నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, జులై 2019, గురువారం

కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం)

మళ్ళీ ఒక వారం పాటు కలబురిగిలో నివాసం ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతిరోజూ మా అమ్మాయినడిగి తన స్కూటర్ తీసుకుని, బుద్ధవిహార్ దర్శనం, అక్కడి ధ్యానమందిరంలో కూచుని ధ్యానం చెయ్యడం, లైబ్రరీలో కూచుని బౌద్ధగ్రంధాల అధ్యయనం చెయ్యడం యధావిధిగా జరిగింది. ఇవి తప్ప ఆ ఊరిలో ఇంకేమీ నేను చూడలేదు. ఊరికి ఏడు కి.మీ దూరంలో విశాలమైన పొలాల మధ్యన నిర్మానుష్య ప్రదేశంలో ఒక చిన్న కొండగుట్ట పైన ఉన్న బుద్ధవిహార్ చాలా పెద్ద పాలరాతి కట్టడం. చెట్లూ తోటలతో విశాలంగా...
read more " కలబురిగి కబుర్లు - 5 (తాంత్రిక బౌద్ధం) "

2, జులై 2019, మంగళవారం

రెండవ లక్నో యాత్ర - 2

గెస్ట్ లెక్చరర్స్ లో డా. రాజేష్ హర్షవర్ధన్ ఒకరు. ఈయన లక్నో లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో ఒక విభాగానికి ఇన్ చార్జ్ గా ఉన్నారు. చాలా డిగ్రీలున్న ప్రముఖుడు. 'మెడికల్ వేస్ట్ మేనేజిమెంట్' అనే సబ్జెక్ట్ మీద ఈయన మాకు లెక్చర్ ఇచ్చారు. ఎక్కువగా పర్యావరణం గురించి, దానిపట్ల మనకున్న బాధ్యత గురించి, ప్రకృతిని కాపాడవలసిన అవసరం గురించి తాత్వికంగా మాట్లాడాడు. ఈయనకు మెడికల్ నాలెడ్జ్ తోడు మన భారతీయ...
read more " రెండవ లక్నో యాత్ర - 2 "