Pages - Menu

Pages

30, జనవరి 2017, సోమవారం

'USA Panchawati' website ఈరోజు ప్రారంభం అయింది

గత ముప్పై ఏళ్ళుగా యోగ - వేదాంత - తంత్ర సాధనామార్గంలో నడచిన నేను ప్రత్యక్షంగా దర్శించిన సత్యాలను అనుభవాలను గుదిగుచ్చి నాదంటూ విభిన్నమైన సాధనా విధానాన్ని ఒకదాన్ని తయారు చేశాను. నా ఈ మార్గం నచ్చి దానిలో నడవాలని ఆరాటపడుతున్న వాళ్ళంతా కలసి "పంచవటి" అని ఒక ఫౌండేషన్ ప్రారంభించాం.ఈ దారిలో నడుస్తూ నన్ననుసరిస్తున్న వారు ఇండియాలోనూ అమెరికాలోనూ చాలామంది ఉన్నారు.

మా "పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్" కు రెండు వెబ్ సైట్స్ ఉన్నాయి. ఇండియా ఫౌండేషన్ కు ఒకటి. అమెరికా ఫౌండేషన్ కు ఒకటి. ఇండియా వెబ్ సైట్ చాలా కాలం నుంచీ ఉంది.నా ఇండియా శిష్యులు ఈ మధ్యనే దీనికి కొత్తగా మార్పులు చేర్పులు చేసి కొంగ్రొత్త రూపాన్నిచ్చారు.వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు.

మేమేం తక్కువ తిన్నామా అంటూ నా అమెరికా శిష్యులు శిష్యురాళ్ళు  కలసి USA Foundation Web Site ను చాలా కష్టపడి తయారు చేశారు. అది ఈరోజు ప్రారంభం చెయ్యబడింది. దీని వెనుక ఎంతో ప్లానింగ్, ఎంతో శ్రమా దాగి ఉన్నాయి.సైట్ డిజైన్, ఫీచర్స్ అన్నీ  చాలా బాగున్నాయి. ఈ పాజెక్ట్ లో పాలు పంచుకున్న USA Team Members అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మొదట్లో ఒకే వెబ్ సైట్ ఉంటె బాగుంటుందని అనుకున్నాం. కానీ ఇండియా పౌండేషన్ కార్యక్రమాలు వేరు. అమెరికా ఫౌండేషన్ కార్యక్రమాలు వేరు, రెండింటి కార్యవర్గ సభ్యులు వేర్వేరు గనుక ప్రస్తుతానికి రెండు సైట్స్ గా ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు మేం చేస్తున్న కార్యక్రమాలు ఆయా సైట్స్ లో ఆడియో వీడియోలుగా ఫోటోలుగా ఉంచబడతాయి.

USA web site ను చూడటం కోసం ఇక్కడ నొక్కండి.

24, జనవరి 2017, మంగళవారం

శనీశ్వరుని రాశి మార్పు - ధనూరాశి ప్రవేశం - ఫలితాలు

26-1-2017 గురువారం నాడు, పూర్వాషాఢ నక్షత్ర పరిధిలో మధ్యాన్నం 2 గంటల 07 నిముషాలకు శనీశ్వరుడు రెండున్నరేళ్ళుగా తానుంటున్న వృశ్చికరాశిని వదలిపెట్టి ధనూరాశిలోకి ప్రవేశించ బోతున్నాడు. ఈ రాశిమార్పు ఎందరి జీవితాలలోనో పెనుమార్పులు తీసుకు రాబోతున్నది. ఈరోజు మన రిపబ్లిక్ డే కూడా.

ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మనిషి జీవితం మీద గ్రహప్రభావం ఉండటం నిజమే. దీనివల్ల మనిషి జీవితంలో అనేక మార్పులు చేర్పులు కలగడమూ నిజమే.

జ్యోతిశ్శాస్త్రంలో శనీశ్వరుని కర్మకారకునిగా భావిస్తారు. అంటే - సామాన్యంగా మనిషి చేసే రోజువారీ కర్మ గాని, అతను బ్రతకడం కోసం చేసే వృత్తి గాని ఈయన ఆధీనంలోనే ఉంటుంది. శనీశ్వరుని ప్రభావానికి గురికాని వ్యక్తి  ఈ భూమిమీద ఎవడూ ఉండడు.రాజులైనా బంటులైనా ఆయన చెప్పినట్లు వినవలసిన వారే.

జాతకంలో శనీశ్వరుని స్థితిని బట్టి ఆ జాతకుని వృత్తిలోని ఎగుడు దిగుళ్ళను తేలికగా గ్రహించవచ్చు. ప్రస్తుతం 26 తేదీన జరుగబోతున్న ఈ గోచారం, ద్వాదశ రాశులను ఎలా ప్రభావితం చేస్తుందో స్థూలంగా చూద్దాం.

