ఇవాళ శుక్లతృతీయ. అంటే, అమావాస్య వెళ్లిన మూడవరోజు. అంటే, దాదాపుగా అమావాస్య ఛాయలోనే ఉన్నాం మనం.
ఈరోజు ఉదయం 6.30 కి చైనాలోని హుబే ప్రావిన్స్ లోని షియాన్ అనే ఊళ్ళో గ్యాస్ పైప్ లైన్ పేలిపోయి ఒక హోటల్ కూలిపోయింది. 12 మంది చనిపోయారు. 150 మంది గాయపడ్డారు.
చైనా దేశం వృశ్చికరాశిలో ఉంటుంది. దానిని లగ్నంగా తీసుకుని చూస్తే --
రాహుకేతువుల ఇరుసు వృశ్చిక లగ్నాన్ని సూటిగా కొడుతోంది. శని దృష్టి కుజునిపైన ఉన్నది. కుజుని పంచమదృష్టి వృశ్చికంలో కేతువుపైన ఉన్నది. ఇది ఆ రాశికి సూచకంగా ఉన్న చైనాలో పేలుడును సృష్టించింది.
గ్రహాలమధ్యన ప్రతిరోజూ రకరకాలైన ఈక్వేషన్స్ ఏర్పడుతూ, మారిపోతూ ఉంటాయి. వాటిని బట్టి రకరకాల సంఘటనలు ఆయా దేశాలలో జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత సంఘటన అలాంటిదే.