నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, జూన్ 2017, సోమవారం

రెండవ అమెరికా యాత్ర -70 (2014 లో పుట్టిన పిల్లలు యోగజాతకులు)

2014 సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సంవత్సరంలో పుట్టిన పిల్లలకు కూడా ! ఎందుకంటే, ఆ ఒక్క ఏడాదిలో మాత్రమే గురువు శనీశ్వరుడు ఇద్దరూ ఉచ్చస్థితిలో ఉన్నారు. అది కూడా ఒక్క నెలలోనూ, అదికూడా కొద్ది రోజులలో మాత్రమే వీరిద్దరూ మంచి స్థానాల్లో ఉన్నారు. ఆ సమయంలో పుట్టిన పిల్లలు మంచి యోగజాతకులు. ఆయా లగ్నాలు రాశులు నక్షత్రాలను బట్టి వీళ్ళు లౌకికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ మంచి పొజిషన్స్ కు సునాయాసంగా చేరుకుంటారు. ఇలాంటి గ్రహస్థితి 60 ఏళ్ళ కొకసారి మాత్రమే వస్తూ ఉంటుంది. గతంలో ఇలాంటి గ్రహస్థితి 1955 లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2014 లో వచ్చింది. యోగజాతకుల జనన సమయం అంటూ ఆ సమయంలో నేనొక పోస్టు కూడా వ్రాశాను.

సరిగ్గా ఇదే సమయంలో పంచవటి గ్రూపులో ఉన్న ఒక కుటుంబంలో ఒకబ్బాయి పుట్టాడు. ఈ అబ్బాయిది చాలా మంచి ఆధ్యాత్మిక జాతకం. ఈరోజున ఆ అబ్బాయికి అక్షరాభ్యాసం నా చేతుల మీదుగా అమెరికాలో చేశాను. ఆ సందర్భంగా తీసిన ఫోటోలు ఇక్కడ.