నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

30, డిసెంబర్ 2019, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (రాహుకాలం - యమగండం)

నేటి పంచాంగాలలో జనాన్ని అనవసరంగా భయపెడుతున్న రెండు మాటలు రాహుకాలం - యమగండం. వీటి అసలు తత్త్వం ఈ పోస్టులో చూద్దాం. కాస్త ధైర్యంగా ఈ పోస్టును చదవండి మరి ! జ్యోతిష్యంలో, మనకు తెలిసిన ఏడు ముఖ్యగ్రహాలకు తోడు ఉపగ్రహాలని ఉన్నాయి. వీటిని పరాశరహోర చెప్పింది. ఫలదీపిక మొదలైన ఇంకా ఇతర ప్రామాణిక గ్రంధాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ ఉపగ్రహాలను ఎలా లెక్కించాలి అనే దానికి ఫార్ములాలు ఉన్నాయి. కానీ ఈ ఉపగ్రహాలను కూడా తమ జాతక విశ్లేషణలో...
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (రాహుకాలం - యమగండం) "

28, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు)

ముహూర్తంలోనే అన్నీ ఉన్నాయి అది చాలా ముఖ్యం అనే వాళ్లకు నాదొక ప్రశ్న. సప్తఋషులలో ఒకరైన వశిష్టమహర్షి పెట్టిన శ్రీరామ పట్టాభిషేక  ముహూర్తం ఎందుకు తప్పిపోయింది? బ్రహ్మఋషి అయిన ఆయనకు మనంత జ్యోతిష్యం రాదా? లేక కావాలనే తప్పిపోయే ముహూర్తం పెట్టాడా? దీనికి మన పురోహితజ్యోతిష్కులూ పురాణపండితులూ రకరకాల బుకాయింపు   కబుర్లు చెబుతారు. ఆ ముహూర్తం తప్పిపోతేగాని శ్రీరాముడు అడవికి పోడు. అప్పుడుగాని రావణసంహారం జరగదు....
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (ఋషులు పెట్టిన ముహూర్తాలు) "

25, డిసెంబర్ 2019, బుధవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?)

గత పోస్టులో నేను చెప్పిన నిజాలను చాలామంది జీర్ణించుకోలేరు. ఆత్మస్తుతి పరనింద దిశలో నేను చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చాలామంది అనుకోవచ్చు. వాళ్ళు నా పాయింట్ ను సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు. ఈ నా వాదనకు వ్యతిరేకంగా పంచాంగ ముహూర్తాలను సమర్ధించే పురోహితులు, పంచాంగజ్యోతిష్కులు చెప్పే లాజిక్స్ కొన్ని ఉంటాయి. అవేమిటో వరుసగా చూద్దాం. 1. అబ్బాయి అమ్మాయి జాతకాలను బట్టి వారి జీవితం నడుస్తుంది గాని, ముహూర్తాన్ని బట్టి కాదు....
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (జాతకమా - ముహూర్తమా?) "

21, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు)

నేడు బంపర్ గా సాగుతున్న రెండు వ్యాపారాలేవంటే జ్యోతిష్యమూ, వాస్తులే. టీవీ పెడితే చాలు రకరకాల బిరుదులున్న జ్యోతిష్కులు ఊదరగొడుతూ కనిపిస్తారు. పత్రిక పేజీ తిప్పితే చాలు, జ్యోతిష్యమూ, వాస్తుల గురించి ప్రశ్నలు సమాధానాలు కనిపిస్తాయి. రోడ్డుమీద ఎక్కడ చూసినా పెద్దపెద్ద బోర్డులు కన్పిస్తాయి. వెరసి సమాజంలో ఇవి రెండూ బాగా చెలామణీ అవుతున్నాయని అందరికీ తెలుసు. కానీ, నేడు సమాజంలో చలామణీ అవుతున్న జ్యోతిష్యం నిజమైనదేనా? వాస్తు నిజమైనదేనా...
read more " నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు) "

