Pages - Menu

Pages

25, జూన్ 2021, శుక్రవారం

మయామిలో పన్నెండంతస్తుల భవనం కూలుడు - పౌర్ణమి ప్రభావం

నిన్న పౌర్ణమి. ఉదయం 1.30 కి ఫ్లోరిడాలో మయామి సబర్బ్ అయిన సర్ఫ్ సైడ్ అనేచోట ఒక పన్నెండంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ఒకరు చనిపోయారు, తొమ్మిదిమంది గాయపడ్డారు, దాదాపు వందమంది గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువమంది లాటిన్ అమెరికావాసులు. వాళ్ళు ప్రాణాలతో ఉంటారన్న నమ్మకం లేదు. శిధిలాలను తొలగించి చూస్తేగాని వాళ్ళ శరీరాలు దొరకవు. శిధిలాలను తొలగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.


ఆ సమయంలో మీనలగ్నం 12 వ డిగ్రీ ఉదయిస్తోంది. దీనికి మిగతా అన్ని గ్రహాలూ అర్గలదోషం పట్టించాయి. లగ్నం మీనమైనప్పటికీ, అమెరికా లగ్నమైన మిధునం నుంచి చూస్తే, సూర్యుడు లగ్నంలో ఉంటూ సప్తమంలోని చంద్రునివల్ల పౌర్ణమి ఏర్పడుతోంది. ఈ పౌర్ణమి అమెరికా నుంచి మిడిల్ ఈస్ట్ ను చూస్తున్నది. మిగతా అన్ని గ్రహాలూ సూర్యుడిని, మిధునరాశిని అర్గళం చేస్తున్నాయి. జలకారకుడైన శుక్రుడు కర్కాటకం 2వ డిగ్రీలో ఉంటూ ప్లుటోను ఖచ్చితమైన దృష్టితో చూస్తున్నాడు. శుక్రుడు జలగ్రహం, కర్కాటకం జలతత్వరాశి, లగ్నం మీనం మరొక జలతత్వరాశి. సర్ఫ్ సైడ్ అనే ప్రదేశం బీచ్ దగ్గరగా ఉంటుంది, అందుకని, ఈ మూడు కారకత్వాలవల్ల ప్రభావితమైంది.

50 రోజుల ప్రభావం కొనసాగుతున్నది !