నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

10, జూన్ 2016, శుక్రవారం

మా అమెరికా యాత్ర -20 (Tai Chi Practice)

నాకు అనేక మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్నది.కరాటే లోని రకరకాలైన స్టైల్స్, జూడో, అయికిడో, కుంగ్ ఫూ లోని రకరకాల స్టైల్స్,తాయ్ ఛీ, ఇవిగాక మర్మవిద్య కూడా నాకు తెలుసు.

ఇప్పటికీ - ఎక్కడున్నా సరే, వారానికి కనీసం మూడుసార్లు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ వదలకుండా చేస్తూ ఉంటాను. అలాగే, అమెరికాలో ఉన్నపుడు కూడా చేసాను.

ఆబర్న్ హిల్స్ లో ఉన్న పార్కులో, అక్కడకు కొంచం దూరంగా ఉన్న ఇంకొక పార్కులో, గాంగెస్ ఆశ్రమం బయట పచ్చికలో - ఇలా ఎక్కడ వీలైతే అక్కడ నేను కుంగ్ ఫూ,  తాయ్ ఛీ ప్రాక్టీస్ చేశాను.నా శిష్యురాళ్ళకు కూడా నేర్పించాను.

వీరిలో పద్మజగారు మాత్రం -  అమెరికాలో ఉన్న ఒక చైనీస్ లేడీ తాయ్ ఛీ మాస్టర్ క్లాసులో చేరి యాంగ్ స్టైల్ తాయ్ ఛీ నేర్చుకున్నారు. కనుక ఆమె సొంతంగా కూడా తాయ్ ఛీ ఫాం చెయ్యగలిగారు. మా అబ్బాయి మాధవ్ కు ఇండియాలో ఉన్నపుడు నేను నేర్పించాను.తను నాతో బాటు డాబా మీద ఫాం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. గాంగేస్ ఆశ్రమంలో ఉన్నప్పుడు పద్మజగారు చేస్తూ ఉంటే, పాత ప్రాక్టీస్ గుర్తు తెచ్చుకుంటూ తనుకూడా సులభంగా చేశాడు.

తాయ్ ఛీ అనేది ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్. దీనిని meditation in motion లేదా moving meditation అని కూడా అంటారు.దీనివల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి.నా శిష్యులకు యోగాతో బాటు నాకు వచ్చిన వాటిల్లో కనీసం ఒక మార్షల్ ఆర్ట్ అయినా రావాలని నేను కోరుకుంటాను.వారికి అందులో శిక్షణ కూడా ఇస్తాను.అది నా విధానం.

ఈ అభ్యాసాల వల్ల మంచి ఆరోగ్యంతో బాటు, ఆత్మరక్షణా విధానాలు కూడా అలవాటు అవుతాయి.ఈరోజులలో ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం.

ఆ ప్రాక్టీసుల సందర్భంగా తీసిన ఫోటోలు ఇక్కడ చూడవచ్చు.