నక్షత్ర ఫలితం:--
నక్షత్రాధిపతి అయిన శుక్రుడు (వింశోత్తరీ దశా రీత్యా) కేతువుతో కలసి శనిరాశి అయిన కుంభంలో ఉన్నందువలన - అనేకమంది భార్యాభర్తలు విడిపోవడం జరుగుతుంది.వీరిలో కొంతమంది విడాకులు తీసుకుంటారు.మరికొందరు అలా తీసుకోకుండానే విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. వీరు గాక ఇంకా ఎంతోమందికి అభిప్రాయ భేదాలు వచ్చి మానసికంగా వారిమధ్యన అగాధాలు ఏర్పడటం జరుగుతుంది. దీనికి నిదర్శనంగా ఎంతోమంది కుటుంబాలలో ఇప్పటికే గొడవలు తారాస్థాయికి చేరుతూ ఉండటాన్ని గమనించండి.

అలాగే - స్నేహితులు గాని, కుటుంబ సభ్యులుగాని,సంస్థలుగాని, మిత్రరాజ్యాలు గాని, చాలాకాలంగా కలిసున్నవారు - వారి మధ్యన విభేదాలు వచ్చి విడిపోవడం తప్పకుండా జరుగుతుంది.

వార ఫలితం :-- 
వారాధిపతి మరియు హోరాధిపతి అయిన గురువుపైన శుక్రోచ్చరాశియగు మీనం నుంచి కుజుని దృష్టి వల్ల,శని గోచారం జరుగుతున్న ధనుస్సు గురురాశి కూడా కావడం వల్ల - అనేకులలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోతుంది.కానీ అది ప్రాక్టికల్ గా శుద్ధంగా ఉండకుండా, ఉత్తగా గ్రంధాలు చదవడం,వాద ప్రతివాదాలు చేసుకోవడంతోనే అదంతా అంతమౌతుంది.అనవసర మాటలవల్లా,ఆడవారి వ్యవహారాల వల్లా,గురువులకు చెడ్డపేరు రావడం,వారిపైన విమర్శలు మేధోపరమైన దాడులు జరగడం చూస్తారు.గురువులకు ఖర్మ ఎక్కువౌతుంది.

ఈ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.గమనించండి.

మేషరాశి
దూరపు వ్యక్తులు దగ్గరౌతారు.దూరపు ప్రాంతాలకు బదిలీలు అవుతాయి.కొత్త ఉద్యోగాలు వస్తాయి.జీవితంలో కొత్త మలుపులు ఎదురౌతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.తండ్రికి, గురువుకు లేదా పెద్దలకు గండకాలం.

వృషభరాశి
అష్టమశని ప్రారంభం అవుతుంది.దీని ఫలితంగా మానసిక వత్తిడి, క్రుంగుబాటు, నలుగురితో విరోధం, అనవసర మాటలు ఎక్కువౌతాయి.అనేక కష్ట నష్టాలు చుట్టు ముడతాయి.

మిథునరాశి
దూరప్రాంతాలకు మార్పు ఉంటుంది. పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడటం జరుగుతుంది. విరక్తితో ఇల్లు వదలి వెళ్ళిపోతారు.లేదా అలాంటి ఆలోచనలు కలుగుతాయి. చుట్టు పక్కల వారితో మాటా మంతీలో అభిప్రాయ భేదాలవల్ల పరస్పర సంబంధాలు దెబ్బ తింటాయి.

కర్కాటకరాశి
ఇంటిలో గొడవలు పెరుగుతాయి. చర్చలు జోరుగా జరుగుతాయి. శత్రుబాధ, పోరు మిక్కుటంగా ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది.

సింహరాశి
రహస్య ప్రేమ వ్యవహారాలు,స్నేహాలు పెరుగుతాయి. ఇంకొందరిలో ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువౌతుంది.నిర్లిప్తతా వైరాగ్యమూ పెరిగిపోతాయి.నెగటివ్ థింకింగ్ ఎక్కువై నీరస పడిపోతారు.ఏం చెయ్యాలో అర్ధంకాని సందిగ్ధ పరిస్థితి ఎదురౌతుంది.ధైర్యం సన్నగిల్లుతుంది.

కన్యారాశి
అర్దాష్టమ శని మొదలౌతుంది.ఇష్టంలేని ఉద్యోగాలు చెయ్యవలసి వస్తుంది.చదువు లేదా ఉద్యోగ రీత్యా ప్రాంతపు మార్పు ఉంటుంది.ఇంటిలో మనశ్శాంతి కరువై పోతుంది. కుటుంబ వ్యవహారాలు చీకాకును సృష్టిస్తాయి.మనసు డిప్రెషన్ లో పడుతుంది.

