Pages - Menu

Pages

24, జనవరి 2020, శుక్రవారం

Corona Virus - షష్ఠగ్రహకూటమి ఫలితమా??

Corona Virus
Corona of the Sun

డిసెంబర్ 25,26,27 తేదీలలో ధనూరాశిలో షష్ఠగ్రహ కూటమి జరిగింది. సరిగ్గా మూడురోజుల తర్వాత డిసెంబర్ 31 న చైనాలో ఒక క్రొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.  దానిపేరు కరోనా వైరస్. ఇప్పుడు ప్రపంచం అంతా దీని పేరువిని గడగడా వణికిపోతున్నది. ఆసియా దేశాలలో ఇది శరవేగంతో వ్యాపిస్తున్నది. జలుబుతో మొదలై, న్యుమోనియా వరకూ వెళ్లి, కిడ్నీ ఫెయిల్యూర్ తో చావును కొనితెచ్చే ఈ వైరస్ పేరు వింటే నేడు దేశదేశాలు భయంతో వణుకుతున్నాయి. చైనానుంచీ, ఆసియాలో ఇతర దేశాలనుంచీ విమానాలలో వస్తున్న ప్రయాణీకులను ఇతర దేశాలలో ఆపేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జరగబోయే 3 కోట్లమంది ప్రయాణాలను చైనాలో ఇప్పటికే కేన్సిల్ చేశారు. అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్, చికాగోలలో ఇప్పటికే కొన్ని కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పేరు చెబితే అమెరికా భయంతో గడగడా వణికిపోతున్నది.

ఈ వైరస్ ముఖ్యంగా SARS and MERS అనే రోగాలను కొనితెస్తుంది. వీటిలో SARS అంటే Severe acute respiratory syndrome. MERS అంటే Middle East respiratory syndrome. సాధారణ జలుబులా మొదలైన ఈ రోగం, అతి త్వరగా లంగ్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. ఏ మందులకూ లొంగదు. ప్రస్తుతానికి దీనికి మందులు లేవు. ఒకరినుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తుంది. ఇది చైనా నుంచి దాదాపు నలభై దేశాలకు వ్యాపించింది. వందలాదిమంది చావులకు కారణం అయింది. ఇప్పుడు మళ్ళీ దేశదేశాలకు వ్యాపించబోతున్నది.

1960 నించే ఈ వైరస్ మనకు తెలుసు. దీని మూలాలు 8000 ఏళ్ళ క్రితమే భూమ్మీద ఉన్నాయట. కానీ ఇప్పుడు కనిపెట్టబడిన వైరస్ వీటిలో ఒక క్రొత్త రకం. ఇదే ఇప్పుడు దేశదేశాలను భయపెడుతోంది. అసలు విషయం ఏమంటే, ఇదంతా షష్ఠగ్రహకూటమి జరిగిన మూడురోజుల్లో మొదలు కావడం !!

షష్ఠగ్రహకూటమి సమయంలోనే సూర్యగ్రహణం కూడా వచ్చింది. సూర్యగ్రహణానికీ ఈ వైరస్ కీ ఉన్న లింక్ చెబితే మీరు ఆశ్చర్యంతో తల్లక్రిందులౌతారు. సూర్యగ్రహణ సమయంలో సూర్యుడు మొత్తం నల్లగా అయినప్పుడు సూర్యబింబం చుట్టూ ఒక వెలుగుతొ కూడిన రింగ్ లాగా వస్తుంది. దానిని 'కరోనా' అంటారు. సరిగా ఈ వైరస్ స్వరూపం కూడా అలాగే ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరును 1960 ప్రాంతాలలోనే పెట్టారు. కానీ విచిత్రం అదికాదు. సరిగ్గా సూర్యగ్రహణం + షష్ఠగ్రహ కూటమి జరిగిన వెంటనే ఈ వైరస్ లో ఒక కొత్త స్ట్రెయిన్ ప్రత్యక్షమై, అది శరవేగంతో వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అదీ అసలైన వింత !!

సూర్యుని కరోనా కూ ఈ వైరస్ కూ పేరులోనే కాదు. రూపంలో కూడా దగ్గర పోలికలున్నాయి. మరిప్పుడు ఒప్పుకుంటారా, ఖగోళంలో గ్రహసంచారానికీ, భూమ్మీద జరిగే సంఘటనలకూ అవినాభావ సంబంధం ఉందని? పదేళ్ళ నుంచీ కొన్ని వందల రుజువులు చూపించా. ఇంకెన్ని రుజువులు కావాలో చెప్పండి మరి?