ఈ విధంగా అమావాస్య ప్రభావం మళ్ళీ నిజమైంది.
ఈ ప్రదేశం 21-8-2017 న వచ్చిన సూర్యగ్రహణ సమయంలో వేసిన 'ఆస్ట్రో కార్టో గ్రాఫ్' లోని కుజుని రేఖకు దగ్గరలో ఉండటం గమనార్హం. కుజ శనుల ప్రభావం వల్లనే భూకంపాలు వస్తాయని ఇంతకు ముందు చాలాసార్లు చాలా పోస్టులలో ఉదాహరణలతో సహా నిరూపించాను.
సూర్యగ్రహణ ప్రభావం గురించి మేము పోస్ట్ వ్రాసినప్పుడు చాలామంది పెదవి విరిచారు. ఇలాంటి గ్రహణాలు చాలా వచ్చాయి పోయాయి. ఇవన్నీ జరుగుతాయా?పెడతాయా? అని. కానీ ఆ తర్వాత కొద్ది సమయంలోనే హార్వే, ఇర్మా తుఫానులు వచ్చాయి. అమెరికాలో కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ఈ భూకంపం వచ్చింది. తీవ్రంగా జననష్టమూ ఆస్తినష్టమూ జరిగాయి. ఇవన్నీ ఖచ్చితంగా సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావమే అనిపించడం లేదా?
అమెరికాలో హరికేన్లు మామూలే. ఇందులో విచిత్రం ఏముంది? అని మీరనవచ్చు. ఇవి మామూలు తుఫానులు కావు. 2005 లో వచ్చిన విల్మా తుఫాన్ తర్వాత హార్వే అంత భీకర తుఫాన్ ఈ పన్నెండేళ్ళలో రాలేదు. గురువుగారు రాశిచక్రాన్ని చుట్టి రావడానికి 12 ఏళ్ళు పడుతుందన్న విషయం గుర్తుంటే దీని వెనుక ఉన్న సైకిల్ అర్ధమౌతుంది.
ఇర్మా తుఫాన్ కూడా 2005 లో వచ్చిన కత్రినా తర్వాత అంతటి ఘోరమైన తుఫాన్. ఇది కూడా దాదాపుగా 12 ఏళ్ళ తేడాతో వచ్చింది మరి.
సెప్టెంబర్ 7 న వచ్చిన భూకంపం తర్వాత రెండు వారాల వ్యవధిలో మెక్సికోలో ఇది రెండో భూకంపం. గమనించండి.

25-4-2017 న నేను అమెరికాలో ఉన్నప్పుడు పోస్ట్ చేసిన "సంపూర్ణ సూర్యగ్రహణం - 2017 ఫలితాలు ఎలా ఉండవచ్చు?" అనే పోస్ట్ లో ఇలా వ్రాశాము.
ఈ రేఖమీద కుజుడు గనుక ఉంటె, అది రాజకీయ యుద్ధాలను సూచిస్తుంది. అంతేగాక అగ్నిప్రమాదాలు, పేలుళ్లు, భూకంపాలు, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, ప్రముఖుల మరణాలు, సైనిక చర్యలు, మాస్ కిల్లింగ్స్ ను సూచిస్తుంది.
సరిగ్గా ఇప్పుడు భూకంపం వచ్చిన ప్రదేశమూ, మొన్నటికి మొన్న రెండు తుఫానులు అమెరికా దక్షిణ రాష్ట్రాలను ఊపిన ప్రదేశమూ, ఈ గ్రాఫ్ లో కుజ, రాహు రేఖలు పోతున్న ప్రాంతంగా ఉన్నది చూడండి.
అంతేగాక - "నెప్ట్యూన్ మరియు చతుర్ధం పసిఫిక్ ప్రాంతంలో పడుతున్నది ఇందువల్ల ఈ ప్రాంతలో భూకంపాలు రావచ్చు. Pacific ring of fire మీద పడుతున్న ఈ గ్రహణపు నీడ వల్ల ఆ ప్రాంతంలో భూకంపాలు రావచ్చని సూచిస్తున్నది. ఈ ప్రాంతం భూకంపాలకు పెట్టింది పేరని గుర్తుంచుకోవాలి" అని అప్పుడు వ్రాసిన విషయాన్నీ గమనించాలి.
ఇంకా గమనించండి.
"సెప్టెంబర్ మొదటి వారంలో కుజుడు ఈ గ్రహణ డిగ్రీని దాటుతాడు. కనుక ఆ సమయంలో అనేక సంఘటనలు జరుగుతాయి" అంటూ వ్రాసినది ఎలా ఖచ్చితంగా జరిగిందో చూడండి. సెప్టెంబర్ మొదటి వారంలోనే 'ఇర్మా ' తుఫాన్ అమెరికా దక్షిణ ప్రాంతాన్ని ఒక ఊపు ఊపింది. ఇదే సమయంలో మెక్సికోలో 8.1 స్థాయిలో భూకంపం వచ్చింది.
ఈ సూర్యగ్రహణ ప్రభావం అప్పుడే అయిపోలేదు. ఇంకా మరికొన్ని మిగిలి ఉన్నాయి. వేచి చూడండి మరి.