తులారాశి
ఏడున్నరేళ్ళుగా వీరు పడుతున్న ఏలినాటి శని వదలి పోతుంది.కనుక వీరిని విజయాలు వరిస్తాయి.వెలుగు కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనిపిస్తుంది.మాట చెల్లుబాటవుతుంది.తరచూ ప్రయాణాలు ఊపందుకుంటాయి. అయితే వాటిల్లో ప్రమాదాలు జరిగే సూచన కూడా ఉన్నది.

వృశ్చికరాశి
వీరికి ఏలినాటి శని మూడవ పాదం మొదలైంది. కనుక ఇంటివారితో, స్నేహితులతో అనవసర మాటల వల్ల గొడవలు అవుతాయి. ఒకటి చెబితే ఇంకొకటిగా అర్ధం చేసుకోబడుతుంది. ఇది మనస్పర్ధలకు దారితీస్తుంది.కంటి రోగాలు బాధిస్తాయి. డబ్బు నష్టపోతారు.

ధనూరాశి
అందరిలోకీ ఈ రాశివారు బాగా నష్టానికి గురౌతారు.ఎందుకంటే వీరికి ఏలినాటిశని రెండోపాదం మొదలౌతుంది.అన్ని రంగాలలో వీరిని దురదృష్టం మొదలౌతుంది.మానసికంగా క్రుంగిపోయి ఒంటరివారౌతారు.అనవసర ఊహల వల్ల వాస్తవానికి దూరంగా జరిగి అంతర్ముఖులౌతారు.దీనివల్ల సమాజంతో వీరి సంబంధాలు దెబ్బతింటాయి. స్వయంకృతాపరాధాలు ఎక్కువౌతాయి.

మకరరాశి
వీరికి ఏలినాటి శని మొదలౌతున్నది.కనుక కష్టాలు మొదలౌతాయి. జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఎదురౌతుంది. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి.వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆస్పత్రి ఖర్చులతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ నేపధ్యంలో నష్టాలు కష్టాలు ఉంటాయి.మానసిక చింత వెంటాడుతుంది.ప్రేమ వ్యవహారాలలో, భార్యాభర్తల గొడవలలో మనసు చాలా డిప్రెషన్ కు గురౌతుంది.

కుంభరాశి
వీరికి అంతా లాభంగా ఉంటుంది.రహస్య ప్రేమ వ్యవహారాలు మొదలౌతాయి.స్నేహితులు ఎక్కువౌతారు.అయితే దీనివల్ల ఇంటిలో మనస్పర్ధలు గొడవలు జరుగుతాయి.జీవిత భాగస్వామితో మానసికంగా దూరం పెరుగుతుంది.వ్యాపారం కలిసి వస్తుంది.సంఘంలో మంచి పేరు వస్తుంది.ధనానికి లోటు ఉండదు.అంతా లాభసాటిగా ఉంటుంది.

మీనరాశి
వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది.అయితే 'ఏది ఎలా జరిగితే అలా జరుగుతుందిలే' అనే ఒక విధమైన నిర్లిప్త ధోరణి ఎక్కువౌతుంది.ఇంటిలోనూ వృత్తిపరంగానూ అనేక మార్పులను చూస్తారు.ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఇంటిని వదలి దూర ప్రాంతాలకు పోవలసి వస్తుంది.తనవారితో విరోధం కలుగుతుంది.వృత్తి పరంగా మార్పులు ఉంటాయి.
---------------------------------------
ఇవన్నీ స్థూలఫలితాలు మాత్రమే.ఎందుకంటే ప్రపంచ జనాభాను పన్నెండు రాశులుగా విభజిస్తూ ఈ ఫలితాలను అంచనా వెయ్యడం జరుగుతుంది.కనుక ఇవి బ్రాడ్ ఇండికేషన్స్ మాత్రమే. వ్యక్తిగత జాతకాలతో సమన్వయం చేసుకుని గోచార ఫలితాలను అర్ధం చేసుకోవాలి.

దానిని బట్టి తగిన రెమెడీస్ పాటించడం వల్ల చెడు ఫలితాలను నివారించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.

19, జనవరి 2017, గురువారం

Donald Trump Oath taking Chart - Predictions

మీడియా వార్తల ప్రకారం రేపు మధ్యాన్నం పన్నెండు గంటల సమయంలో,వాషింగ్టన్ డీసీ లో,డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. ప్రెసిడెంట్ కుర్చీలో కూచున్నాక ఈయన తీసుకోబోయే నిర్ణయాల వల్ల ముందు ముందు ఎలా ఉంటుందో అని ఎందరికో అనేక భయాలున్నాయి.

ఈ ముహూర్త సమయ కుండలి ప్రకారం ఈయన ఏలబోయే రాజ్యం ఎలా ఉండబోతున్నదో,అసలు ఈయన చెప్పినవన్నీ చెయ్యగలడా, లేడా,మొదలైన విషయాలను గమనిద్దాం.

