నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, మార్చి 2021, బుధవారం

సూయజ్ కెనాల్ సంక్షోభం - జ్యోతిష్య విశ్లేషణ

సూయజ్  కాలువ అనేది మధ్యధరా సముద్రాన్ని ఎర్రసముద్రంతో కలుపుతూ కట్టబడిన ఒక కాలువ.  ఇదొక సన్నటి కారిడార్ లాంటిది. దీనిని 1859 - 1869 మధ్యలో పదేళ్ళపాటు నిర్మించారు. ఆఫ్రికా ఖండాన్ని ఆసియా ఖండంతో విడదీస్తున్న ఇది ఈజిప్టు దగ్గరలో ఉంది.దీనిలో ప్రయాణించే ఓడలు ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా, ఉత్తరఅట్లాంటిక్ సముద్రం నుంచి ఉత్తర హిందూమహాసముద్రంలోకి ఈ దగ్గరిదారిలో నుంచి సూటిగా రావచ్చు....
read more " సూయజ్ కెనాల్ సంక్షోభం - జ్యోతిష్య విశ్లేషణ "

సౌత్ డకోటా కార్చిచ్చు - జ్యోతిష్య విశ్లేషణ

అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రంలో రష్ మోర్ పర్వతం ఉంది. ఇది  పర్యాటకస్థలం మాత్రమేగాక అమెరికా పుట్టకముందునుంచీ నేటివ్ ఇండియన్స్ కి చెందిన చారిత్రకస్థలం కూడా.  ఈ పర్వతం మీదే అమెరికా అధ్యక్షుల ముఖాలు చెక్కబడి ఉంటాయి. దీనిని అనేక సినిమాలలో కూడా మనం చూచాం.గత మూడురోజులనుంచీ ఇక్కడ కార్చిచ్చు చెలరేగి అడవులు తగలబడిపోతున్నాయి. వందలాది ఇళ్లను ఖాళీ చేయించారు. పర్యాటకులను రావద్దని ఆపేస్తున్నారు. ఫైర్...
read more " సౌత్ డకోటా కార్చిచ్చు - జ్యోతిష్య విశ్లేషణ "

29, మార్చి 2021, సోమవారం

ఇండోనేషియా చర్చిలో ఆత్మాహుతి దాడి - జ్యోతిష్య విశ్లేషణ

ఆదివారం ఉదయం పదిన్నర గంటలు. ఇండోనేషియా లోని సులవేసి ద్వీపంలోని మొకాసర్ సిటీలో  ఒక కాథలిక్ చర్చిలో ప్రార్ధనలు జరుగుతున్నాయి. చర్చి నిండా జనం ఉన్నారు. చర్చ్ బయట ఇద్దరు ముస్లిం తీవ్రవాదులు బాంబులతో తమను తామే పేల్చేసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ముక్కలైపోయారు. చర్చిలో ప్రార్ధనలు చేస్తున్నవారిలో ఇరవైమంది గాయాలపాలయ్యారు. ఆత్మాహుతి దళం ఇద్దరిలో ఒకరు అమ్మాయట. ఇద్దరూ ఇస్లామిక్ స్టేట్  తీవ్రవాద...
read more " ఇండోనేషియా చర్చిలో ఆత్మాహుతి దాడి - జ్యోతిష్య విశ్లేషణ "

నాష్ విల్ వరదలు - జ్యోతిష్య విశ్లేషణ

గత రెండు రోజులుగా కురుస్తున్నరికార్డు స్థాయి భారీ వర్షాలకు అమెరికాలోని టెనెసి రాష్ట్రం అల్లాడి ఆకులు మేస్తోంది. అతలాకుతలమౌతోంది. ఈ రాష్ట్ర రాజధాని నాష్ విల్ లో అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. అపార్ట్ మెంట్లలో మొదటి అంతస్తులు మునిగిపోయాయి.  వర్షాలు తగ్గాక నాలుగు శవాలు దొరికాయి. అనేకమందిని ప్రభుత్వ, రెడ్ క్రాస్ వంటి సంస్థలు రక్షించాయి.ఎందుకని అమెరికాలోనే ఇవి జరుగుతున్నాయి?...
read more " నాష్ విల్ వరదలు - జ్యోతిష్య విశ్లేషణ "

28, మార్చి 2021, ఆదివారం

వర్జీనియా బీచ్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

జ్యోతిష్య దిక్సూచి ఈసారి అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి మారింది. శుక్రవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అమెరికాలోని వర్జీనియా బీచ్ లో జరిగిన తొక్కిసలాటలో చెదురుమదురు కాల్పులలో ఇద్దరు చనిపోయారు. ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ బీచ్ కి చాలామంది సరదాగా గడపడానికి వస్తుంటారు. అలాగే ఈ వీకెండ్ లో కూడా వచ్చారు. ఒక గుంపులో మాటామాటా పెరిగి గొడవ జరిగి కాల్పుల వరకూ పోయింది. తర్వాత ఇంకోచోట, ఆ తర్వాత...
read more " వర్జీనియా బీచ్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ "

