నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

27, జనవరి 2019, ఆదివారం

Maha Souram English E Book ఈరోజు విడుదలైంది

తిధుల ప్రకారం ఈ రోజు (పుష్య బహుళ సప్తమి) వివేకానందస్వామి పుట్టినరోజు. అందుకని ఈ రోజున 'Maha Souram' English E book ను విడుదల చేస్తున్నాను. నా పుస్తకాలన్నీ తెలుగు ఇంగ్లీషులలో ఒకేసారిగా వ్రాయబడటం మీకు తెలిసినదే. ఆ ప్రక్రియలో భాగంగానే ఈ పుస్తకం నేడు విడుదల అవుతున్నది.

'నా శిష్యులైన మీరు, వేదాలలో ఉన్న అద్భుతములైన మంత్రాలకు అసలైన వ్యాఖ్యానం వ్రాయాలి. వాటిని లోకానికి వెల్లడి చెయ్యాలి' అని వివేకానందస్వామి తన జీవితంలో చివరిరోజున శిష్యులతో అన్నారు.

'అంతరేణ తాలుకే| స ఏష స్తన ఇవావలంబతే| సేంద్రయోని:| యత్రాసౌ కేశాంతౌ వివర్తతే| వ్యపోహ్య శీర్షకపాలే|'

అనే తైత్తిరీయోపనిషత్తు లోని వేదమంత్రాన్ని ఉటంకిస్తూ ఆయన ఈ మాటన్నారు. ఆ మంత్రమునకున్నట్టి యోగపరమైన అర్ధమును, ఖేచరీ యోగమును ఆ మంత్రం ఎలా సూచిస్తున్నదన్న విషయాన్ని 'శ్రీ విద్యారహస్యం' లోనే వివరించాను. మహాసౌరం కూడా అటువంటి అనేక యోగ-తంత్ర రహస్యాలను తనలో కలిగి ఉన్న సూర్యమంత్రముల సమాహారమే. ఈ మంత్రసమాహారానికి నేను వ్రాసిన భాష్యానికి ఇంగ్లీషు పుస్తకాన్ని, వివేకానందస్వామి జన్మతిధి నాడు, ఈరోజున విడుదల చేస్తున్నాను.

తెలుగును చదువలేని అంతర్జాతీయ పాఠకులకు ఈ పుస్తకం ఉపయోగిస్తుందని నా నమ్మకం. యధావిధిగా ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో amazon నుంచి కూడా లభిస్తుంది.

2019 లో పంచవటి నుంచి రాబోయే మరిన్ని విలువైన పుస్తకాల కోసం ఎదురుచూస్తూ ఉండండి మరి !