ఈ ముహూర్తం జ్యోతిష్యం వచ్చినవారు నిర్ణయించినదే అని తెలుస్తున్నది. ఎందుకంటే - సూర్యుడిని దశమంలో ఉంచుతూ మిట్టమధ్యాన్నపు అభిజిత్ లగ్నాన్ని ముహూర్తంగా నిర్ణయించారు. దీనినే మన పల్లెల్లో "గడ్డపార ముహూర్తం" లేదా "పలుగు ముహూర్తం" అంటారు. సూర్యుడు సరిగా నడినెత్తికి వచ్చాడా లేదా అనేది చూడటానికి ఒక పలుగును భూమిలో పాతి దాని నీడ పూర్తిగా మాయం అయినప్పుడు ముహూర్తంగా నిర్ణయిస్తారు.ఈ ముహూర్తం కూడా అదే.

అయితే సూర్యుడు ఊరకే దశమంలో ఉంటే సరిపోదు.ఆయన మంచి బలంగా కూడా ఉండాలి. అది లేనప్పుడు ఏదో అరకొర ఫలితాలే లభిస్తాయి.

ఈ చార్టులో సూర్యుని పరిస్థితి గందరగోళంగా ఉన్నది. గురుదృష్టి సూర్యునికి బలాన్నిస్తున్నప్పటికీ, శని దృష్టి దానిని బలహీనం చేస్తున్నది. సూర్యునికి రెండింట ఉన్న శుక్ర కేతువుల వల్ల అనేక రకాలైన స్కాండల్స్ కనిపిస్తున్నాయి. ద్వాదశంలో ఉన్న బుధునివల్ల రహస్య అజెండాలు దర్శనమిస్తున్నాయి.అష్టమంలోని రాహువు వల్ల ముస్లిం దేశాలతో శత్రుత్వం, నష్టం కనిపిస్తున్నాయి.

ఈ చార్టులో కనిపిస్తున్న మాలికాయోగం కూడా -- ఈయన పాలన అనేక ఎగుడు దిగుడులతో సాగుతుందని సూచిస్తోంది.

ఇప్పుడు ఫలితాలను గమనిద్దాం.

ఈరోజు పుష్య కృష్ణనవమి, శుక్రవారం, స్వాతీ నక్షత్రం అయింది. వార నక్షత్రాదిపతులైన శుక్ర, రాహువులను బట్టి ఈయన పాలసీ అంతా - ముస్లిమ్స్ ని అమెరికాలోకి రాకుండా కంట్రోల్ చెయ్యడం,సుఖవంతమైన జీవితం కోసం బ్రెజిల్ మొదలైన ఇతరదేశాలనుంచి అమెరికాలోకి వస్తున్న వలసదారులను కంట్రోల్ చెయ్యడం మొదలైన పనుల మీద ఉంటుందని ఊహించవచ్చు.

1.లగ్నాధిపతి కుజుని సున్నా డిగ్రీల బలహీన గండాంతస్థితివల్ల --  ఈయన టర్మ్ అనుకున్నంత సాఫీగా ఎదురులేకుండా ఏమీ ఉండదని తెలుస్తున్నది.కుర్చీలో కూచున్న తర్వాత ఈయనను అనేక సంకట పరిస్థితులు చుట్టుముడతాయి. తను చెప్పినవి అన్నీ చెయ్యడానికి అనేక అడ్డంకులు ఈయనకు ఎదురు వస్తాయి. కాకపోతే లోపల్లోపల తన ఎజెండాకు అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకుంటాడు.కానీ ఆ నిర్ణయాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. చెప్పినవన్నీ చెయ్యడం అంత సులువు కాదని ఈయనకు బాగా తెలిసి వస్తుంది.

2. చంద్రుని స్థితివల్ల -- ఈయనకు ప్రజాభిమానం ఊహించినంత ఉండదు. అభిమానం కంటే వ్యతిరేకతే ప్రజలలో ఈయనకు ఎక్కువగా ఉంటుంది.

3. రాహువు స్థితివల్ల -- అహంకారపూరితమైన నిర్ణయాలు విధానపరంగా తీసుకోవడం జరుగుతుంది. తను అనుకున్నదే కరెక్ట్ అనే దూకుడు ధోరణివల్ల నష్టపోవడం ఉంటుంది.ఈ ధోరణి వల్ల సన్నిహితులు కూడా క్రమేణా దూరం అవుతారు. ముస్లిం తీవ్రవాదులతో బద్ధవైరం ఉంటుంది. ఈయన పాలసీలన్నీ వాళ్ళను ఎలా కట్టడి చెయ్యాలి అన్నదాని మీదే కేంద్రీకృతం అవుతాయి.

4. గురువు స్థితివల్ల -- దూరదేశాలతో శత్రుత్వం ఎక్కువౌతుంది. మతపరంగా వివిధ వర్గాలతో విభేదాలు ఎక్కువౌతాయి.అయితే -- విపరీత రాజయోగం వల్ల వీటిల్లో కొంత మంచి కూడా చివరకు ప్రాప్తిస్తుంది.