15, డిసెంబర్ 2019, ఆదివారం

షష్ఠగ్రహ కూటమి - 2019

ధనూరాశిలో షష్ఠగ్రహకూటమి రాబోతోంది. అంటే ధనూరాశిలో ఆరుగ్రహాలు కలవబోతున్నాయి. ఇది ఈ నెల 25, 26, 27 తేదీలలో ఉంటుంది. అవి, గురు, శని, కేతు, సూర్య, చంద్ర, బుధులు. ఆరు గ్రహాలు కలవడం వల్ల లోకమేమీ బద్దలై పోదు. అక్కడక్కడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. రక్తపాతం, ప్రాణనష్టం, దేశాల వ్యవస్థలు కూలడం, ప్రకృతి ప్రమాదాలు జరుగుతాయి. కొందరు జ్యోతిష్కులు చెబుతున్నట్టు ప్రపంచం తల్లక్రిందులు ఏమీ కాదు. కాలగమనంలో ఇలాంటివి  చాలా జరిగాయి....
read more " షష్ఠగ్రహ కూటమి - 2019 "

11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రపంచ రేపుల రాజధాని

మొన్న కొందరు నాయకులు పార్లమెంట్ లో మాట్లాడుతూ, 'ఇండియాకు ప్రపంచ రేపుల రాజధాని అని పేరోస్తోంది' అన్నారు. Make in India బదులు Rape in India అంటే సరిపోతుంది అని కూడా అన్నారు. కొత్త సినిమా టైటిల్ భలే ఉంది కదూ An evening in Paris, Love in Tokyo లకి సీక్వెల్ లాగా Rape in India!  సినిమావాళ్ళు ఎవరైనా ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారో లేదో నాకైతే తెలీదు మరి !! అసలూ, ఈ పేరు మన దేశానికి ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు కొత్తగా...
read more " ప్రపంచ రేపుల రాజధాని "

1, డిసెంబర్ 2019, ఆదివారం

నవంబర్ 2019 అమావాస్య ప్రభావం - దిశ దారుణ హత్య - విశ్లేషణ

ప్రతి ఏడాదీ నవంబర్ నెలలో వచ్చే అమావాస్య ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని ఇంతకు ముందు ఎన్నోసార్లు వ్రాశాను. కావాలంటే, మనుషుల మీద అమావాస్య పౌర్ణమి ప్రభావాల గురించి నా పాతపోస్టులు చదవండి. మీకు చాలా స్పష్టంగా అర్ధమౌతుంది. ఈ అమావాస్యలలో కూడా, నవంబర్ లో వచ్చే అమావాస్య చాలా చెడ్డది. దీనికి కారణం ఈ సమయంలో చంద్రుడు వృశ్చికరాశిలో ఉండటమే. ఇది చంద్రునికి నీచస్థానం. అంటే చందుని బలం పూర్తిగా క్షీణించి ఉంటుంది....
read more " నవంబర్ 2019 అమావాస్య ప్రభావం - దిశ దారుణ హత్య - విశ్లేషణ "

17, అక్టోబర్ 2019, గురువారం

Wooden Dummy Practice - 1

Wooden Dummy మీద కొన్ని రకాల పంచెస్ అభ్యాసం చేయడాన్ని ఇక్కడ చూడండి. ...
read more " Wooden Dummy Practice - 1 "

Mosquito Kung Fu

చెట్ల మధ్యన ప్రాక్టిస్ చేసే సమయంలో చెట్ల దోమలు మనల్ని కుడుతూ ఉంటాయి. వాటినుంచి కాచుకుంటూ డమ్మీ ప్రాక్టిస్ చెయ్యడమే 'మస్కిటో కుంగ్ ఫూ'. సరదాగా చేసిన ఈ క్లిప్ ను చూడండి. 'మస్కిటో కుంగ్ ఫూ' ఎలా ఉంటుందో తెలుసుకోండి ! ...
read more " Mosquito Kung Fu "

13, అక్టోబర్ 2019, ఆదివారం

Making of Wooden Dummy

హైదరాబాద్ కు వచ్చాక ప్రతి ఆదివారమూ మా ఇంట్లో యోగసాధన జరుగుతోంది. ఆ తర్వాత కాసేపు మాట్లాడుకుని టీ త్రాగి ఎవరిదారిన వారు వెళ్లడం జరుగుతోంది. కానీ ఈ రోజు మాత్రం యోగా తర్వాత Martial Arts practice కోసం Wooden Dummy ని తయారు చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దానికోసం తోటలో ఒకచోట పడిపోయి ఉన్న చెట్టును సేకరించి దానిని చక్కగా రెండుముక్కలుగా నరికి ఒక చక్కని స్థలంలో దానిని పాతాము. ఆ తర్వాత దానికి...
read more " Making of Wooden Dummy "

