అక్కడసలేం జరుగుతోందో జ్యోతిష్యపరంగా చూద్దాం.
6-5-2021 న అక్కడ గొడవలు మొదలయ్యాయి. ఎందుకు మొదలయ్యాయి అన్నది నెట్లో ఉంటుంది గనుక మళ్ళీ నేను వివరించి చెప్పవలసిన పని లేదు. క్లుప్తంగా చెప్పాలంటే జెరూసలేం రెండు ముక్కలుగా విడగొట్టబడి ఇద్దరి అధీనంలో ఉన్నది. తూర్పువైపు పాలస్తీనా అదుపులో, పడమర వైపు ఇజ్రాయెల్ అదుపులో ఉంది. అక్కడ జరిగిన ఒక గొడవతో రెండుపక్షాలకూ యుద్ధం మళ్ళీ మొదలైంది.
అసలిదంతా బ్రిటిష్ వాడి చలవే. ఈనాడు మనం పాకిస్తాన్ తో, బాంగ్లాదేశ్ తో తంటాలు పడటమూ, ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న ముస్లిం దేశాలతో గొడవలు పడుతూ దినదినగండంగా జీవిస్తూ ఉండటమూ ఇవి రెండూ తెల్లవాడి చలవలే. మన దేశాన్ని రెండు ముక్కలు చేసి రెండు పాకిస్థాన్ల మధ్యన మనల్ని ఇరికించి వాళ్ళు తప్పుకున్నారు. అదే విధంగా ముస్లిం దేశాల మధ్యలో ఒక చిన్న ముక్కని 'ప్రామిస్డ్ ల్యాండ్' అంటూ ఇజ్రాయెల్ అనేపేరుతో సృష్టించి రావణకాష్టానికి ఆజ్యం పోశారు. అలాంటి రావణకాష్ఠమే కాశ్మీర్ కూడా. 70 ఏళ్ళనుంచీ రగులుతున్న ఆ కాష్టం బీజేపీ పుణ్యమా అని, మోదీగారి పుణ్యమా అని, ఆరిపోయింది. ఈ ఒక్కపని చేసినందుకు భారతదేశం బీజేపీకి కలకాలం ఋణపడి ఉండాలి. ఇంకొక వెయ్యేళ్ళు మన దేశాన్ని బీజేపీనే పాలించాలనేది నా ఆకాంక్ష. సరే అది ఇంకో సబ్జెక్ట్ గనుక ప్రస్తుతం దానిని కొంచం ప్రక్కన ఉంచుదాం.
బ్రిటిష్ వాడు తన పాలించిన దేశాలన్నింటిలోనూ, దోచుకున్నంత దోచుకుని, ఆ తర్వాత చిచ్చుపెట్టి మరీ ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ చిచ్చులు ఈ నాటికీ రగులుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ కీ మనకూ పక్కపక్క సంవత్సరాలలో స్వతంత్రం వచ్చింది. మన సమస్యలు కొన్ని తీరాయి. కానీ ఇజ్రాయెల్ సమస్య మాత్రం ఈనాటికీ రగులుతూనే ఉన్నది.
ఆ రోజున గ్రహస్థితిని పైన ఇచ్చాను చూడండి.
మిడిల్ ఈస్ట్ లోని ముస్లిం దేశాలలాగే, ముస్లిం దేశం కాకపోయినప్పటికీ ఇజ్రాయెల్ కూడా ధనూరాశిలోనే ఉంటుంది. ధనూరాశి ప్రస్తుతం శనికేతువుల మధ్యన దుర్ఘటనాయోగంతో బందీ అయ్యి ఉన్నది. శని 19 డిగ్రీలలో, కేతువు 18 డిగ్రీలలో ఉన్నారు.అంతేగాక వీరి మధ్యబిందువును యుద్ధకారకుడైన కుజుడు మిధునం 13 వ డిగ్రీ పైనుంచి బలమైన సప్తమదృష్టితో చూస్తున్నాడు. యురేనస్ కోణదృష్టి మేషం 16 డిగ్రీల నుండి ధనుస్సు 16 డిగ్రీలను చూస్తోంది. ధనుస్సులో ఇది శనికేతువుల మధ్యబిందువైంది. ఈ యోగం వల్ల ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యన మళ్ళీ గొడవలు మొదలయ్యాయి.
8-5-2021 నాడు మళ్ళీ గొడవలయ్యాయి. ఆరోజున ముస్లిముల పవిత్రరాత్రి అయిన లయలతుల్ కదర్. ముస్లిముల ప్రార్ధనల అనంతరమే వాళ్ళు అందరినీ ఎటాక్ చేస్తారన్నది జగమెరిగిన సత్యం. అలాగే ఆరోజున కూడా జరిగింది. అప్పటినుంచీ నేటివరకూ ప్రతిరోజూ అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నేటికి రాకెట్ దాడులు చేసుకునే వరకూ పరిస్థితి పెరిగిపోయింది.
ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశంలో మిగతా వారిని బ్రతకనివ్వరనేది పచ్చినిజం. కానీ వాళ్ళను మిగతా వాళ్ళు ఉండనిస్తారు. దానికి కారణం పోన్లేపాపం అనే మనస్తత్వం. కానీ, మెజారిటీగా మారేకొద్దీ, వాళ్లకు ఇస్లాం పిచ్చి ముదిరిపోతుంది. పక్కవాళ్ళను కూడా మతం మారమంటారు లేదా చావమంటారు. ఈ మౌలికలోపం ఇస్లాం బోధనలలోనే ఉంది. అలాంటి దేశాలను చుట్టూ పెట్టుకుని 72 ఏళ్లుగా ఇజ్రాయెల్ నెట్టుకొస్తూ, ఇంత ఎదిగిందంటే, నిజంగా ఆ దేశాన్ని ఎంతో అభినందించాలి. నావరకూ నేను ఇజ్రాయెల్ ను ఎంతో ఇష్టపడతాను. దానికి కారణం మనకూ వారికీ సమస్యలలోను, ఆలోచనా ధోరణిలోనూ పోలికలున్నందుకేనేమో !
శనికేతువులచేత ఏర్పడిన దుర్ఘటనాయోగం, రాహుశనులచేత ఏర్పడిన శపితయోగదృష్టి, కుజదృష్టులు ఈ పరిస్థితికి ప్రేరకాలు.జూన్ 2 వరకూ నవాంశలో మిధునంలో శపితయోగం కొనసాగుతుంది. దానిదృష్టి ధనుస్సుమీద ఉంటుంది. అంతవరకూ మిడిల్ ఈస్ట్ లో ఈ గొడవలు సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.