5. శని స్థితివల్ల -- విధానపరమైన నిర్ణయాలవల్ల, శ్రామిక వర్గంతోనూ, పేదప్రజలతోనూ ముఖ్యంగా బ్లాక్స్ తోనూ ఇతనికి కుదరక, చెడ్డపేరు వస్తుంది. ముఖ్యంగా డ్రాగన్ కు సూచిక అయిన చైనాతో, ఇతర శ్రామిక కమ్యూనిస్టు దేశాలతో బద్ధ విరోధం ఏర్పడుతుంది. దశాంశలో శనీశ్వరుని నీచస్థితీ, ఆయనతో కలసిన బుధుని స్థితీ దీనినే సూచిస్తున్నది.

6. బుధుని స్థితివల్ల -- ఈయన ఇచ్చే స్టేట్ మెంట్స్ గాని, ఈయన కమ్యూనికేషన్ గాని అంతా గందరగోళంగా,రెండు పడవల మీద ప్రయాణంలాగా ఉంటుంది. కొంతసేపు నిరంకుశంగా కొంతసేపు ప్రజారంజకంగా ఇలా ద్వంద్వ వైఖరితో సాగుతుంది.

7. సూర్యుని స్థితి వల్ల -- మన దేశానికి ఈయన పాలసీల వల్ల మేలూ కీడూ రెండూ జరుగుతాయి.అయితే మనం భయపడుతున్నంత తీవ్రమైన చెడు ఉండదు.క్వాలిటీ ఉన్న మన వర్క్ ఫోర్స్ కు ఈయన తీసుకునే నిర్ణయాల వల్ల భయం ఉండవలసిన అవసరం ఏమీ లేదు.

8. కేతు శుక్రుల వల్ల -- ఇంటా బయటా ఈయనకు విభేదాలు ఎక్కువై తనవారితోనే క్రమేణా విడిపోవడాలు జరుగుతాయి. ఆడవాళ్ళతో స్కాండల్స్ వల్ల ఈయనకూ ఈయన అనుచరులకూ చెడ్డపేరు వస్తుంది. దశాంశలో నీచశుక్రుని స్థితికూడా దీనినే సూచిస్తున్నది. రాహు కేతు యాక్సిస్ యొక్క స్థితిని బట్టి, శుక్ర కేతువుల బాధకరాశి స్థితిని బట్టి, ముస్లిం తీవ్రవాదులతో అమెరికాకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పవచ్చు.

9. నవాంశచక్రం ఎప్పుడూ రాశిచక్రం కంటే బలమైనది. దీనిలో ఒక ముఖ్యమైన సూచన ఉన్నది.కర్కాటకంలో ఉన్న నీచకుజ,బుధ,రాహువులను బట్టి అమెరికా ప్రజలలో దురహంకార ధోరణులు జాత్యహంకార ధోరణులు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతాయని ఈ గ్రహయోగం సూచిస్తున్నది.

10. మీనంలో ఉన్న శని సూర్య యోగం -- ప్రజలకూ పాలకులకూ ఎప్పుడూ ఉండే అభిప్రాయ భేదాలనూ గొడవలనూ సూచిస్తున్నది.చతుర్ధమైన కర్కాటకం నుంచి దశమమైన మకరంవైపు ఉన్న రాహుకేతు ఇరుసు కూడా దీనినే సూచిస్తున్నది. కన్యనుంచి గురుదృష్టి అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే బలమైన రిపబ్లికన్ సపోర్ట్ ను  సూచిస్తే, ఉత్తర పశ్చిమ రాష్ట్రాలనుంచి ఉన్న డెమొక్రాటిక్ అసమ్మతిని కుంభంలోని చంద్రుడూ మీనంలోని శనీశ్వరుడూ సూచిస్తున్నారు. వెరసి ట్రంప్ పరిపాలన ఒక మిక్సెడ్ బ్యాగ్ కాబోతున్నదని ఈ యోగాలవల్ల తెలుస్తున్నది.

అమెరికా దేశపు సహజలగ్నం మిథునమనీ, ధనుస్సనీ అభిప్రాయ భేదాలున్నాయి. ఈ రెంటిలో ఏదైనా కూడా కొన్ని రోజుల్లో జరుగబోతున్న శనీశ్వరుని గోచారమార్పు ఈ రెంటినీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

దీనివల్ల రాబోయే రెండున్నరేళ్ళలో అమెరికాతో విదేశాల సంబంధాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంటే --అమెరికా ఫారిన్ పాలసీ విధానాలు ఇప్పటిదాకా ఉన్నదానికి విభిన్నంగా తీవ్రమైన మార్పుకు గురౌతాయి.