25, మార్చి 2021, గురువారం

బోల్డర్ గ్రోసరీ స్టోర్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

22-3-2021 మంగళవారం మధ్యాన్నం 2.30  కు  అమెరికాలో మరో ఘాతుకం జరిగింది. ఈసారి గ్రహదృష్టి కొలరాడో రాష్ట్రంలోని బోల్డర్  కి మారింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో దగ్గర్లోని ఒక స్టోర్ లో ఒక వ్యక్తి జరిపిన కాల్పులలో పదిమంది చనిపోయారు. వీళ్ళలో ఒక పోలీస్  ఆఫీసర్ కూడా ఉన్నాడు.ఈ దుండగుడి వయసు కూడా 21 సంవత్సరాలే. వీడిపేరు అహమద్ అల్ అలివి అలిస్సా అని చెబుతున్నారు. ఊరకే కాల్పులు జరిపి పార్కింగ్...
read more " బోల్డర్ గ్రోసరీ స్టోర్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ "

19, మార్చి 2021, శుక్రవారం

అట్లాంటా స్పా కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

16-3-2021 మంగళవారం సాయంత్రం అమెరికా టైం 5 గంటల ప్రాంతంలో అట్లాంటాలోని స్పాలలో జరిగిన కాల్పులలో ఎనిమిదిమంది చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కొరియా జాతీయులైన ఆడవాళ్లు. వారిని కాల్చినది 21 ఏళ్ల పిల్ల అమెరికన్. అదేరోజు సాయంత్రానికి పోలీసులు అతన్ని పట్టేశారు. అతని పేరు రాబర్ట్ ఎరన్ లాంగ్, జార్జియా కు చెందినవాడు. సెక్స్ ఎడిక్షన్ కు ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు. మసాజ్...
read more " అట్లాంటా స్పా కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ "

14, మార్చి 2021, ఆదివారం

శివరాత్రి - 2021

మొన్న శివరాత్రి నాడు, రాత్రి పదకొండున్నర దాటాక మిత్రుడు ఫోన్ చేశాడు. అప్పుడే నిద్రపట్టబోతోంది. 'ఏంటి ఈ టైంలో ఫోన్?' అనుకుంటూ ఫోనెత్తి 'హలో' అన్నా బద్ధకంగా.'ఏం చేస్తున్నావ్' అన్నాడు.తనెప్పుడూ ఇంతే. భోంచేస్తుంటే ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటాడు. నిద్రపోతుంటే ఫోన్ చేసి  ఏం చేస్తున్నావ్? అంటాడు. స్నానం చేసే టైం లో అడగటం లేదు. అదొక్కటే వెసులుబాటు. ప్రస్తుతానికి బాత్రూం లోకి ఫోన్ తీసికెళ్ళడం లేదు. ముందుముందు అదికూడా...
read more " శివరాత్రి - 2021 "

5, మార్చి 2021, శుక్రవారం

కర్ణపిశాచి - కరోనా వాక్సిన్

రాత్రి  భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.ఎవరా అని చూస్తే రవి. సామాన్యంగా ఉదయంపూట మాత్రమే రవి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అమెరికా శిష్యురాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను గనుక అతడి ఫోన్ ఎత్తను. అందుకని ఈ టైంలో చేశాడా అనుకుంటూ 'హలొ రవి' అన్నా.'ఏం చేస్తున్నావ్?'  అడిగాడు తాపీగా.'ఇప్పుడే సాంగ్స్ అయిపోయాయి. డాన్స్ చెయ్యబోతున్నా' అన్నా అంతకంటే తాపీగా. 'అదేంటి డాన్స్ కూడా వచ్చా నీకు? ఇన్నేళ్ల తర్వాత కొత్తకోణాలు కనిపిస్తున్నాయే?'...
read more " కర్ణపిశాచి - కరోనా వాక్సిన్ "

కర్మవలయం - ప్రశ్నశాస్త్రం

సమయం రాత్రి పది. పనులన్నీ ముగించుకుని నిద్రాధ్యానానికి ఉపక్రమించబోతుండగా ఫోన్ మ్రోగింది. ఏదో క్రొత్త నంబర్. ఒక్కొక్కసారి అమెరికా శిష్యులు కూడా ఇండియా నంబర్ తో ఫోన్ చేస్తుంటారు. సరే ఎవరో చూద్దామని 'హలొ' అన్నా.'నేను ఫలానా మాట్లాడుతున్నాను. ప్రభుత్వంలో ఫలానా పొజిషన్ లో రిటైరయ్యాను' అందొక మొగగొంతు దర్పంగా, ఇలాంటి మాడిపోయిన బల్బులని చాలా మందిని చూసి ఉండటంతో, అదంతా పట్టించుకోకుండా, 'చెప్పండి....
read more " కర్మవలయం - ప్రశ్నశాస్త్రం "