నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, జూన్ 2016, గురువారం

మా అమెరికా యాత్ర -19 (Gym Photos)

డెట్రాయిట్ ఆబర్న్ హిల్స్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో ఒక జిమ్నాసియం ఉన్నది. నాకు చిన్నప్పటి నుంచీ వ్యాయామం అంటే పిచ్చి గనుక, అక్కడకు వెళ్ళిన రెండో రోజే ముందు ఆ జిమ్ కు వెళ్ళి అక్కడ ఎక్విప్ మెంట్ అంతా చూచి వ్యాయామం చేసి రావడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్ళు రోజూ అక్కడకు వెళ్లి వ్యాయామం చేస్తూ ఉండేవాళ్ళం.

అయితే - జిమ్ అనేది నాకు ముఖ్యం కాదు.ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ చేసేవారికి జిమ్ అవసరం లేదు. జిమ్ లో చేసే వ్యాయామాలలో కొన్ని మాత్రమే మార్షల్ ఆర్ట్స్ లో అవసరం అవుతాయి. జిమ్ బాడీ వేరు.మార్షల్ ఆర్ట్స్ బాడీ వేరు. జిమ్ వ్యాయామాలు వేరు.మార్షల్ ఆర్ట్స్ వ్యాయామాలు వేరు.వీరికీ వారికీ బాడీ షేప్ చాలా తేడాగా ఉంటుంది.ఆర్జాల్ద్ శ్వాజ్ నెగ్గర్ కూ, జాకీ చాన్ కూ ఉన్న తేడా వీరిద్దరికీ ఉంటుంది. జిమ్ చేసే వారిలో బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు.వాళ్ళ బాడీ చాలా రిజిడ్ గా తయారౌతుంది.వంగదు.కానీ మార్షల్ ఆర్టిస్ట్ కు ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం.

జిమ్ కూ మార్షల్ ఆర్ట్ కూ ఉన్న ఇంకొక భేదం ఏమంటే - జిమ్ లో మజిల్ స్త్రెంగ్థ్ మాత్రమే వస్తుంది.మార్షల్ ఆర్ట్స్ లో దానితో బాటు ఇంటర్నల్ స్త్రెంగ్థ్ కూడా వస్తుంది. ఈ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ అనేది బాడీ బిల్డర్స్ లో ఉండదు.దానికి ప్రత్యేకమైన అభ్యాసాలు మార్షల్ ఆర్ట్ లో ఉంటాయి.ఇవి యోగా కి దగ్గరగా ఉంటాయి.

మార్షల్ ఆర్ట్స్ చేసేవారికి జిమ్ అవసరం పెద్దగా ఉండదు.గ్రౌండ్ ఎక్సర్ సైజులే వారికి సరిపోతాయి.కొన్ని కొన్ని వెయిట్స్ తో చేసే వ్యాయామాలు,బాడీ కండిషనింగ్ వ్యాయామాలు,మొదలైన వాటికోసం ఆయా పరికరాలను మనమే తయారు చేసుకుంటాము.వాటితోనే వ్యాయామాలు చేస్తాము.

అమెరికాలో సరదాగా కొన్నాళ్ళు జిమ్ కు వెళ్ళడం జరిగింది.కానీ జిమ్ లో కూడా,దానికంటే  ఎక్కువగా మన మార్షల్ ఆర్టే ఈ ఫోటోలలో కనపడుతుంది.

జిమ్ లో చేసే వ్యాయామాలు కొన్ని నాకు తెలియవు.అందుకని అవి ఎలా చెయ్యాలో మా అబ్బాయి మాధవ్ నాకు దగ్గరుండి నేర్పించాడు.చిన్నప్పుడు నేను తనకు నేర్పిస్తే ఇప్పుడు తనే నాకు నేర్పించాడు. భలే అనిపించింది !!

ఆ ఫోటోలు ఇక్కడ చూడండి.

Swiming pool in Gym

Striking a Tai Chi pose
Tai Chi Pose

Taichi Pose

Taichi Punch

Taichi Pose

Shadowless Kick of Wing chun Kung Fu

Kung Fu Punch















Shadow less kick (side view)

A posture from 10 routine spring leg Kung Fu