ఆ తర్వాత శనీశ్వరుడు మకరరాశిలో సంచరించే రెండున్నరేళ్లలో అమెరికా చాలా గడ్డుకాలాన్ని చవిచూస్తుంది. అది ఇంటా బయటా కూడా ట్రంప్ కు గడ్డు కాలమే. అంటే -- ఈయన టర్మ్ లో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ పేలవంగా ఉంటుందని ఆ సమయంలో అనేక సమస్యలను ఈయన ఎదుర్కోవలసి ఉంటుందని గోచారం చెబుతున్నది.

18, జనవరి 2017, బుధవారం

Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe - Mohammad Rafi


Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe

అంటూ మహమ్మద్ రఫీ మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతం Vaasna (1968) అనే సినిమా లోది. ఇది ఒక మరపురాని మధురగీతం. సాహిర్ లూదియాన్వి సాహిత్యానికి, చిత్రగుప్త శ్రీవాస్తవ సంగీతం, వీటికి తోడు మహమ్మద్ రఫీ గంధర్వ గానం తోడై ఈ పాటను ఒక అమరగీతంగా మిగిల్చాయి.

ఈ పాటకు పూర్తి న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నా స్వరంలో కూడా ఈ మధురగీతాన్ని వినండి మరి.

Movie:--Vaasna (1968)
Lyrics:--Sahir Ludhianvi
Music:--Chitragupta Srivastava
Singer:--Mohammad Rafi
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
----------------------------------
Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe -2
Bekhudi Itni Badha Do Ke Na Kuch Yaad Rahe
Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe

Dosti Kya Hai, Wafa Kya Hai Muhabbat Kya Hai
Dil Ka Kya Mol Hai Ehasaas Ki Keemat Kya Hai
Hamane Sab Jaan Liya Hai Ke Haqeeqat Kya Hai
Aaj Bas Itani Dua Do Ke Na Kuch Yaad Rahe
Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe

Mufalisi Dekhee, Ameeri Ki Ada Dekh Chuke
Gam Ka Maahaul, Musarrat Ki Kiza Dekh Chuke
Kaise Phirati Hai Zamaane Ki Hawa Dekh Chuke
Shamma Yaadon Ki Bujha Do, Ke Na Kuch Yaad Rahe
Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe

Ishq Bechain Khayalon Ke Siva Kuch Bhi Nahi
Husn Berooh Ujaalon Ke Siva Kuch Bhi Nahi
Zindagi Chand Sawaalon Ke Siwa Kuch Bhi Nahi
Har Sawaal Aise Mita Do Ke Na Kuch Yaad Rahe
Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe

Mit Na Paayega Jahaan Se Kabhi Nafarat Ka Riwaaj
Ho Na Paayega Kabhi Rooh Ke Zakmon Ka Ilaaj
Saltanat Zulm, Kuda Waham Museebat Hai Samaaj-2
Zahan Ko Aise Sula Do Ke Na Kuch Yaad Rahe

Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe
Bekudi Itni Badha Do Ke Na Kuch Yaad Rahe
Aaj Is Darja Pila Do Ke Na Kuch Yaad Rahe

Meaning


Make me drink to such an extant today
that I dont remember anything of the past
Increase my rapture to such an extant
that I may not remember anything of the past

What is friendship, what is promise and what is love
What is the value of heart and what is the price of realization
I have come to know everything
I have come to know the reality
Just bless me to an extant today
that I may not remember anything of the past

I have seen what utter poverty is
and also seen the flirtations of opulence
Experienced the pain of sorrow
and the merriment of joy
How the wind of the world blows, I have seen very clearly
Now put off the light of my memories
that I may not remember anything of the past

Passion of love is nothing but restlessness of thoughts
Beauty is nothing but a glitter of soulless skin
Life is nothing beyond a few question marks
Erase my all questions in such a way
that I may not remember anything of the past

Hatred will never go away from the Earth
Curse of soul's wounds will never heal
Government is a tyranny, God a mere imagination and society an affliction
Put my mind to such a sleep
that I may not remember anything

Increase my rapture to such an extant
that I may not remember anything of the past
Make me drink to such an extant today
that I dont remember anything of the past...

తెలుగు స్వేచ్చానువాదం

ఈరోజు నన్ను పూర్తిగా త్రాగించు
ఎందుకంటే నేను గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి
నాకు బాగా మత్తెక్కించు
నేను గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి

స్నేహం ఏంటో, నమ్మకం ఏంటో, ప్రేమంటే ఏంటో
అన్నీ చూచాను
హృదయం యొక్క లోతులూ, అనుభవం యొక్క ఖరీదూ
అన్నీ చూచాను
సత్యం ఏంటో తెలుసుకున్నాను
ఈరోజు నాకొక చిన్న వరం ఇవ్వు
నేను గతాన్ని పూర్తిగా మరచిపోవాలి
ఇదే నేను కోరే వరం

