Pages - Menu

Pages

2, డిసెంబర్ 2015, బుధవారం

Jab Jaag Uthe Armaan - Hemanth Kumar


జబ్ జాగ్ ఉఠే అర్మాన్ తో కైసే నీంద్ ఆయే....

సంగీతపరంగా చూచినా సాహిత్య పరంగా చూచినా అన్నీ చక్కగా అమరిన పాటలు ఎక్కడో కొన్నే ఉంటాయి.చాలా పాటలలో ఇటు సంగీతమో అటు సాహిత్యమో ఏదో ఒకటి దెబ్బ తింటుంది.అలా కాకుండా రెండూ చక్కగా కుదిరి ఆ రెంటికీ నటీనటుల చక్కని నటన తోడైతే ఆ పాట అద్భుతంగా ఉంటుంది.ఈ పాట అలాంటిదే.

Youtube link

https://youtu.be/G2XGMacDjYw


ఇందులో బిశ్వజిత్ కన్నార్పకుండా ఆశా వైపు చూస్తూ ధ్యాననిమగ్నుడైన యోగిలా నిలబడి ఉంటాడు.వెళ్లి నిద్రపొమ్మని ఆశా సైగ చేస్తుంది.తనకు నిద్ర రావడం లేదని చెబుతూ ఎందుకు రావడం లేదో పాటరూపంలో వివరిస్తాడు. ఎక్కడా అసభ్యత లేకుండా ఎంతో చక్కగా చిత్రీకరించిన పాట ఇది.ఈ పాటలో బిశ్వజిత్ హావభావ ప్రకటన చాలా చక్కగా ఉంది.

ఆ విధంగా నాకు చాలాచాలా ఇష్టమైన కొన్ని పాటల్లో ఈ పాట ఒకటి.

ఈ పాటను హేమంత్ కుమార్ పాడిన తీరు అనితరసాధ్యం అనే చెప్పాలి. ముఖ్యంగా 'నీందాయే' అనే పదాన్ని అతి సుతారంగా పలికిన తీరు ఎంతో గొప్పగా ఉంటుంది.ఈ రాగం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు పాడినా మధురంగానే ఉంటుంది.ముఖ్యంగా ఈ పాటలో వయోలిన్ ని వాడుకున్న తీరు ఎంతో అద్భుతం.ఆ బిట్స్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనే అనిపిస్తాయి.

ట్రాక్ లో రాత్రి ఎఫెక్ట్ తీసుకురావడానికి చరణాలలో చిరతల ధ్వనిని ఎంతో చక్కగా వాడుకున్నారు.ఈ ధ్వని వింటుంటే ఒక ప్రశాంతమైన రాత్రిలో ఉన్నట్లే అనిపిస్తుంది.అసలు పాటలో ఈ ధ్వని లేకున్నా ట్రాక్ లో దానిని తీసుకురావడం చాలా సందర్భోచితంగా ఉంది.

హేమంత్ కుమార్ గానానికి తోడుగా బిశ్వజిత్ చటర్జీ నటన అద్భుతంగా ఉంటుంది ఈ పాటలో.ఇక ఆశాపరేఖ్ సంగతి చెప్పనక్కర్లేదు.

ఈ పాటను ఇంతకు ముందు కూడా పాడాను.కానీ దానికంటే ఇది 'బెటర్ వెర్షన్' గనుక మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.

Movie:--Bin Badal Barsaat (1963)
Lyrics:--Shakeel Badayuni
Music:--Hemanth Kumar
Singer:--Hemanth Kumar
Karaoke singer:--Satya Narayana Sarma

Enjoy
--------------------------------------------------------

{Jab jaag uthe armaan  tho kaise neend aaye}-2
ho- ghar me hasee mehmaan  to kaise neend aaye
neend aaye
jab jaag uthe armaan  to kaise neend aaye


{Ye raat ye dil kee dhadkan  ye badhtee huyee betaabee
ek jaam ke khaatir jaise, bechain ho koi sharaabee}-2
sholon me giree ho jaan  to kaise neend aaye
jab jaag uthe armaan  to kaise neend aaye

{Najdeek bahot hain manjil- phir bhee hai gajab kee dooree
ye dil ye too hi batlaa de, ye kaunsi hai majbooree}-2
jab soch me ho insaan  tho kaise neend aaye

Ho ghar me haseen mehmaan  tho kaise neend aaye
neend aaye

Jab jaag uthe armaan  to kaise neend aaye

Meaning:--

When desire wakes up in mind,how can sleep arrive?
When your love smiles in the house,how can sleep arrive?

This night,these heartbeats
This growing impatience
Is like a drunkard getting restless for a goblet of wine
When the soul falls in flames,how can sleep arrive?
When desire wakes up in mind,how can sleep arrive?

The resting place is very nearby
but the distance is really great
O my heart,tell me,what is the constraint?
When one is drowned in thoughts how can sleep arrive?

When your love smiles in the house,how can sleep arrive?
When desire wakes up in mind,how can sleep arrive?

తెలుగు స్వేచ్చానువాదం

మనసులో కోరిక నిద్రలేచినప్పుడు
మనిషికి నిద్రెలా వస్తుంది?
ప్రేయసి తన ఇంటిలో ఎదురుగా ఉన్నప్పుడు
మనిషికి నిద్రెలా వస్తుంది?

ఈ రాత్రి
ఈ గుండె చప్పుళ్ళు
ఈ పెరుగుతున్న విరహం
పానపాత్ర కోసం ఒక త్రాగుబోతు
పడుతున్న అవస్థలా ఉంది నా బాధ
ప్రాణం మంటల్లో పడినప్పుడు నిద్రెలా వస్తుంది?
మనసులో కోరిక నిద్రలేచినప్పుడు
మనిషికి నిద్రెలా వస్తుంది?

గమ్యం చాలా దగ్గరగా ఉంది
కానీ దూరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది
ఓ హృదయమా ! ఈ అవస్థ ఏమిటో నువ్వే వివరించు
మనిషి ఆలోచనల్లో మునిగినప్పుడు నిద్రెలా వస్తుంది?

మనసులో కోరిక నిద్రలేచినప్పుడు
మనిషికి నిద్రెలా వస్తుంది?
ప్రేయసి తన ఇంటిలో ఎదురుగా ఉన్నప్పుడు
మనిషికి నిద్రెలా వస్తుంది?