Pages - Menu

Pages

4, జూన్ 2021, శుక్రవారం

రాబోయే యాభై రోజులు

2-6-2021 నుండి కుజుడు కర్కాటకరాశిలో అడుగుపెట్టాడు. అదాయనకు నీచస్థితి. ఇప్పటికే శని మకరంలో కూర్చుని తమ ప్రపంచ ప్రణాలికను అమలుచేయడానికి  ఆయనకోసం ఎదురుచూస్తున్నాడు, . వీరిద్దరి మధ్యనా సమసప్తక దృష్టి జూలై 20 వరకూ, అంటే యాభై రోజులపాటు ఉంటుంది. ఈ యాభై రోజులూ ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియాకు గడ్డురోజులు కాబోతున్నాయి.

నీచకుజుడు, శనులమధ్యన ఏర్పడుతున్న సమసప్తకదృష్టి వల్ల భూకంపాలు, వానలు, వరదలు రావడం, భవనాలు, వంతెనలు కూలడాలు, రవాణా ప్రమాదాలు మొదలైనవి జరుగుతాయి.

ఇవేగాక, కరోనా మూడోవిడత వడ్డన (థర్డ్ వేవ్) ఇదే సమయంలో వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రపంచంలోని మిగతాదేశాల సంగతెలా ఉన్నా, ఇండియాలో ఈ సూచన బలంగా ఉన్నది, మకరరాశి ఇండియాను సూచిస్తుంది గనుక. కాబట్టి మళ్ళీ వినాశనం తప్పదు !

ఇప్పటివరకూ వచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్ వరదలు, గల్ఫ్ లో, శ్రీలంక దగ్గర ఓడలు మునిగిపోవడం ఇవన్నీ రాబోయే వాటికి సాంపిల్స్ మాత్రమే. ఇండియా, మెక్సికో, కెనడా మొదలైన మకర - కర్కాటక దేశాలు ఈ యాభై రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇదిగాక ఇండియాకు శత్రువులు పెరుగుతారు. పాకిస్తాన్ నుంచి ఎదురుదాడి ఎదుర్కోవలసి వస్తుంది. అది కాశ్మీర్ పాటను మళ్ళీ అందుకుంటుంది.

ఈ యాభైరోజులలో వచ్చే పౌర్ణమి అమావాస్య పరిధులలో ఖచ్చితంగా దుర్ఘటనలు జరుగుతాయి. పరిధి అంటే ముందూ వెనుకా రెండు రోజులని అర్ధం. కనుక జాగ్రత్తలు చాలా అవసరం.

10th June 2021 - అమావాస్య + సూర్యగ్రహణం.

24th June 2021 - పౌర్ణమి

9th July 2021 - అమావాస్య

24th July 2021 - పౌర్ణమి

జాగ్రత్తపడండి మరి !