నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, నవంబర్ 2016, బుధవారం

నవంబర్ 2016 - అమావాస్య ప్రభావం

Mundane Astrology వైపు దృష్టి సారించి చాలా రోజులైంది.ఒక్కసారి అటువైపు తొంగి చూద్దాం. ఆఫ్కోర్స్ ! మనం చూచినా చూడకున్నా, గ్రహాలు వాటిపని అవి చేస్తూనే ఉంటాయి. అమావాస్యకూ పౌర్ణమికీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి.కర్మచక్రం నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంది. ఈ అమావాస్య ఘడియలలో ఒక విమానం కూలింది. ఒక ఉగ్రవాద దాడి జరిగింది. అదికూడా సరాసరి సైనిక స్థావరం పైనే. అదీగాక ఈరోజున బెంగాల్లోని సుఖ్నా అనేచోట చీటా హెలీకాప్టర్...
read more " నవంబర్ 2016 - అమావాస్య ప్రభావం "

27, నవంబర్ 2016, ఆదివారం

Din Dhal Jaye Hai Raat Na Jaay - Mohammad Rafi

Din Dhal Jaye Hai Raat Na Jaay అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం దేవానంద్ నిర్మించి నటించిన క్లాసిక్ హిట్ "గైడ్" సినిమాలోది.ఈ సినిమా 1965 లో వచ్చింది. శైలేంద్ర సాహిత్యమూ, సచిన్ దేవ్ బర్మన్ సంగీతమూ, రఫీ గాత్రమూ, దేవానంద్ నటనా కలసి ఈ పాటను ఎన్నటికీ మరపురాని ఒక మధుర గీతంగా మలిచాయి. అందుకే 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విన్నా కూడా ఈ పాట ఎంతో అద్భుతమైన ఫీల్ ను ఇస్తుంది. ఈ పాట...
read more " Din Dhal Jaye Hai Raat Na Jaay - Mohammad Rafi "

26, నవంబర్ 2016, శనివారం

స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను )

ఈ విధంగా చాలా సేపు మాట్లాడుతూ కూచున్నాము. ఇంతలో భోజనాల వేళ అయింది.అదేరాత్రి పదింటికి చెన్నై బస్సులో స్వామీజీ బయలుదేరి వెళ్ళాలి. అందుకని పెందలాడే భోజనం కానిచ్చాము. 'నాకు గోరువెచ్చని నీళ్ళు ఇవ్వండి.చల్లనీళ్ళు నేను త్రాగను.నాకు కొంచం జలుబు చేసే తత్త్వం ఉంది.' అన్నారు స్వామీజీ. 'అలాగే. నేనూ అంతే. చలికాలం గోరువెచ్చని నీరే నేనూ త్రాగుతాను.' అన్నాను. 'మీరు వంటల్లో వెల్లుల్లి వాడతారా?'...
read more " స్వామి యదునాధానందతో సంభాషణ -8 (శ్రీ రామకృష్ణులు దైవం యొక్క అవతారమా? నేనొప్పుకోను ) "

25, నవంబర్ 2016, శుక్రవారం

Ye Mousam Rangin Sama - Mukesh, Suman Kalyanpur

Ye Mousam Rangeen Samaa... అంటూ ముకేశ్, సుమన్ కళ్యాణ్ పూర్ పాడిన ఈ పాట 1961 లో వఛ్చిన Modern Girl అనే సినిమాలోది. మధుర సంగీత దర్శకుడు రవి శంకర్ శర్మ(రవి) ఈ గీతానికి చాలా మధురమైన రాగాన్ని సమకూర్చాడు. ఈ పాటలో ప్రదీప్ కుమార్, సాయిదా ఖాన్ నటించారు. నా చిన్నప్పుడు "రేడియో" యుగంలో 'వివిధ భారతి' లో ప్రతిరాత్రి పది గంటలకు 'ఛాయాగీత్' అని ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉండేది. దాంట్లో అన్నీ పాత పాటలే వినిపించేవారు....
read more " Ye Mousam Rangin Sama - Mukesh, Suman Kalyanpur "

24, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి)

స్వామీజీ చెప్పసాగారు. "ఒక్క జపమే చాలు.దానితోనే సర్వమూ సాధించవచ్చు" అని శ్రీమాత అనేవారు. అమ్మ చెప్పిన తదుపరి ఏ విషయంలో నైనా సరే ఇక మారుమాట ఏముంటుంది? కానీ ఈ మాటను సరిగా అర్ధం చేసుకోవాలి. ఏ సాధనా చెయ్యకుండా జపం ఒక్కటే చేసేవారికి జపమే చాలు.అనుక్షణమూ లోపల్లోపల 'అజపాజపం' చేసేవారికి అదొక్కటే చాలు.దానినుంచే అన్నీ వస్తాయి. కానీ రోజంతా కర్మలలో మునిగి ఉండేవారికి ఒక అరగంటో గంటో చేసే ఉత్తుత్తి జపం ఏ మాత్రమూ సరిపోదు.వారు...
read more " స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 7 (శ్రేష్ఠభక్తి) "

17, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 6 (నేనే వాళ్ళ స్థానాల్లో ఉంటే?)

స్వామీజీ చెప్పినది నాకేమీ నచ్చలేదు. ఇంతకుముందు చెన్నైలో చెప్పినప్పుడూ నచ్చలేదు, ఇప్పుడూ నచ్చలేదు. ఆయనంటే నాకు జాలి కలిగింది. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పి ఆయన భావాలని మార్చాలని నేననుకోలేదు. ఊరకే ఆయన చెబుతున్నది విని ఊరుకున్నాను. తన సలహాతో చంద్రపాల్ జీవితాన్ని స్వామీజీ పూర్తిగా నాశనం చేశాడని నా ఊహ. వినడానికి వింతగా ఉంది కదూ?? అలాగే ఉంటాయి నా భావాలు. చిన్నప్పటినుంచీ నన్ను చూస్తున్నవారికే నేను అర్ధమై చావలేదు. ఏదో నా వ్రాతలు...
read more " స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 6 (నేనే వాళ్ళ స్థానాల్లో ఉంటే?) "