పుడూ ఉండు
నేను నీవైపు దొంగచూపులు చూస్తూ ఉంటాను

నేను నా కలల్లో ఎవరిని ఊహించానో
ఆ రూపమే నువ్వై నా ఎదురుగా నిలిచింది
నేను నీ గమ్యాన్ని కాకపోవచ్చు
కానీ నువ్వే నా గమ్యమని నేను తలుస్తాను
నన్ను నీవాడిగా నువ్వు భావిస్తే
నిన్ను నా కవితా సుమాలతో అలంకరిస్తాను

నేనెంతో కాలంనుంచీ ఒంటరిగా పయనిస్తున్నాను
కానీ ఇప్పుడీ పయనం నాకు రుచించడం లేదు
ఎప్పటిదాకానైతే ఒక అందమైన సహచరి దొరకదో
అంతవరకూ యవ్వనం అంతా వృధా అవుతుంది
నువ్వు నాతో అడుగు కలిపితే
నీ పాదాలక్రింద నక్షత్రాలను పరుస్తాను

నువ్వు నాతో ఉంటానని మాటిస్తే
నీకోసం మధుర గీతాలు ఆలపిస్తాను
నువ్వు నావైపు నవ్వుతూ చూస్తూ ఉండు
నేను నిన్ను చూస్తూ పాటలు పాడుతూ ఉంటాను