నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

7, మే 2017, ఆదివారం

Online radio TORI లో నాతో మాట్లాడవచ్చు



Teluguone.com వారి Online Radio - TORI లో నా కవితలను రచనలను చాలా కాలం నుంచీ రేడియో ప్రయోక్త నాగమణి పగడాల చదువుతూ ఉంటారు. ఈమె నా శిష్యురాలే గాక మంచి భావాలు కలిగిన వ్యక్తి.

మొన్న గాంగెస్ లో జరిగిన రిట్రీట్ కు తనూ వచ్చింది. ఆ సమయంలోనే ఈ రేడియో ప్రోగ్రాం చెయ్యాలని అనుకుంటున్నానని మాతో చెప్పింది.

మే 9, 2017 న 7.00 PM to 9.00 PM EST సమయానికి TORI online radio లో జరిగే 'భావవీచిక' లో నాతో పరిచయం మరియు ప్రశ్నలు - జవాబుల కార్యక్రమాన్ని నాగమణి పగడాల నిర్వహించబోతున్నారు.

ఇండియాలో ఈ సమయం మే 10 బుధవారం తెల్లవారు జామున 4.30 to 6.30 అవుతుంది. ఆ సమయానికి రేడియోలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

కావలసినవారు లాగ్ ఇన్ అయి వినవచ్చు. నాతో రేడియోలో మాట్లాడవచ్చు.