నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

15, ఏప్రిల్ 2018, ఆదివారం

శ్రీవిద్యా రహస్యం - 2nd Edition - E Book రిలీజైంది

అశేషాంధ్ర పాఠకుల విశేషాభిమానాన్ని సశేషంగా చూరగొన్న మా పుస్తకం 'శ్రీవిద్యా రహస్యం' మొదటి ముద్రణలో వేసిన పుస్తకాలన్నీ అయిపోవడంతో రెండవ ముద్రణకు ముందుగా, పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేర్పులు చేద్దామని భావించడం జరిగింది.

ఈ క్రమంలో భాగంగా, 'నాలుగు ఆచారములు' అన్న క్రొత్త అధ్యాయాన్ని పుస్తకానికి చేర్చాము. అందులో, శ్రీవిద్యోపాసనలోని నాలుగు ఆచారాలను దాదాపు ఏభై పద్యాలలో వివరించడం జరిగింది. అక్కడక్కడా పాతపద్యాలను మార్చడం, కొన్ని అధ్యాయాలలో అవసరమైన చోట్ల కొంత వివరణను పెంచడం జరిగింది. ఆయా అధ్యాయాల ముందుగా శ్రీ యంత్రంలోని నవావరణల చిత్రాలను చేర్చడం జరిగింది. ఈ మార్పులతో మా పుస్తకానికి ఒక పరిపూర్ణత వచ్చినట్లుగా భావిస్తూ రెండవ ముద్రణకు వెళ్ళబోతున్న సందర్భంగా, ముందుగా 'ఈ - బుక్' ను విడుదల చెయ్యడం జరిగింది.

పుస్తకం కావలసినవారు ఇంతకు ముందు మాదిరిగానే, google play books నుంచి పొందవచ్చు.

ఈ పుస్తకాన్ని రివ్యూ చెయ్యడంలో విసుగు లేకుండా సహకరించిన నా అమెరికా శిష్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం ఇంగ్లీషు వెర్షన్ The Secret of Sri Vidya అనే పేరుతో అమెజాన్ లో కూడా లభ్యమౌతున్నది. అతి త్వరలో ఆ 'ఈ-బుక్' కూడా అప్ డేట్ చెయ్యబడుతుంది.