నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

23, జనవరి 2020, గురువారం

2020 శనీశ్వరుని మకరరాశి ప్రవేశం - ఫలితాలు

రేపు 24-1-2020 న ఉదయం 8-30 కి శనీశ్వరుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ రెండున్నరేళ్ళు ఉంటాడు. ఈ రెండున్నరేళ్ళలో పన్నెండు రాశులు/ లగ్నాల వారికి ఏయే ఫలితాలు జరుగుతాయో స్థూలంగా చదవండి.

మేషరాశి
వీరికి ఈ రెండేళ్ళూ అంతా ఉద్యోగం చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంలో ఎత్తు పల్లాలను చూస్తారు. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది. భయపడటం అనవసరం. డబ్బు బాగా ఖర్చౌతుంది. భార్యకు/భర్తకు అనారోగ్యం కలుగుతుంది.

వృషభరాశి
దూరదేశ ప్రయాణం ఉంటుంది. తండ్రికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ ధనపరంగా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికధోరణి ఎక్కువౌతుంది. పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. మానసికంగా ధైర్యం కలుగుతుంది. శత్రుత్వాలు సమసిపోతాయి. బంధువులు దగ్గరౌతారు.

మిధునరాశి
తండ్రికి గురువులకు గండం. డబ్బుపరంగా ఎత్తుపల్లాలను ఒడుదుడుకులను చూస్తారు. వృత్తిపరంగా సెటిల్ అవ్వబోయే ముందు ఉండే టీతింగ్ ప్రాబ్లంస్ ఎదురౌతాయి. మాటలో ధైర్యం, నిలకడ పెరుగుతాయి.

కర్కాటకరాశి
భార్యకు/భర్తకు ఆరోగ్యం చెడుతుంది. కొంతమంది వీరిని కోల్పోతారు కూడా. ఉద్యోగ, వ్యాపారాలలో తీవ్రమైన ప్రతికూలమార్పులు ఉంటాయి. ఆశాభంగాలు తప్పవు. ఆరోగ్యం తేడా వస్తుంది. తండ్రికి, తల్లికి గండం.

సింహరాశి
అందరితో శత్రుత్వం పెరుగుతుంది. అన్నీ ఎదురొస్తాయి. గొడవలు జరుగుతాయి. అప్పులు చేస్తారు. ఆరోగ్యం చెడుతుంది. డబ్బు బాగా ఖర్చౌతుంది. ధైర్యం సన్నగిల్లుతుంది.

కన్యారాశి
సంతానంతో విరోధం కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఒడుదుడుకులు చూస్తారు. ప్రేమ వ్యవహారాలు దెబ్బతింటాయి. బిజినెస్ కుంటుపడుతుంది. డబ్బు వస్తుంది. జీవితభాగస్వామికి గండం. మాట చెలామణీ కాదు.

తులారాశి 
చదువులో రాణిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వాహనయోగం ఉంటుంది. శత్రువులు కంట్రోల్లో ఉంటారు. అన్నివిధాలుగా మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి
ధైర్యం సన్నగిల్లుతుంది. చింత, ఆందోళన పీడించడం మొదలుపెడతాయి. మాటధాటి తగ్గుతుంది. తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు చెడు జరుగుతుంది. ఆధ్యాత్మికచింతన, వైరాగ్యం, విరక్తి, ఇక ఈ జీవితం ఇంతేలే అన్న నిర్లిప్త ధోరణీ పెరుగుతాయి. గతంలో దూరమైన గురువులు, ఆధ్యాత్మిక స్నేహితులు దగ్గరౌతారు. యాత్రలు చేస్తారు. డబ్బు ఖర్చౌతుంది.

ధనూరాశి
ఇంట్లో పరిస్థితులు తారుమారౌతాయి. కంటిచూపు సన్నగిల్లుతుంది. మాట చెల్లుబాటు కాదు. డబ్బుకు బాగా ఇబ్బంది పడతారు. నష్టపోతారు. తల్లికి గండం. చదువు కుంటుపడుతుంది. లాభం బదులు నష్టం ఎదురౌతుంది.

మకరరాశి
మంచి పరిణామాలు ఎదురౌతాయి. నిదానంగా పరిస్థితులు బాగవడం చూస్తారు. ధైర్యం పెరుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాలపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. దగ్గర ప్రయాణాలు చేస్తారు. వృత్తిలో ప్రొమోషన్ వస్తుంది.

కుంభరాశి
స్వల్ప అనారోగ్యాలు పీడిస్తాయి. ఆస్పత్రిని సందర్శిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. మంచి పనులకు పెద్ద ఖర్చులు పెడతారు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. మాటలో నిదానం నిలకడలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది.

మీనరాశి
అనారోగ్యాలు ఎదురౌతాయి. కొత్తమిత్రులు ఏర్పడతారు. పనివాళ్లకు, ఇరుగుపొరుగులకు సాయం చేస్తారు. డబ్బులు బాగా ఖర్చౌతాయి. కానీ, సమయానికి సహాయం అందుతుంది.

మీకు జరుగుతున్న దశ - అంతర్దశలతో ఈ వివరాలు పోల్చి చూసుకుంటే ఆయా సంఘటనలలో ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఈ రెండున్నరేళ్ళలో ముఖ్యమైన గోచార మార్పులు జరిగినప్పుడు మళ్ళీ గుర్తు చేస్తాను.