నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, ఏప్రిల్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర - 17 ( పరాశక్తి ఆలయంలో ఉపన్యాసం మే -12 న)

12-5-2017 న సాయంత్రం 6.30 కి మిషిగన్ పరాశక్తి ఆలయంలో లలితా సహస్ర నామముల మీద ఉపన్యాసం ఇవ్వబోతున్నాను. పోయిన ఏడాది ఇదే సమయంలో ఇదే ఆలయంలో 'శ్రీవిద్య' గురించి మాట్లాడాను.ఇప్పుడు లలితా సహస్ర నామముల గురించి మాట్లాడబోతున్నాను. ఈ సందర్భంగా ఆలయంలో ఉంచుతున్న ఫ్లయర్ ఇది.

ఈ విషయాన్ని ఎంచుకోవడానికి ఒక కారణం ఉన్నది. గత ఏడాదిగా నేను వ్రాస్తున్న నా లేటెస్ట్ పుస్తకం 'లలితా సహస్ర నామ రహస్యార్ధ ప్రదీపిక' పూర్తి అయింది.వచ్చే నెలలో అది E-Book గా రిలీజ్ కాబోతున్నది. నేను జూలైలో ఇండియాకు వచ్చాక దానియొక్క ప్రింట్ బుక్ విడుదల చేస్తాను.

డెట్రాయిట్ చుట్టుపక్కల నివసిస్తున్న పంచవటి సభ్యులకు ఇతరులకు ఈ ఉపన్యాసం వినడానికి ఇదే నా ఆహ్వానం.