అయ్యప్ప దీక్షల సీజన్ వచ్చేసింది. వాళ్ళమీద పోస్టు వ్రాయకపోతే నాకూ, నా విమర్శకులకూ తోచదు గనుక, నాకోసం కాకపోయినా, వారికోసమైనా ఒక పోస్ట్ వ్రాయక తప్పడం లేదు.
అయ్యప్ప దీక్షలంటే ఏంటో గొప్పగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అందులో ఏమీ లేదు. అంతకంటే ఉన్నతమైన విషయాలు తెలియనివారికి అవి గొప్ప కావచ్చు. కానీ అవి ఆధ్యాత్మిక మార్గంలో కనీసం LKG లెవల్ కూడా కాదు. ఎందుకూ అంటే, వాటిని చేసేవాళ్ళు తమతమ కోరికలు తీరడం కోసం చేస్తున్నారు కాబట్టి. కోరికలు తీరడం కోసం చేసే ఏ పూజ అయినా దీక్ష అయినా - వాటికి ఆధ్యాత్మికంగా ఏ విలువా ఉండదు. తెలీని అజ్ఞానులు వాటినేదో గొప్పగా అనుకుంటూ ఒంటిని నానా హింసా పెట్టుకుంటూ ఉంటారు. కానీ మానసికంగా వీళ్ళలో చాలామంది చాలా లేకి మనస్తత్వాలు కలిగి ఉంటారు. నేను కనీసం 40 ఏళ్ళ నుంచీ ఈ అయ్యప్ప దీక్షల తంతులను చూస్తున్నాను. ఆంధ్రాలో అయ్యప్ప పేరు ఎవరికీ తెలీని రోజుల్లో ఈ దీక్షను చేసిన వాళ్ళు మా కుటుంబంలోనే ఉన్నారు. కానీ, మానసికమైన ఔన్నత్యాన్ని కలిగిఉన్న అయ్యప్ప దీక్షాధారిని నేనింతవరకూ ఒక్కడిని కూడా చూడలేదు. అందుకే నేను వాళ్ళనెవర్నీ స్వామీ అని పిలవకపోగా, బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తూ ఉంటాను.
మొన్నొకరోజున ఉదయం ఆరుకే తయారై క్యాంప్ కని బయల్దేరాను. నేను మామూలుగా నా బైక్ ని 30, 40 కంటే ఎక్కువ స్పీడ్ లో ఎప్పుడూ పోనివ్వను. ఆ రోజు కూడా అంతే స్పీడ్ లో పోతున్నాను. మా సందు మలుపు తిరిగేసరికి, ఎదురుగా రాంగ్ రూట్ లో చాలా స్పీడ్ గా వస్తున్న ఒక బ్లాక్ క్యాట్ నాకు డ్యాష్ ఇచ్చినంత పనిచేసి సడన్ బ్రేక్ వేసింది. నేనూ బ్రేక్ వేసి ఆపాను బైక్ ను. లేకుంటే ఇద్దరం గుద్దుకునేవాళ్ళమే. రాంగ్ రూట్లో వచ్చిందికాక బ్లాక్ క్యాట్ చాలా సీరియస్ గా నావైపు చూసింది.
'రాంగ్ రూట్లో వచ్చావ్' అన్నా నేను.
'నువ్వు తప్పుకొని పోవచ్చుగా?' అంది బ్లాక్ క్యాట్.
వీడికి నా చేతులో మూడింది అనుకుని బైక్ దిగి స్టాండ్ వేశాను.
'ఏంటీ? నువ్వు రాంగ్ రూట్లో వచ్చి డ్యాష్ ఇవ్వబోతే, నేను తప్పుకుని పక్కకు పోవాలా?' అడిగాను అంతకంటే సీరియస్ గా.
'స్వామీ' అనలేదని వాడికి కోపం వచ్చేసింది. ఆ పదానికి ఉన్న విలువేంటో నాకు బాగా తెలుసు. ఊరకే నల్లడ్రస్సు వేసినంత మాత్రాన ప్రతి వెధవనీ 'స్వామీ' అని నేనెందుకంటాను?
