పక్క జీవిని తింటూ
తను హాయిగా బ్రతకాలని
ప్రతి జీవీ ప్రయత్నం
నక్కజిత్తులు వేస్తూ
నాటకాలాడటం
సగటుజీవి ప్రయత్నం
పోతానని తెలిసినా
పోకుండా ఉండాలని
ప్రతి ప్రాణీ ప్రయత్నం
మోతబరువు మోస్తున్నా
మోజు తీరకపోవడం
సంసారి ప్రయత్నం
వద్దనుకునేదానిలోనే
వయసంతా బ్రతకడం
సన్యాసి ప్రయత్నం
తప్పని తెలిసినా
తప్పించుకోలేక తారట్లాడటం
మనిషి ప్రయత్నం
ఎప్పటినుంచో కోరుకున్నది
ఎదురుగా ఉన్నా అందుకోలేని
అసమర్ధుని ప్రయత్నం
చెయ్యలేనని తెలిసినా
చేద్దామనుకోవడం
ఆశాజీవి...
28, జనవరి 2020, మంగళవారం
26, జనవరి 2020, ఆదివారం
Corona Virus - రాహుకేతువుల సంబంధం

రాహుకేతువులకు అన్ని వైరస్ ల మీదా, అన్ని అసాధ్యరోగాల మీదా అదుపు ఉందని ఇంతకు మునుపు చాలాసార్లు వ్రాశాను. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కూ రాహుకేతువులకూ ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు వినండి.
ఈ వైరస్ ముఖ్యంగా ఒంటెల నుంచి, పాముల నుంచి, గబ్బిలాలనుంచి మనుషులకు పాకుతుంది. ఆ తరువాత గాలిద్వారా తుమ్ములద్వారా మనుషులలో శరవేగంతో వ్యాపిస్తుంది. ఒంటె, పాము, గబ్బిలం మూడూ రాహుకారకత్వాల లోనివే....
లేబుళ్లు:
జ్యోతిషం
24, జనవరి 2020, శుక్రవారం
Corona Virus - షష్ఠగ్రహకూటమి ఫలితమా??

Corona Virus
Corona of the Sun
డిసెంబర్ 25,26,27 తేదీలలో ధనూరాశిలో షష్ఠగ్రహ కూటమి జరిగింది. సరిగ్గా మూడురోజుల తర్వాత డిసెంబర్ 31 న చైనాలో ఒక క్రొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దానిపేరు కరోనా వైరస్. ఇప్పుడు ప్రపంచం అంతా దీని పేరువిని గడగడా వణికిపోతున్నది. ఆసియా దేశాలలో ఇది శరవేగంతో వ్యాపిస్తున్నది. జలుబుతో మొదలై, న్యుమోనియా వరకూ వెళ్లి, కిడ్నీ ఫెయిల్యూర్ తో చావును కొనితెచ్చే ఈ వైరస్...
లేబుళ్లు:
జ్యోతిషం
23, జనవరి 2020, గురువారం
2020 శనీశ్వరుని మకరరాశి ప్రవేశం - ఫలితాలు
రేపు 24-1-2020 న ఉదయం 8-30 కి శనీశ్వరుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ రెండున్నరేళ్ళు ఉంటాడు. ఈ రెండున్నరేళ్ళలో పన్నెండు రాశులు/ లగ్నాల వారికి ఏయే ఫలితాలు జరుగుతాయో స్థూలంగా చదవండి.
మేషరాశి
వీరికి ఈ రెండేళ్ళూ అంతా ఉద్యోగం చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగంలో ఎత్తు పల్లాలను చూస్తారు. ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. కానీ చివరకు అంతా మంచే జరుగుతుంది. భయపడటం అనవసరం. డబ్బు బాగా ఖర్చౌతుంది. భార్యకు/భర్తకు అనారోగ్యం కలుగుతుంది.
వృషభరాశి
దూరదేశ...
లేబుళ్లు:
జ్యోతిషం
15, జనవరి 2020, బుధవారం
మా క్రొత్తపుస్తకం 'మహా స్మృతిప్రస్థాన సూత్రము' ఈరోజు విడుదలైంది