7, అక్టోబర్ 2019, సోమవారం

బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించాను

ఒకరోజున బాసర స్టేషన్ తనిఖీకి వెళ్లాను. అక్కడి స్టాఫ్ ని అడిగితే ఉదయం నాలుగున్నరకే ఆలయం తెరుస్తారని చెప్పారు. ఉద్యోగానికి సంబంధించిన పని అయిపోయాక తెల్లవారు ఝామున నాలుగున్నరకు బయల్దేరి పది నిముషాలలో ఆలయం దగ్గరకు చేరుకున్నాను. అక్కడ చడీచప్పుడూ ఏమీ లేదు. షాపులూ, ఆలయం కౌంటర్లూ అన్నీ మూసేసి ఉన్నాయి. జోగుతున్న సెక్యూరిటీ వారిని అడిగితే ఆరుగంటలకు మాత్రమే లోనికి వదుల్తామనీ, ఈలోపల అమ్మవారికి అలంకారం చేస్తుంటారనీ అన్నారు. ఒక గంటసేపు...
read more " బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించాను "

6, అక్టోబర్ 2019, ఆదివారం

లంబస్తనీం వికృతాక్షీం.....

'లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూడాం జోగులాంబాం నమామ్యహమ్' (పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను) ఆలంపురం జోగులాంబ ధ్యానశ్లోకం ఇది. మొన్న ఒకరోజున కర్నూల్ టౌన్ ఆలంపురం మధ్యలో అర్ధరాత్రి తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నవరాత్రుల మధ్యలో. ముప్పై ఏళ్ల క్రితం నేను ఆదోనిలో ఉన్నప్పుడే...
read more " లంబస్తనీం వికృతాక్షీం..... "

25, సెప్టెంబర్ 2019, బుధవారం

శుక్రుని నీచస్థితి - సెక్స్ కుంభకోణాలు - అర్ధాంతర మరణాలు

ప్రతి ఏడాదీ సెప్టెంబర్ లో శుక్రుడు నీచస్థితిలోకి (కన్యారాశిలోకి) వస్తూ ఉంటాడు. ఈ స్థితిలో ఆయన ఒక నెలపాటు ఉంటాడు. అదేచోట బుధుడు ఉఛ్చస్థితిలో ఉంటాడు. కన్యారాశి మూడోపాదంలో ఉన్నపుడు నవాంశలో వీరిద్దరి స్థితులు రివర్స్ అవుతాయి. అంటే బుధుడు నీచస్థితిలోకి, శుక్రుడు ఉఛ్చస్థితిలోకి పోతారు. రాశి నవాంశలలో వ్యతిరేక స్థితులలో వీరుండటం సమాజంలో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇవి, సెక్స్ కుంభకోణాలు, అసహజమైన మానవసంబంధాలు...
read more " శుక్రుని నీచస్థితి - సెక్స్ కుంభకోణాలు - అర్ధాంతర మరణాలు "

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

షిరిడీ సాయిబాబా శిష్యుడు దాసగణు మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను

ఉద్యోగపనులలో భాగంగా మహారాష్ట్రలోని ఉమ్రీ స్టేషన్ తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. ఈ స్టేషన్ నాందేడ్ కు 30 కి. మీ దూరంలో ఉంటుంది. పని అయిపోయాక యధాలాపంగా చూస్తే, సాయిబాబా ముఖ్యశిష్యుడైన దాసగణు మహారాజ్ ఆశ్రమం అక్కడకు దగ్గర్లోనే గోరఠీ గ్రామంలో ఉందని తెలిసింది. నేనా  బోర్డు వైపు చూడటం గమనించి, స్టేషన్ మాస్టర్ ఇలా అన్నాడు - 'ఆశ్రమం బాగుంటుంది సార్. వెళ్ళిరండి. ...
read more " షిరిడీ సాయిబాబా శిష్యుడు దాసగణు మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను "