Pages - Menu

Pages

17, ఫిబ్రవరి 2020, సోమవారం

Fitness Challenge - 1 (Flexibility)

ప్రస్తుతం నాకు 57 నడుస్తోంది. మరికొద్ది నెలలలో 58 లోకి అడుగు పెడుతున్నాను. కానీ, నా వయసు 30-35 మధ్యలో ఆగిపోయిందని నా ప్రగాఢవిశ్వాసం. ఈ ఫీలింగుకి కారణం నా యోగాభ్యాసం, నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్. ఈ ఫీలింగ్ నిజమా కాదా అని అప్పుడప్పుడూ పరీక్ష చేసుకుంటూ ఉంటాను. నిజమే అని జవాబు వస్తూ ఉంటుంది.

నేను ఇరవైలలో ఉండగా హై కిక్స్ బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పుడు దాదాపు 180 డిగ్రీలలో కాలు పైకి లేచేది. నిలుచుని ఉన్న ఒకరి తలమీద ప్లాస్టిక్ చెంబు ఉంచి, సునాయాసంగా దానిని కాలితో కిక్ చేసి ఎగరగొట్టేవాడిని. అది ఇప్పుడు కూడా చెయ్యగలను. కానీ నిలబడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు 180 డిగ్రీస్ రావడం లేదు, 135 డిగ్రీస్ మాత్రమే వస్తోంది. అందుకే, ఎటుపోయి ఎటోస్తుందో ఏమో అని నా శిష్యులు భయపడుతున్నారు. కానీ ఒక్క ఏడాదిలో 180 డిగ్రీస్ లో కిక్స్ మళ్ళీ సాధించాలని ఈ మధ్యనే కంకణం కట్టుకున్నాను.

ఇంకో మూడేళ్ళలో నాకు 60 నిండుతాయి. నా షష్టిపూర్తికి నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజున ఈ క్రింది వ్యాయామాలు చేసి వాటిని వీడియో తీసి రికార్డ్ చేసి ఇదే బ్లాగులో పోస్ట్ చేస్తాను. అవేంటో తెలుసా ?

1. 60 Push Ups at a time.
2. 60 Punches and 60 Kicks non - stop.
3. 120 minutes Yoga Non - stop

ఈ షెడ్యూల్ ను నా షష్టిపూర్తి రోజున చెయ్యబోతున్నాను. ఇది నాకు నేనే ఇచ్చుకుంటున్న సెల్ఫ్ చాలెంజ్ !

ఆఫ్ కోర్స్ ఇది మూడేళ్ళ తర్వాత అనుకోండి. ప్రస్తుతానికి - flexibility కోసం ఇప్పుడు చేస్తున్న martial arts వ్యాయామాలు కొన్నింటిని చూడండి.