'పంచవటి' లో మేము నడిచే సాధనామార్గానికి బుద్ధభగవానుని మార్గం
చాలావరకూ దగ్గరగా ఉంటుంది. నా చిన్నతనం నుంచీ బుద్ధభగవానుని నేనారాధిస్తున్నాను. నిజమైన ఆధ్యాత్మికతకు మూలసాధనలు ఆయన బోధనలలో దాగి
ఉన్నవని నా అంతరిక ప్రయాణంలో నాకర్ధమైంది. 'అనాత్మవాదం' తప్ప శంకరాద్వైతానికీ బౌద్దానికీ ఏమీ భేదం లేదనీ నాకు
తెలుసు. అలాగే, పతంజలి మహర్షి వ్రాసిన 'యోగసూత్రాలు' కూడా...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
,
My Books
13, జనవరి 2020, సోమవారం
నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (నామ నక్షత్రాల గోల)
పురోహిత జ్యోతిష్కులు జ్యోతిష్యశాస్త్రానికి చేసిన మరొక పెద్ద కీడు - 'నామనక్షత్రాలు' అంటూ ఒక స్కీమ్ తయారు చెయ్యడం. దీనిని కొంతమంది అజ్ఞానులు చాలా గుడ్డిగా పాటిస్తున్నారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే, జ్యోతిషశాస్త్రంలో ప్రతిదానికీ ఒక లాజిక్ ఉంటుంది. కానీ దీనికి మాత్రం ఏ లాజిక్కూ లేదు.
జ్యోతిష్యశాస్త్రంలో లేని అనేక విషయాలు పంచాంగాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ 'పురోహిత జ్యోతిష్కుల' సృష్టే. వీటిని పాటించవలసిన పని ఏ...
లేబుళ్లు:
జ్యోతిషం
6, జనవరి 2020, సోమవారం
నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (అమెరికా ముహూర్తాలు)
పాపం మనవాళ్ళు ఎక్కడకు పోయినా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న ఆచారాలనూ పద్ధతులనూ అక్కడకు కూడా తీసుకుపోతూ ఉంటారు. ఇది మంచి విషయమే. ఏ దేశానికి పోయినా, మనం మనంగానే ఉండాలి. అయితే, అక్కడి పద్ధతులను కూడా ఆకళింపు చేసుకోవాలి. పాటించాలి. కానీ, లోలోపల మనం మనంగానే ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వం మనదిగా ఉంటుంది. కానీ, దీనిని ఆసరాగా తీసుకుని దొంగ గురువులు, దొంగ జ్యోతిష్కులు, దొంగ పురోహితులు, దొంగ పూజారులు అలాంటివారికి చుక్కలు చూపిస్తున్నారు....
లేబుళ్లు:
జ్యోతిషం
నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (యమగండం ఎందుకు చెడ్డది?)
'యమగండం' అనేది ఎవడో కల్పించిన కల్లబొల్లి మాట తప్ప, అసలది ప్రామాణిక జ్యోతిష్య గ్రంధాలలో లేదని వ్రాశాను కదా ! కానీ దీనికి ప్రత్యామ్నాయంగా వేరే మాట లేదు గనుక ప్రస్తుతానికి ఈ మాటనే వాడుకుందాం. దీని గురించి మరికొంత వినండి !
యమగండ సమయంలో ఏ పని చేసినా చెడిపోతుందని, సర్వనాశనం అవుతుందని అనేవాళ్ళు ఆ సమయంలో ఏదైనా చేసి చూడండి. ఏమీ కాదు ! ఎవరైనా కొన్నిసార్లు సరదాగా టెస్ట్ చేసి అప్పుడు చెప్పండి !
పోనీ ఇంకో విషయం ! మనం ఏదైనా...
లేబుళ్లు:
జ్యోతిషం
5, జనవరి 2020, ఆదివారం
Kalpataru Day Celebration - 2020

ప్రతి ఏడాదీ జనవరి ఒకటో తేదీన లోకం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటుంది. నేనూ దీనిని పాటిస్తాను. అయితే లోకం చేసే విధంగా కాదు. షాపింగులు, పార్టీలు చేసుకుని, తిని, తాగి, తందనాలాడి, రాత్రంతా మేలుకుని సొల్లు మాటలు చెప్పుకుంటూ, సినిమాలు, టీవీలు చూస్తూ కాదు. ఇవన్నీ చేస్తూ క్రొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం చాలా చౌకబారు పోకడగా, ఇలా చేసేవారిని చాలా చౌకబారు మనుషులుగా నేను భావిస్తాను. దీనికి పూర్తిగా భిన్నమైన...
లేబుళ్లు:
ఆధ్యాత్మికం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు
(
Atom
)