కటిక పేదరికం అంటే ఏమిటో నేను చూచాను
డబ్బుతో వచ్చే విలాసాల వేషాలూ చూచాను
దుఃఖంలో ఉండే బాధ నాకు తెలుసు
సుఖాలలో ఉండే ఆనందాలూ నాకు తెలుసు
ఈ లోకపు గాలి ఎలా వీస్తుందో నాకు బాగా తెలుసు
ఇప్పుడు నాకొకటే కావాలి
నా జ్ఞాపకాల దీపాలు ఆరిపోవాలి
నా గతాన్ని నేను మరచిపోవాలి

నిలకడ లేని ఆలోచనలు తప్ప ప్రేమంటే ఇంకేమీ లేదు
ఆత్మ లేని చర్మపు తళతళ తప్ప అందం అంటే ఇంకేమీ కాదు
జవాబు లేని ప్రశ్నలు తప్ప జీవితం అంటే ఇంకేమీ లేదు
నా ప్రశ్నలన్నింటినీ లేకుండా చెయ్యి
నా గతాన్ని నేను మరచిపోవాలి

ఈ భూమ్మీద నుంచి ద్వేషం ఎన్నటికీ చెరిగిపోదు
ఆత్మకైన గాయాలు ఎన్నటికీ నయం కావు
ప్రభుత్వం ఒక నిరంకుశత్వం మాత్రమే
దేవుడు ఒక ఊహ మాత్రమే
సమాజం ఒక రోగం మాత్రమే
నా మనస్సును పూర్తిగా నిద్రపుచ్చు
నా గతాన్ని నేను మరచిపోవాలి

ఈరోజు నన్ను పూర్తిగా త్రాగించు
ఎందుకంటే నేను గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి
నాకు బాగా మత్తెక్కించు
నేను గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి

13, జనవరి 2017, శుక్రవారం

Saath Ho Tum Aur Raat Jawaa - Asha Bhonsle, Mukesh


Saath Ho Tum Aur Raat Jawaa అంటూ ఆశా భోంస్లే, ముకేష్ లు మధురంగా ఆలపించిన ఈ రొమాంటిక్ గీతం 1961 లో వచ్చిన Kaanch Ki Gudiya అనే చిత్రం లోనిది.ఈ గీతానికి సాహిత్యాన్ని శైలేంద్ర అందించగా సంగీతాన్ని సుహృద్ కర్ అందించారు.సయీదా ఖాన్, మనోజ్ కుమార్ ఈ పాటలో నటించారు.

ఇదే రాగాన్ని 1963 లో మన తెలుగులో వచ్చిన 'బందిపోటు' అనే సినిమాలో 'ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే' అనే పాటలో వాడుకున్నారు. ఈ సినిమాకు ఘంటసాల సంగీతాన్ని సమకూర్చారు. 

నా స్వరంలో కూడా ఈ గీతాన్ని వినండి మరి.

Movie:-- Kaanch Ki Gudiya (1961)
Lyrics:--Shailendra
Music:--Suhrud Kar
Singers:--Asha Bhonsle, Mukesh Madhur
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
---------------------------------------
Saath ho tum aur raat jawaa - 2
Neend kise ab chain kahaa - Kuch tho samajh E Bhole sanam
Kehti hai kya nazaron ki zubaan
Saath ho tum aur raat jawaa

Mehaktee hawa Chalaktee Ghata
Hamse ye dil sambhaltaa nahee
Ki minnathen manakar thaki
Kare kya ye ab Behaltaa nahee
Dekh ke tumko behkane lagaa
Lo machalne lagaa hasraton ka zahaa

Saath ho tum aur raat jawaa Neend kise ab chain kahaa
Saath ho tum aur raat jawaa 
Aa aa aa aa aa ..............

Ham is raah me - Mile is taraah
Ke ab umr bhar na honge zudaa
Mere saaz-e-dil ki awaaz tum
Mai kuch bhee nahi tumhaare binaa
Aavo chale ham jahaa pyaar se
Vo gale mil rahe hai zameen aasma

Saath ho tum aur raat jawaa - Neend kise ab chain kahaa
Kuch tho samajh E Bhole sanam
Kehti hai kya nazaron ki zubaan
Saath ho tum aur raat jawaa

Meaning

You are with me and this night is lovely
Who has sleep here? and where is peace?
Oh my sweet darling
Understand the language of my eyes
You are with me and this night is lovely

This fragrant wind, these flashing clouds
my heart is  unwilling to listen to me
I tried and tried to convince it
But it is not listening to me at all
What to do now?
After looking at you it is intoxicated
and soaring in the world of passions

We have met on this day
and we wont get separated forever
You are the music emanating from the lute of my heart
I am just nothing without you
Come let us go to a place
where the sky and earth are embracing each other in love

You are with me and this night is lovely
Who has sleep here? and where is peace?
Oh my sweet darling
Understand the language of my eyes
You are with me and this night is lovely

తెలుగు స్వేచ్చానువాదం

నాతో నువ్వున్నావు - ఈ రాత్రి చాలా బాగుంది
ఇప్పుడు నిద్ర ఎలా వస్తుంది? మనశ్శాంతి ఎలా ఉంటుంది?
ఓ మధుర ప్రేయసీ...
నా కన్నులు ఏం సందేశాన్నిస్తున్నాయో
దానిని అర్ధం చేసుకో

ఈ సువాసనతో మత్తెక్కిన గాలి, ఈ మెరుస్తున్న మేఘాలు
నా హృదయం నా మాట వినడం లేదు
దానికి ఎంతో నచ్చచెప్పాలని చూచాను
కానీ అది వినడం లేదు
ఇప్పుడు నేనేం చెయ్యాలి?
నిన్ను చూచాక బహుశా దానికి మత్తెక్కి
మధురోహల లోకంలో విహరిస్తోందేమో?

ఈరోజు మనం ఇలా కలిశాము, ఇక ఎప్పటికీ విడిపోము
నా హృదయపు వీణ పలుకుతున్న రాగానివి నీవే
నువ్వు లేకపోతే నేను ఒక శూన్యాన్ని మాత్రమే
పద..నింగీ నేలా ఎక్కడైతే ప్రేమతో కలుస్తున్నాయో
ఆ చోటకు మనం కూడా పోదాం పద

నాతో నువ్వున్నావు - ఈ రాత్రి చాలా బాగుంది
ఇప్పుడు నిద్ర ఎలా వస్తుంది? మనశ్శాంతి ఎలా ఉంటుంది?
ఓ మధుర ప్రేయసీ...
నా కన్నులు ఏం సందేశాన్నిస్తున్నాయో
దానిని అర్ధం చేసుకో

నాతో నువ్వున్నావు - ఈ రాత్రి చాలా బాగుంది

7, జనవరి 2017, శనివారం

Aa gup chup gup chup pyar kare - Hemant Kumar,Sandhya Mukherjee



Aa gup chup gup chup pyar kare...

అంటూ హేమంత్ కుమార్, సంధ్యాముఖర్జీలు మధురంగా ఆలపించిన ఈ గీతం 1951 లో వచ్చిన SAZAA అనే సినిమాలోది.ఈ పాటకు రాజేంద్రక్రిషన్ సాహిత్యాన్ని అందించగా మధురమైన రాగాన్ని స్వర సామ్రాట్ సచిన్ దేవ్ బర్మన్ అందించారు. 65 ఏళ్ళ క్రితం పాట అయినా ఇప్పటికీ దీనిలో జీవం ఉందీ అంటే అర్ధం చేసుకోవచ్చు ఇదెంత మంచి పాటో??

"ఆఖే చార్ కర్నా" అనేది ఒక ఉపమానం. 'ఒకరి కళ్ళలోకి ఒకరు చూడటం' అని దీని అర్ధం.సామాన్యంగా ఇది ప్రేమికుల మధ్యన జరుగుతుంది.

నా స్వరంలో కూడా ఈ పాటను వినండి మరి.

Movie:--Sazaa (1951)
Lyrics:--Rajendra Krishan
Music:--S.D.Burman
Singers:--Hemanth Kumar, Sandhya Mukherjee
Karaoke Singer:--Satya Narayana Sarma
Enjoy
-----------------------------------------------
oo oo oo oo...
Aaa gup chup gup chup pyar kare
Chup chup aakhe chaar kare
Aaa gup chup gup chup pyar kare
Chup chup aakhe chaar kare

Chand musafir raat ke
Oo oo oo
Chand musafir raat ke kyo sune hamaari baatein
Tooone tho dekhi hongi - esi kitnee hee raatein
Chup jare ja chup ja teri minnat sousou baar kare
Aa gup chup gup chup pyar kare
Chup chup aakhe chaar kare
gup chup gup chup pyar kare

Oo …Chupna hai tho jaldi chupjaa
Ja ja ja ja ja
Oo …Chupna hai tho jaldi chupjaa
Raat hai thodee baakee
Jathe rahna Jaye dono mein aur mera saathi
Chup jare ja chup ja kyo kabtak hum takraar kare
teri minnat sousou baar kare

gup chup gup chup pyar kare
Chup chup aakhe chaar kare
Aaa gup chup gup chup pyar kare
Chup chup aakhe chaar kare

Meaning

Come come... let us love secretly
Let us look into each other's eyes secretly

The Moon is a traveler of the night
Why should he listen to our sweet nothings?
O Moon ! You must have already seen
many many nights like this
Now you keep quiet O Moon ! Keep quiet
Enough of your sweet magic

O Moon ! If you want to keep quiet, do it fast
Because only a little of the night is left
Me and my lover, we keep going anyway
You keep quiet now O Moon
Dont trouble us anymore

Come come... let us love secretly
Let us look into each other's eyes secretly
Come come... let us love secretly

Let us look into each other's eyes secretly..