'ఒకవేళ తగిలితే ఏమయ్యేది?' అన్నాడు వాడు.
'ఆ మాట నేననాలి. ఆ బుద్ధి నీకుండాలి' అన్నాను.
'ఏంటీ బుద్ధి అంటున్నావ్?' అన్నాడు బ్లాక్ క్యాట్ తనూ దిగి స్టాండ్ వేస్తూ.
ఇన్నేళ్ళలో, అయ్యప్పదీక్షలో ఉన్నవాడిని నేనెప్పుడూ కొట్టలేదు. ఈ రోజు తప్పేటట్లు లేదని అనుకుంటూ 'మరేం అనాలి? రాంగ్ రూట్లో అంత స్పీడ్లో వచ్చింది చాలక, సిగ్గులేకుండా ఇంకా వాదిస్తున్నావా?' అన్నాను మణికట్లు, పిడికిళ్ళు ఫ్లెక్స్ చేస్తూ.
'సిగ్గేంటి?' అన్నాడు వాడు కోపంగా.
'అవున్లే అది నీకుంటే ఈ డ్రస్సేసుకుని ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావ్?' అన్నాను.
వాడికేం అనాలో తోచలేదు. కోపంగా చూస్తున్నాడు.
ఈలోపల వాడికి తోడు ఇంకో బ్లాక్ క్యాట్ గాడొచ్చాడు.
'గొడవెందుకు స్వామీ. వెళ్ళండి' అన్నాడు నాకు నచ్చజెబుతూ.
'అది అక్కడ చెప్పు' అన్నాను వాడినీ సీరియస్ గా చూస్తూ. గొడవ ముదిరితే ఇద్దర్నీ అక్కడే పడేసి ఉతుకుదాం అనుకున్నా.
'స్వాములతో గొడవెందుకు స్వామీ?' అన్నాడు వాడు మళ్ళీ.
ఇదొక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !!
'ఎవడ్రా స్వామి? డ్రస్సు మార్చినంత మాత్రాన స్వాములు అవుతారట్రా మీరు?' అందామని నోటిదాకా వచ్చింది, తమాయించుకుని -- 'గొడవ నేను పెట్టుకోలేదు' అన్నాను.
'సర్లే సర్లే స్వామీ. ఏదో అయిపొయింది. పదండి' అన్నాడు వాడు నా భుజం మీద చెయ్యి వెయ్యబోతూ.
వెయ్యబోతున్న ఆ చెయ్యి వైపు సీరియస్ గా ఒక లుక్కిచ్చాను. చేతిని వెనక్కు తీసుకున్నాడు.
'చూద్దాం వీళ్ళ సంగతి ఏంటో?'-అనుకుంటూ నేను కదలకుండా అక్కడే నిలబడ్డాను. ఏమనుకున్నారో ఏమో బైక్ స్టార్ట్ చేసుకుని ఏదేదో గొణుక్కుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. 'పనికి మాలిన వెధవల్లారా !' - అనుకుంటూ నా దారిన నేనొచ్చేశాను.
ఇలాంటి దీక్షలను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతూ ఉంటుంది. వీళ్ళ ప్రవర్తనలు ఉన్నతంగా ఎక్కడా ఉండవు. చాలామంది అయ్యప్ప దీక్షాపరులు రౌడీల్లాగా ప్రవర్తిస్తూ ఉండటం నేను చాలాసార్లు చూచాను. నిన్నటిదాకా అన్నీ అవలక్షణాలతో బ్రతికిన మనుషులు ఒక్కసారి నల్లడ్రస్సు వేసి గడ్డం పెంచినంత మాత్రాన ఋషులుగా ఎలా రూపాంతరం చెందుతారు? అది అసంభవం. అందుకే వాళ్ళ పాత ప్రవర్తనలే వాళ్ళతో ఉంటూ ఉంటాయి. దానికి తోడు, 'స్వామీ స్వామీ' అంటూ లోకగొర్రెలు వీళ్ళకు ఇచ్చే గౌరవం ఒకటి!
ఇంతకీ, దీక్షలంటూ ఈ హింస ఎందుకూ అంటే, ఎవరికోసమో కాదు, వాళ్ళ కోరికలు అప్పనంగా తీరడానికి ఇదొక మసోచిష్టిక్ హింస. ఈ హింస వల్ల నిజానికి ఏమైనా ఒరుగుతుందా అంటే, అక్కడ ఒరిగేది ఏమీ ఉండదు. కనీసం, వీళ్ళలో సివిక్ సెన్సూ, మానసిక ఔన్నత్యమూ, ఉదాత్తమైన ఆలోచనాధోరణీ, మంచితనమూ పెరుగుతాయా అంటే అదీ ఉండదు. ఇవే లేనప్పుడు, వీటికి ఎంతో అతీతమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం ఎక్కడనుంచి ఏడుస్తుంది వీళ్ళకు? దీక్షలు తీసుకోని వాళ్ళకంటే మేమేదో గొప్పవాళ్ళం అని అహంకారం పెరగడం తప్ప ఈ దీక్షలవల్ల ఏమీ ఉపయోగం లేదు.
ఏ దీక్ష అయినా సరే, దానివల్ల మనిషి ఉన్నతంగా ఎదగాలి, మంచితనం పెరగాలి, మానవత్వం పెరగాలి, సివిక్ సెన్స్ పెరగాలి, అహంకారం తగ్గాలి, మనవల్ల ప్రక్కమనిషి ఇబ్బంది పడకూడదన్న సెన్స్ రావాలి, మోసపూరిత మనస్తత్వం పోవాలి, దౌర్జన్యం చేసే గుణం మాయం కావాలి. ఈ లక్షణాలు మనిషిలో కనిపిస్తుంటే - అప్పుడు ఆ దీక్ష ఫలిస్తున్నట్టు. ఇవి లేకుండా మనం ఎప్పటిలాగే మన దరిద్రపు పోకడలతో ఉంటూ, అడ్డమైన పనులన్నీ ఎప్పటిలాగే చేస్తూ, మేం దీక్షలు చేస్తున్నాం అంటే అది ఆత్మవంచన, లోకవంచన తప్ప ఇంకేమీ కాదు.
ఒక మంచి సివిక్ సెన్స్ తో కూడిన అయ్యప్ప దీక్షాధారిని నేను ఇంకా చూడవలసి ఉంది. చూస్తానని నాకైతే నమ్మకం లేదు.
సివిక్ సెన్సే లేనివాడికి స్పిరిట్యువల్ సెన్స్ ఎలా వస్తుంది? ఎక్కడనుంచి వస్తుంది? అసలలా ఆశించడమే తప్పేమో? మరి ఏ విధంగానూ మనిషిలో ఔన్నత్యాన్ని తీసుకురాని ఈ దీక్షలెందుకు? ఈ నాటకాలెందుకు? బలమైన లోకమాయలో ఈ దీక్షల గోల కూడా ఒక భాగమేనని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.
ఒకే ఒక్క సంఘటనను జెనరలైజ్ చెయ్యకూడదని నాకు బాగా తెలుసు. కానీ నాకిప్పటిదాకా ఎన్నో సంఘటనలు ఇలాంటివి కనిపించాయి. ప్రస్తుతం మన సమాజం చాలా దరిద్రంగా ఉంది. ఆ దరిద్రపు మనస్తత్వాలలోనుంచి వచ్చిన మనుషులు చేసే దీక్షలు ఉన్నతంగా ఎలా ఉంటాయసలు? పాత్రశుద్ధి లేకుండా దాంట్లో పాలు పోస్తే ఏమౌతాయి? పాలు కూడా వాటి విలువను పోగొట్టుకుంటాయి. ప్రస్తుతం అయ్యప్ప దీక్షల్లో జరుగుతున్నది సరిగ్గా అదే.
నా ఈ అభిప్రాయం నిజమే అనడానికి ప్రతిరోజూ నాకు ఎవిడెన్స్ లభిస్తూనే ఉంది మరి !